YS Viveka daughter had a meeting with CM Chandrababu :  వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో తమపై తప్పుడు కేసులు పెట్టారని వాటిపై పునర్విచారణ చేయించాలని వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె వైఎస్ సునీత, ఆమె భర్త రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి విజ్ఞప్తి చేశారు. సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబును సునీత దంపతులు కలిశారు. తన తండ్రి హత్య కేసులో న్యాయం కోసం పోరాడుతున్న తమపై..  వివేకానందరెడ్డి పీఏగా ఉన్న కృష్ణారెడ్డితో తప్పుడు కేసులు పెట్టించారని ఫిర్యాదు చేశారు. తమతో పాటు కేసులో చురుకుగా దర్యాప్తు చేస్తున్న అప్పటి సీబీఐ ఎస్పీ రాంసింగ్ పైనా కేసులు పెట్టారన్నారు. ఈ కేసుల వెనుక ఉన్న కుట్రలపై సీఐడీతో విచారణ చేయించాలని విజ్ఞప్తి చేశారు. 


వైఎస్ సునీత విజ్ఞప్తిపై చంద్రబాబు సానుకూలంగా స్పందించారు. వారిపై పెట్టిన కేసు విషయంలో విచారణ జరిపించి తగిన చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఇప్పటికే తనకు అన్ని విషయాలు తెలుసని  భరోసా ఇచ్చారు. తన తండ్రి వైఎస్ వివేకా హత్య కేసులో నిందితులకు శిక్ష పడేలా చేసేందుకు వైఎస్ సునీత సుదీర్ఘంగా పోరాటం చేస్తున్నారు. గత ప్రభుత్వంలో ఆమెపై కేసులు నమోదయ్యాయి. సీబీఐ విచారణ జరుపుతున్న సమయంలో వివేకా పీఏగా పని చేసిన కృష్ణారెడ్డి..  సీబీఐపై ఆరోపణలు చేశారు. అలాగే వైఎస్ సునీత, రాజశేఖర్ రెడ్డిలపైనా ఆరోపణలు చేశారు. వాటిపై కేసులు నమోదయ్యాయి. ఇవి ఉద్దేశపూర్వకంగా పెట్టిన తప్పుడు కేసులని .. తన తండ్రి హత్య కేసులో నిందితుల్ని రక్షించడానికి పెట్టిన కేసులని వాదిస్తున్నారు. 


మా వీడియో వైరల్ చేసిన కుక్కల్ని దేవుడే శిక్షిస్తాడు - ఏపీ మంత్రి ఆగ్రహం


గత ప్రభుత్వంలో రాజకీయ లబ్ది కోసం.. అప్పటి ప్రభుత్వ పెద్దల కోసం అవసరమైన వారందరిపై తప్పుడు కేసులు పెట్టారని కొంత మంది ఐపీఎస్ అధికారులపై ఆరోపణలు వస్తున్నాయి. ముంబై హీరోయిన జెత్వానీ కేసులో ఇప్పటికే ముగ్గురు ఐపీఎస్ అధికారుల్ని సస్పెండ్ చేశారు. వారి విషయంలో సంపూర్ణంగా ఆధారాలు సేకరించినట్లుగా తెలుస్తోంది. వివేకా కేసులోనూ ఇలా పెద్ద ఎత్తున ఐపీఎస్ లను దుర్వినియోగం చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. ఏకంగా సీబీఐ అధికారులపైనే కేసులు పెట్టడం దేశ్యాప్తంగా సంచలనం సృష్టించింది.  తండ్రి హత్య కేసులో సునీతపైనే ఆరోపణలు కూడా ఉద్దేశపూర్వకంగా చేయించారన్న ఆరోపణలు ఉన్నాయి.


తర్వాత సునీత కేసు విచారణను సుప్రీంకోర్టుకు వెళ్లి తెలంగాణకు మార్పించుకున్నారు. అప్పట్లో కడప ఎస్పీగా పని చేసిన అన్బురాజన్ తో పాటు.. కర్నూలులో సీబీఐ అరెస్టు చేయడానికి వెళ్లినా .. కనీసం సహకరించకుండా .. వ్యవహరించిన అప్పటి కర్నూలు ఎస్పీ వ్యవహారంపైనా ఇప్పుడు ప్రభుత్వం దృష్టి సారించినట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు వారెవరికి పోస్టింగులు ఇవ్వలేదు. వారు చేసిన తప్పులను బయటకు తీసి కేసులు నమోదు చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉంది.  


మేకపాటి విరాళానికి రాజకీయం అడ్డంకి- చంద్రబాబుకు స్పీడ్ పోస్టు- తెలంగాణలో మాత్రం నేరుగా అందజేత!


వైఎస్ సునీత చంద్రబాబుతో భేటీ తర్వాత.. బీటెక్ రవి కూడా .. కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. గతంలో ఓ సారి వైెఎస్ సునీత.. హోంమంత్రి వంగలపూడి అనితతో సమావేశం అయ్యారు.