Sajjala :   ఆంధ్రప్రదేశ్‌లో ఏదో జరిగిపోతోందన్నట్లుగా.. పథకం ప్రకారమే విపక్షాలు ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తన్నాయని ఏపీ ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. అమరావతిలో వైసీపీ ఆఫీసులో మీడియాతో మట్లాడిన ఆయన .. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ల తీరుపై మండిపడ్డారు. 


చంద్రబాబు ఏదో జరగాలని ప్లాన్ చేశారు  !                      


పుంగనూరు పర్యటనలో చంద్రబాబు ఏదో  జరగాలని ప్లాన్ చేశారని సజ్జల ఆరోపించారు. పోలీసులపై దాడులు చేశారని వారు సంయమనం కోల్పోయి కాల్పులు జరపాలని అనుకున్నారని సజ్జల అన్నారు. అయితే పోలీసులు సంయమనంతో వ్యవహరించారన్నారు. చేసిందంతా చేసి ఇప్పుడు తనపై హతాయత్నం జరిగిందని రాష్ట్రపతి, ప్రధానులకు లేఖ రాశారని సజ్జల విమర్శించారు. చంద్రబాబు తాను ఏదో విప్లవం చేస్తున్నట్లుగా బిల్డప్ ఇస్తున్నారని ఆరోపించారు. పుంగనూరు, అంగళ్లలో  పోలీసులను కొట్టారు.. వాహనాలను తగులబెట్టారన్నారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఏపీకి సీబీఐని రానివ్వలేదని.. ఇప్పుడు సీఐ విచారణ కావాలని అడుగుతున్నారని విమర్శించారు. ఏపీలో ఏమీ జరగకపోయినా ఉన్నది లేనట్లు.. లేనిది ఉన్నట్లుగా చూపిస్తన్నారని ఆరోపించారు. 


రాజకీయాల్లో ఉన్నంత కాలం గన్నవరం నుంచే పోటీ- వంశీతో కలవడం కష్టం: యార్లగడ్డ


పవన్ కల్యాణ్ స్పీచుల్లో అరుపులు, కేకలు తప్ప ఏమీ లేవు !                     


పవన్ కల్యాణ్‌పైనా సజ్జల రామకృష్ణారెడ్డి విరుచుకుపడ్డారు. పిచ్చి పట్టినట్లుగా అరిస్తే. ఆయన చుట్టూ చేసిన అభిమానులు అరుపులు, కేకలు వేయడం సహజమేనన్నారు.  తాము చేసిన ఘన కార్యాలు చెప్పుకుని ప్రజల దగ్గరకు వెళ్ళే అవకాశం చంద్రబాబుకు ఉంది. దత్త పుత్రుడికి ఆ అవకాశం లేదు. అధికారంలో రావాలనే ఉద్దేశం కూడా దత్త పుత్రుడికి ఉన్నట్లు లేదన్నారు. . వ్యక్తిత్వ హననం చేయటం .. కారు కూతలు కూయడం మాత్రమే పవన్ కల్యాణ్  చేస్తున్నారన్నారు.  పవన్ కళ్యాణ్ యజమాని చంద్రబాబే  ... చంద్రబాబు డైరెక్షన్ లో పవన్‌ ఆరోపణలు చేస్తున్నాడని మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ వి కారు కూతలు… ఎందుకు అంతలా ఊగటం అని ప్రశ్నించారు.  సినిమా హీరో వేసే డైలాగులకు అభిమానుల నుంచి ఈలలు ఎక్కడైనా కనిపిస్తాయన్నారు. మేం గట్టిగా మాట్లాడితే దాని పై ఇంకో రకంగా రియాక్ట్ అవుతారని  అన్నారు.                                 


తెలంగాణలో ఎకరాకు రూ.100 కోట్లు, కులమే కారణమా? సీఎం జగన్ కు లోకేష్ కౌంటర్


విపక్షాలు అరాచక శక్తుల మూక 


విపక్ష పార్టీలను అరాచక శక్తుల మూకగా అభివర్ణించారు సజ్జల రామకృష్ణారెడ్డి.   చంద్రబాబు డైరెక్షన్ లో ఆరోపణలు చేస్తున్నారన్నారు.  చల్లని నాణాలు లాంటి పార్టీలు. ఫుల్ సైజ్ ఆర్కెస్ట్రాతో హడావుడి చేస్తున్నాయని ..   శబ్ద కాలుష్యం లాంటి విమర్శలు చేస్తున్నాయని విమర్శించారు. చేసింది చెప్పుకోవటానికి, ప్రజల ఆశీస్సులు మళ్ళీ పొందటానికి మేం ప్రయత్నం  చేస్తున్నామన్నారు.