Weather Latest News: నైరుతి బంగాళాఖాతం మీదుగా ఏర్పడిన తుఫాను (MIGJAUM) గత 6 గంటల్లో 5 kmph వేగంతో వాయువ్య దిశగా కదిలింది. డిసెంబర్ 3, 2023 IST 08.30 గంటల IST అక్షాంశం 11.5 సమీపంలో అదే ప్రాంతంలో పుదుచ్చేరికి తూర్పు-ఆగ్నేయంగా 290 కి.మీ, చెన్నైకి ఆగ్నేయంగా 290 కి.మీ, నెల్లూరుకు ఆగ్నేయంగా 420 కి.మీ, బాపట్లకు ఆగ్నేయ దిశలో 530 కి.మీ, మచిలీపట్నానికి ఆగ్నేయంగా 530 కి.మీ. కేంద్రీకృతమై ఉంది. ఇది వాయువ్య దిశగా పయనిస్తూ, మరింత బలపడి, డిసెంబర్ 4వ తేదీ ఉదయం నాటికి దక్షిణ ఆంధ్ర ప్రదేశ్, ఉత్తర తమిళనాడు తీరాలకు ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతం చేరుకునే అవకాశం ఉంది. ఆ తర్వాత, ఇది ఉత్తరం వైపుకు కదిలి దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరానికి సమాంతరంగా కదులుతూ డిసెంబర్ 5వ తేదీ ముందు మధ్యాహ్నం సమయంలో దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరానికి దగ్గరగా నెల్లూరు, మచిలీపట్నం మధ్య తీవ్ర తుఫాన్ గా తీరం దాటే అవకాశం ఉంది.
ఈ రోజు తెలంగాణా రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. రేపు రాష్ట్రంలో తెలికపాటి నుండి మోస్తారు వర్షాలు కొన్ని చోట్ల, ఎల్లుండి చాల చోట్ల కురిసే అవకాశం ఉంది.
వాతావరణ హెచ్చరికలు (Weather Warnings)
రేపు తెలంగాణ రాష్ట్రంలో భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ జిల్లాలలో ఉరుములు మరియు మెరుపులతో కూడిన భారీ వర్షాలతో పాటు ఈదురు గాలులు గంటకు 40 నుండి 50 కి.మి. వేగంతో వీచే అవకాశం వుంది. కొన్ని జిల్లాలలో ఉరుములు మరియు మెరుపులతో కూడిన తెలికపాటి నుండి మోస్తారు వర్షాలతో పాటు ఈదురు గాలులు గంటకు 30 నుండి 40 కి.మి. వేగంతో వీచే అవకాశం వుంది. ఎల్లుండి రాష్ట్రంలో జయశంకర్ భూపాలపల్లె, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం మరియు సూర్యాపేట జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు మరియు మెరుపులతో కూడిన భారీ నుండి అతిభారీ వర్షాలు మరియు నల్గొండ, మహబూబాబాద్, వరంగల్ మరియు హన్మకొండ జిల్లాలలో అక్కడక్కడ భారీ వర్షాలతో పాటు ఈదురు గాలులు గంటకు 40 నుండి 50 కి.మి. వేగంతో వీచే అవకాశం వుంది. కొన్ని జిల్లాలలో ఉరుములు మరియు మెరుపులతో కూడిన తెలికపాటి నుండి మోస్తారు వర్షాలతో పాటు ఈదురు గాలులు గంటకు 30 నుండి 40 కి.మి. వేగంతో వీచే అవకాశం వుంది.
ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణం
ఏపీలో భారీ నుంచి అతి భారీ, అత్యంత భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాంలో ఈ పరిస్థితి ఉండవచ్చు. ఉరుములు మెరుపులు రెండు మూడు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈదురు గాలులు గంటకు 45 నుంచి 55 కిలో మీటర్లు గరిష్ఠంగా 65 కిలో మీటర్ల వేగంతో వీస్తాయి.
దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాంలో భారీ నుంచి అతి భారీ, అత్యంత భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములు మెరుపులు రెండు మూడు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈదురు గాలులు గంటకు 45 నుంచి 55 కిలో మీటర్లు గరిష్ఠంగా 65 కిలో మీటర్ల వేగంతో వీస్తాయి.
రాయలసీమలో భారీ నుంచి అతి భారీ, అత్యంత భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములు మెరుపులు రెండు మూడు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈదురు గాలులు గంటకు 45 నుంచి 55 కిలో మీటర్లు గరిష్ఠంగా 65 కిలో మీటర్ల వేగంతో వీస్తాయి.