ఆగ్నేయ బంగాళాఖాతం, దానిని ఆనుకొని ఉన్న ప్రాంతంలో ఉన్న ఉపరితల ఆవర్తనం ప్రభావం వల్ల అదే ప్రాంతంలో ఒక అల్పపీడనం ఏర్పడింది. దీనికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 4.5 కిలో మీటర్ల ఎత్తు వరకూ వ్యాపించి ఉంది. ఇది రాగల 36 గంటల్లో నైరుతి బంగాళాఖాతం ప్రాంతంలో వాయు గుండంగా బలపడే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇది పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించి, ఉత్తర తమిళనాడు తీరానికి నవంబరు 11 ఉదయం నాటికి చేరుకొనే అవకాశం ఉంది.
వీటి ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకూ వాతావరణం ఇలా ఉండనున్నట్లు అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం అధికారులు ట్వీట్ చేశారు.
ఉత్తర కోస్తా ఆంధ్రలో ప్రధానంగా పొడి వాతావరణం ఉంటుంది. ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది.
దక్షిణ కోస్తా ఆంధ్రలో తేలికపాటి వర్షాలు లేదా జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు అనేక చోట్ల విస్తారంగా కురిసే అవకాశం ఉంది. ఒకటి లేదా రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు చాలా చోట్ల విస్తారంగా కురిసే అవకాశం ఉంది. భారీ నుంచి అతి భారీ వర్షాలతో పాటు ఒకటి లేదా రెండు చోట్ల అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ఇక రాయలసీమలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల మాత్రమే కురిసే అవకాశం ఉంది. రేపు ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు అనేక చోట్ల విస్తారంగా కురిసే అవకాశం ఉంది. ఒకటి లేక రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు చాలా చోట్ల విస్తారంగా కురిసే అవకాశం ఉంది. భారీ నుంచి అతి భారీ వర్షాలతో పాటు ఒకటి లేదా రెండు చోట్ల అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
తెలంగాణలో వాతావరణం ఇలా..
తెలంగాణలో ఎక్కువగా వాతావరణం పొడిగానే ఉండే అవకాశం ఉందని హైదరాబాద్‌లోని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉరుములతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం చాలా తక్కువ ప్రాంతాల్లో ఉండే అవకాశం ఉంటుందని అంచనా వేశారు.
Also Read: కుప్పంలో ఎన్నికల టెన్షన్.. మున్సిపల్ కమిషనర్ కు పసుపు కుంకుమ అందజేసిన టీడీపీ నేతలు
Also Read : ఎయిడెడ్ స్కూళ్ల నిర్ణయంపై తీవ్ర వ్యతిరేకత ! ఏపీ సర్కార్ ఏం చెబుతోంది ? ఏం జరుగుతోంది ?