AP Weather Updates: తెలంగాణలో చలి ఓ మోస్తరుగా ఉన్నా, ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం చలి తీవ్రత అలాగే ఉంది. రెండు వైపుల నుంచి వీచే గాలులతో ఉదయం వేళ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఏపీ, యానాంలలో ఉత్తర, ఈశాన్య దిశల నుంచి చలిగాలులు తక్కువ ఎత్తులో వేగంగా వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ఫలితంగా రాష్ట్రంలో మరో మూడు రోజులు వాతావరణం పొడిగా ఉండనుంది. రాయలసీమలో కనిష్ట ఉష్ణోగ్రతలు పెరుగుతుండగా, కోస్తాంధ్రలో చలి తీవ్రత అధికంగా ఉంది.


ఈశాన్య, ఉత్తర దిశ నుంచి వీచే గాలులతో ఉత్తర కోస్తా ఆంధ్ర, యానాం  ప్రాంతాల్లో వాతావరణం పొడిగా ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో ఏజెన్సీ ఏరియాలో చలి ఎక్కువగా ఉంది. మరో రెండు రోజులపాటు వాతావరణం పొడిగా ఉంటుందని అధికారులు వెల్లడించారు. రైతులు ధాన్యం విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. మత్స్యకారులు వేటకు వెళ్లడానికి ఏ ఇబ్బంది లేదని లేదని అధికారులు సూచించారు. కళింగపట్నంలో 16.4 డిగ్రీలు, జంగమేశ్వరపురంలో 17.6 డిగ్రీలు, నందిగామలో 17.5 డిగ్రీలు, బాపట్లలో 18.2, అమరావతిలో 18.6 డిగ్రీల మేర కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.






దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలో నేటి నుంచి మరో రెండు రోజులపాటు వాతావరణం సాధారణంగా ఉంటుంది. వాతావరణంలో పెద్దగా మార్పులు ఉండవు. కోస్తాంధ్రతో పోల్చితే చలి తీవ్రత మాత్రం ఇక్కడ చాలా వరకు తగ్గినట్లు వెల్లడించింది. తావరణం పొడిగా ఉంటుందని అధికారులు తెలిపారు. కోస్తాంధ్రతో పోల్చితే రాయలసీమలో చలి తీవ్రత అధికంగా ఉంది. ఆరోగ్యవరంలో 19 డిగ్రీలు, అనంతపురంలో కనిష్ట ఉష్ణోగ్రత 19.1 డిగ్రీలు, నంద్యాలలో 19.6 డిగ్రీలు, కర్నూలులో 20 డిగ్రీల మేర కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ కేంద్రం తెలిపింది.


తెలంగాణ వెదర్ అప్‌డేట్..
తెలంగాణలో వాతావరణం సాధారణంగా ఉండనుంది.  అయితే కొన్ని జిల్లాల్లో తేలికపాటి జల్లుల నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, కొమురంభీమ్, నిర్మల్, జగిత్యాల, మంచిర్యాల జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయింది. ఆగ్నేయ దిశ నుంచి గంటకు 4 నుంచి 6 కిలోమీటర్ల వేగంతో రాష్ట్రంలో గాలులు వీస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అయితే ఉదయం వేళ కొన్ని చోట్ల పొగమంచు ఏర్పడే అవకాశం ఉంది. కనిష్ట ఉష్ణోగ్రత 16 డిగ్రీలు ఉండగా, గరిష్ట ఉష్ణోగ్రతలు 33 డిగ్రీల వరకు నమోదు అవుతున్నాయి.


Also Read: Trs Vs Bjp: మంత్రి కేటీఆర్, కిషన్ రెడ్డి మధ్య ట్వీట్ల వార్, ఈక్వాలటీ ఫర్ తెలంగాణపై వాడీవేడీ ట్వీట్లు


Also Read: Gold-Silver Price: నేడు ఎగబాకిన బంగారం, దిగొచ్చిన వెండి.. నేటి తాజా ధరలు ఇవీ