Telangana Temperature Today: చలిగాలుల కాస్త తగ్గడంతో తెలుగు రాష్ట్రాల్లో వాతావరణంలో మార్పులు కనిపిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా ఉత్తర దిశ నుంచి వీస్తున్న గాలులతో ఉత్తరాంధ్రలో, తూర్పు దిశ నుంచి గాలులు వీచడంతో దక్షిణ ఆంధ్రప్రదేశ్, రాయలసీమలో ఉష్ణోగ్రతలు తగ్గిపోయాయి. గాలులు వీస్తున్నప్పటికీ తాజాగా ఉష్ణోగ్రతలు కాస్త పెరుగుతున్నాయి. ప్రస్తుతం ఆగ్నేయ దిశగా గాలులు వీచడం మొదలైనట్లు అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. మరో రెండు రోజులు వాతావరణం పొడిగా ఉంటుందని వర్షాలు కురిసే అవకాశం లేదని సమాచారం. ఉత్తరాది గాలుల ప్రభావం తగ్గడంతో ఏపీ, తెలంగాణలో కనిష్ట ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి.
ఉత్తర కోస్తాంధ్ర, యానాం ప్రాంతాలలో కొన్ని చోట్ల పొగ మంచు కురియడంతో చలి తీవ్రత అధికంగా ఉంటుందని అధికారులు హెచ్చరించారు. అయితే కనిష్ట ఉష్ణోగ్రతలు కాస్త పెరగనున్నాయి. విశాఖపట్నం ఏజెన్సీ ప్రాంతాల్లో చలి తీవ్రత తగ్గుతోంది. విశాఖపట్నం జిల్లాలోని అరకు లోయలో అత్యల్పంగా 9.2 డిగ్రీలు, చింతపల్లిలో 13.9 డిగ్రీలు, జీకే వీడిలో 8.2 డిగ్రీలు, పెదబయలులో 8.3 డిగ్రీలు, మాడుగులలో 12.5 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇటీవల 6 కంటే తక్కువ దిగ్రీలు నమోదైన ఉష్ణోగ్రతలు తాజాగా 8 డిగ్రీలు పైగా నమోదయ్యాయి. కొన్ని చోట్ల పొగమంచు కురిసే అవకాశం ఉందని, ఉదయం వేళ వాహనాలు జాగ్రత్తగా నడపకపోతే ప్రమాదాలు జరుగుతాయని అధికారులు ప్రజలకు సూచించారు.
గత కొన్ని రోజులతో పోల్చితే కనిష్ట ఉష్ణోగ్రతలు కాస్త పెరిగాయి. దక్షిణ కోస్తాంద్రలో మరో రెండు రోజులు వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉందని అమరావతి వాతావరణ శాఖ తెలిపింది. రాయలసీమలో చలి తీవ్రత అదే విధంగా ఉంది. విశాఖ అరకుకి పోటిగా చిత్తూరు జిల్లా హార్స్‌లీ హిల్స్ లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. హార్స్‌లీ హిల్స్ లో7.8 డిగ్రీలు నమోదయ్యింది. జిల్లాలోని అరోగ్యవరంలో 9.9 డిగ్రీలు, మదనపల్లెలో 10.3 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదు అవుతాయని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. అనంతపురం జిల్లా మడకశిరలో 9.9 డిగ్రీలు, కుందుర్పిలో 10.2 డిగ్రీలు, సోమండెపల్లెలో 11 డిగ్రీలు.. కర్నూలు జిల్లా మంత్రాలయంలో 11.7 డిగ్రీలు, హలహర్విలో 12.8 డిగ్రీలు.. కడప జిల్లాలో రాయచోటిలో 12.5 డిగ్రీలల మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
Also Read: ITR Filing: ఐటీఆర్ ఫైల్ చేయండి.. బుల్లెట్టు గెలవండి! మరో రూ.లక్ష కూడా పొందొచ్చు.. కేంద్రం ఆఫర్!!
తెలంగాణ వెదర్ అప్‌డేట్..
తెలంగాణలో వాతావరణంలో పెద్దగా మార్పులు లేవని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. నేటి నుంచి రెండు రోజులపాటు వాతావరణ పొడిగా ఉంటుంది. ఏజెన్సీ ప్రాంతాలతో పాటు కొన్ని చోట్ల ఉదయం పొగమంచు కురిసే అవకాశం ఉంది. డిసెంబర్ 28, 29 తేదీలలో అక్కడక్కడా తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు. ఆదిలాబాద్, కొమురం భీమ్, ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, కామారెడ్డి, కరీంనగర్, ములుగు, రంగారెడ్డి, సంగారెడ్డి, మెదక్ జిల్లాలలో చలి గాలుల ప్రభావం అధికంగా ఉండటంతో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి.
Also Read: PAN card Update: పెళ్లైన తర్వాత పాన్ కార్డులో ఇంటి పేరు మార్చుకోవాలా..? ఇలా చేయండి