Viveka Murder Case: వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణ కొనసాగుతుండగా సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ కు కడప ఎంపీ అవినాష్ రెడ్డి లేఖ రాశారు. మాజీ ఎంపీ వివేకా కేసును గతంలో విచారించిన ఎస్పీ రామ్ సింగ్ పై అవినాష్ రెడ్డి ఫిర్యాదు చేశారు. రాం సింగ్ పక్షపాత వైఖరితో వివేకా హత్య కేసు దర్యాప్తు చేశారని ఆరోపించారు. గతంలో విచారణాధికారి రాం సింగ్ చేసిన  దర్యాప్తు తీరును సమీక్షించాలని సీబీఐకి రాసిన లేఖలో అవినాష్ రెడ్డి కోరారు. 


వివేకా హత్య కేసులో సీబీఐ దాఖలు చేసిన రెండు ఛార్జ్ షీట్ల ఆధారంగా వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ కు ఈ లేఖ రాశారు. దస్తగిరి నిలకడలేని సమాధానాల ఆధారంగా రాంసింగ్ విచారణ జరిపారన్నది అవినాష్ రెడ్డి ప్రధాన ఆరోపణ. కాగా, చిన్నాన్న వివేకా రెండో వివాహం, బెంగళూరు ల్యాండ్ సెటిల్మెంట్ అంశాలను తన లేఖలో ఎంపీ ప్రస్తావించారు. రెండో భార్య పేరుతో ఉన్న ఆస్తి పత్రాలను ఎత్తుకెళ్లడానికే హత్య చేసి ఉండొచ్చు అనే కోణంలో అసలు విచారణ జరగలేదని పలు అనుమానాలు వ్యక్తం చేశారు అవినాష్ రెడ్డి. అయితే మున్నా లాకర్లో నగదు వివరాలు సీబీఐకి ఎవరు చెప్పారని, విచారణలో రాంసింగ్ చేసిన తప్పులను సవరించాలని సైతం కోరుతూ లేఖ రాశారు. ఈ కేసులో అసలైన నేరస్తులను అరెస్ట్ చేసి, వివేకా హత్య కేసులో న్యాయం చేయాలని సీబీఐ డైరెక్టర్ ను కోరారు. 


వివేకా హత్య కేసులో కీలకంగా వైఎస్ సునీత వాంగ్మూలం 
వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ దాఖలు చేసిన చార్జిషీటులో అనేక కీలక విషయాలు ఉన్నాయి. వివేకా కుమార్తె సునీత ఇచ్చిన వాంగ్మూలం వెలుగులోకి వచ్చింది. ఇందులో పలు విషయాలను సునీత వెల్లడించారు. వివేకా హత్య కేసు ఛార్జ్‌షీట్‌తో సునీత వాంగ్మూలాలను కోర్టుకు సమర్పించారు సీబీఐ అధికారు.  


ఇంటికొచ్చి కలిసిన వైఎస్ భారతి 
కేసు విచారమ జరుగుతున్న సమంయలో ..ఇంటికొచ్చి కలుస్తానంటూ 2019 మార్చి 22న భారతి ఫోన్ చేశారని సీబీఐకి సునీత వాంగ్మూలం ఇచ్చారు. తాను కడప, సైబరాబాద్ కమిషనరేట్ వెళ్లాల్సి ఉందని భారతికి చెప్పానని..  ఎక్కువ టైం తీసుకోనంటూ భారతి వెంటనే ఇంటికి వచ్చేశారన్నారు.  వైఎస్ భారతి వెంట   విజయలక్ష్మి, అనిల్ రెడ్డి,  సజ్జల రామకృష్ణారెడ్డి కూడా రావడంతో తాను ఆశ్చర్యపోయానన్నారు.  లిప్టు దగ్గరే నిలబడి భారతి తనతో మాట్లాడారని..  వైఎస్ భారతి ఆందోళనగా ఉన్నట్టు నాకు అనిపించిందన్నారు. నాన్న మృతి తర్వాత తొలిసారి ఇంటికొచ్చినందున భారతి బాధగా ఉన్నారని అనుకున్నానన్నారు.  ఇకపై ఏం చేసినా సజ్జలతో టచ్ లో ఉండాలని భారతి తనకు చెప్పారని సీబీఐకి తెలిపారు. 


రెండు కుటుంబాల మధ్య చాలా కాలంగా గొడవలు 
అవినాష్ అభ్యర్థిత్వానికి మా నాన్న కోరుకోలేదని తెలుసని సునీత స్పష్టం చేశారు.  రెండు కుటుంబాల మధ్య దశాబ్దాలుగా గొడవలున్నాయన్నారు.   గదిని శుభ్రం చేయడంపై దర్యాప్తు చేయాలని తాను అడిగానని  పొరపాటు జరిగిందని తెలుసు.. క్రిమినల్ మైండ్ ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోలేదన్నారు.  జగనన్నను సీఎంగా చూడాలని నాన్న చాలా కష్టపడ్డారని..– ఎవరో చేసిన పొరపాటుకు మళ్లీ జగన్ నష్టపోవాలా అని ఆలోచించానని తెలిపారు.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి    
Join Us on Telegram: https://t.me/abpdesamofficial