Restaurant Employee Fired: 


యూకే రెస్టారెంట్‌లో..


యూకేలోని ఓ రెస్టారెంట్‌లో మహిళా ఉద్యోగిని ఉన్నట్టుండి తొలగించింది యాజమాన్యం. ఎందుకు అని అడిగితే "డ్యూటీలో ఫోన్ వాడినందుకు" అని సమాధానమిచ్చారు ఓనర్‌లు. రెండు వారాల క్రితమే ఆ మహిళ అక్కడ సర్వెంట్‌గా జాయిన్ అయింది. ఇంతలోనే ఈ సాకు చెప్పి ఉద్యోగంలో నుంచి తీసేసింది రెస్టారెంట్. దీనిపై అసహనం వ్యక్తం చేసిన మహిళ ఓ సెల్ఫీ వీడియో తీసుకుని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. సిల్లీ రీజన్‌తో తనను ఉద్యోగంలో నుంచి తీసేశారని మండి పడింది. "నా లైఫ్‌లో ఇలాంటి దారుణమైన అనుభవం ఎప్పుడూ ఎదుర్కోలేదు. ఏ కారణం లేకుండానే నన్ను తిట్టారు. కనీసం ఎందుకు తీసేస్తున్నారో కూడా చెప్పకుండా తొలగించారు" అని చెప్పింది. అయితే...తనను ఉద్యోగంలో నుంచి తీసేసే రోజు ఉదమయే ఓనర్ తనను చూశాడని ఆ సమయంలో తన ఎగ్జామ్ రిజల్ట్స్ కోసం చాలా ఎగ్జైటింగ్‌గా చూస్తున్నానని వివరించింది. రిజల్స్ట్ చెక్ చేసుకునేందుకు ఫోన్ వాడాల్సి వచ్చిందని తెలిపింది. 


"నేను సరిగ్గా పని చేయడం లేదని ఎప్పుడూ ఆయన చెప్పలేదు. ప్రతి ఆర్డర్‌ని కరెక్ట్ టైమ్‌కి సర్వ్ చేశాను. నాకు పొగరు అని ఓ అబద్ధాన్ని సృష్టించారు. ఇది తెలిసి నాకు చాలా కోపం వచ్చింది. ఆ తరవాతే నన్ను జాబ్‌లో నుంతి తీసేశారని తెలిసింది. నిజమేనా అని అడిగాను. అవును అని వాళ్లు బదులిచ్చారు. ఆ తరవాత నేను అఫీషియల్‌గా మెయిల్‌ కూడా చేశాను. అప్పుడు కూడా కన్‌ఫమ్ చేశారు. కానీ నాతో నేరుగా ఈ విషయం చెప్పలేదు. ఏదోటి తేల్చుకుందాం అని నేరుగా వెళ్లి నిలదీశాను. నేను నాలుగు గంటల పాటు ఫోన్ చూశానని చెప్పాడు. నా స్క్రీన్ టైమ్ ట్రాకర్‌ని ఓపెన్ చేసి చూపించాను. అందులో నేను 2 గంటల 40 నిముషాలు మాత్రమే వాడినట్టు క్లియర్‌గా చూపించింది. నేను కిచెన్‌లో కూర్చుని ఉంటే ఆర్డర్‌లు ఎలా ఇవ్వగలిగాను"


- బాధితురాలు


చాట్‌జీపీటీతో ఉద్యోగాలకు గండం..


AI టూల్స్, ChatGPTతో కంటెంట్ రాస్తున్న వాళ్లపై ఫైర్ అవుతున్నాయి కంపెనీలు. ఓ యువతిని ఇలానే తొలగించింది కంపెనీ. మార్కెటింగ్‌తో పాటు ఫ్రీనాల్స్ కంటెంట్ రైటింగ్ చేస్తున్న ఆమె...చాట్‌ జీపీటీతో కంటెంట్ రాసింది. టైమ్‌లైన్ దాటిపోతుందన్న టెన్షన్‌ని తట్టకోలేక, సొంతగా కంటెంట్ రాయలేక ఇబ్బంది పడింది. ఇక తప్పని పరిస్థితుల్లో చాట్‌జీపీటీ సాయంతో కంటెంట్ రాసింది. టైమ్‌కి కరెక్ట్‌గా అన్ని ఆర్టికల్స్ పంపేసింది. కొద్ది రోజుల వరకూ పై నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. ఆ తరవాత ఉన్నట్టుండి ఓ మెయిల్ వచ్చింది. "టర్మినేట్ చేస్తున్నాం" అని తేల్చి చెప్పాడు ఆమె బాస్. ఎందుకని ఆరా తీస్తే అసలు విషయం తెలిసింది. AI Content డిటెక్టర్‌తో ఆ ఆర్టికల్స్‌ని చెక్ చేసింది కంపెనీ. అవి AI జనరేటెడ్ కంటెంట్ అని తెలిసిన వెంటనే ఆమెను ఉద్యోగంలో నుంచి తొలగించింది. జీతంలోనూ కోత విధించింది. తన గోడునంతా సోషల్ మీడియాలో చెప్పుకుని బాధ పడింది ఆ బాధితురాలు.


Also Read: Hijack Truck: హైవేపై ఓ జంట హైడ్రామా, యాక్సిడెంట్ పేరు చెప్పి టమాటాలున్న ట్రక్‌ చోరీ