Extra Ordinary Man First Look : 'ఎక్స్‌ట్రా - ఆర్డినరీ మ్యాన్'గా నితిన్ - హీరో వేరియేషన్ చూశారా?

Nithiin 32 Ttitle and First Look : నితిన్ హీరోగా వక్కంతం వంశీ దర్శకత్వం వహిస్తున్న సినిమాకు టైటిల్ కన్ఫర్మ్ చేశారు. ఈ రోజు ఫస్ట్ లుక్ కూడా విడుదల చేశారు. 

Continues below advertisement

నితిన్ (Nithiin New Movie) కథానాయకుడిగా ప్రముఖ రచయిత వక్కంతం వంశీ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోన్న సంగతి ప్రేక్షకులకు తెలుసు. హీరోగా నితిన్ 32వ చిత్రమిది. ఈ సినిమాకు 'ఎక్స్‌ట్రా' (Extra Ordinary Man Movie First Look) టైటిల్ ఖరారు చేశారు. ఆర్డినరీ మ్యాన్ అనేది ఉపశీర్షిక. ఈ రోజు టైటిల్ వెల్లడించడంతో పాటు సినిమాలో హీరో ఫస్ట్ లుక్ కూడా విడుదల చేశారు.

Continues below advertisement

రెండు లుక్కులో నితిన్...
ఆ వేరియేషన్ చూశారా?
'ఎక్స్‌ట్రా- ఆర్డినరీ మ్యాన్' ఫస్ట్ లుక్ చూశారా? అందులో రెండు గెటప్పుల్లో నితిన్ కనిపించారు. కింద కూర్చున్న లుక్కులో మాంచి స్టైలిష్ గా కనపడితే... పైన లుక్కులో గుబురు గడ్డంతో కనిపించారు. ఆ రెండు లుక్కులో ఏది ఎక్స్ట్రా, ఏది ఆర్డినరీ అనేది చూడాలి. 

నితిన్ జోడీగా శ్రీ లీల
'ఎక్స్‌ట్రా - ఆర్డినరీ మ్యాన్' సినిమాలో నితిన్ జోడీగా యంగ్ సెన్సేషనల్ హీరోయిన్ శ్రీ లీల నటిస్తున్నారు. వీళ్ళిద్దరి కలయికలో తొలి చిత్రమిది. రాజ్ కుమార్ ఆకెళ్ళ సమర్పణలో శ్రేష్ఠ్ మూవీస్ పతాకంపై ఆదిత్య మూవీస్ & ఎంటర్టైన్మెంట్స్, రుచిర ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ భాగస్వామ్యంతో నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి, సోదరి నిఖితా రెడ్డి నిర్మిస్తున్నారు.

Also Read : అసలు సిసలైన పాన్ ఇండియా కాస్ట్ - మోహన్ లాల్ 'వృషభ' షూటింగ్ మొదలు

డిసెంబర్ 23న 'ఎక్స్‌ట్రా - ఆర్డినరీ మ్యాన్'  
ఫస్ట్ లుక్, టైటిల్ విడుదల చేయడంతో పాటు 'ఎక్స్‌ట్రా' - ఆర్డినరీ మ్యాన్' విడుదల తేదీని కూడా నేడు  వెల్లడించారు. డిసెంబర్ 23న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నట్లు చెప్పారు. సాధారణంగా సినిమాకు శుక్రవారం విడుదల అవుతాయి. కానీ, ఈ సినిమాను శనివారం విడుదల చేస్తున్నారు. అంటే... 23 శనివారం వచ్చినా, 25 క్రిస్మస్ కనుక అప్పటి వరకు సెలవులు ఉంటాయి. హాలిడేస్ కాబట్టి సినిమా ఓపెనింగ్స్ బావుండే అవకాశం ఉంది.

ఆల్రెడీ 60 శాతం సినిమా పూర్తి
'ఎక్స్‌ట్రా - ఆర్డినరీ మ్యాన్' సినిమా చిత్రీకరణ 60 శాతం పూర్తి అయ్యిందని చిత్ర నిర్మాతలు తెలిపారు. ఇది అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ సినిమా అని, అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని చెప్పారు. ప్ర‌స్తుతం చిత్రీక‌రణ శ‌ర‌వేగంగా జ‌రుగుతోందన్నారు. నితిన్ లుక్ చాలా కొత్త‌గా ఉందని అభిమానులు చెప్పడం సంతోషంగా ఉందని, ఫ్యాన్స్ లుక్ ఎక్సట్రాడినరీగా ఉందన్నారని నిర్మాతలు సంతోషం వ్యక్తం చేశారు. 

చిత్ర ద‌ర్శ‌కుడు వక్కంతం వంశీ మాట్లాడుతూ ''ఎక్స్‌ట్రా' క్యారెక్ట‌ర్ బేస్డ్ స్క్రిప్ట్‌తో... 'కిక్' త‌ర్వాత ఆ రేంజ్ జోన్‌లో ఈ సినిమా తెర‌కెక్కుతోంది. ప్రేక్షకులకు రోల‌ర్ కోస్ట‌ర్‌ లాంటి అనుభూతి ఇస్తుంది. న‌వ్విస్తూనే ట్విస్టులతో స‌ర్‌ప్రైజ్‌ చేస్తుంది'' అని చెప్పారు. ఈ చిత్రానికి హ‌రీష్ జైరాజ్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాకు సాయి శ్రీరామ్ సినిమాటోగ్రాఫర్. సాహి సురేష్ ప్రొడక్షన్ డిజైనర్.

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

Continues below advertisement