ఓ వైపు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, వైసీపీ నతేలు వై నాట్ 175 అని అంటుంటే, ఈసారి ఎన్నికల్లో అధికార పార్టీకి ప్రజలు బుద్ధి చెబుతారని టిడిపి రాష్ట్ర పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యురాలు, ఏపీ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత అన్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాల వారు మూడున్నరేళ్లలో దగా పడ్డారని చెప్పారు. ఉద్యోగాలు లేక యువత, రైతులు, విద్యార్థులు, ప్రభుత్వ ఉద్యోగులు ఇలా అందరూ మోసపోయారని అనిత అన్నారు. రాష్ట్రంలో 5 వేల రూపాయలు జీతం ఇచ్చి, దాన్ని కూడా ఉద్యోగాలు అని ప్రచారం చేసుకుంటున్న ఘనత ఏపీ సీఎం జగన్ సొంతమని ఎద్దేవా చేశారు. ఏ పరిశ్రమ తీసుకువచ్చారని ఉద్యోగాలిచ్చామని చెప్పుకుంటున్నారో రాష్ట్రంలో నిరుద్యోగులకు చెప్పాలన్నారు. విదేశాల్లో ఆరు అంకెల జీతం తీసుకునే ఉద్యోగం ఇచ్చిన నేత చంద్రబాబు అన్నారు.
రాష్ట్రంలో బాధితులందరి పక్షాన నిలిచేందుకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర చేయనున్నారని తెలిపారు. లోకేష్ పాదయాత్రకు సంపూర్ణ మద్దతు వస్తోందని, యువగళం పేరు బైటకు వచ్చిన నాటి నుంచి వైసిపి నేతలు ఉలిక్కి పడుతున్నారని చెప్పారు. రెండు నెలలక్రితమే డిజిపికి యువగళం పాదయాత్ర పై ఇంటిమేషన్ ఇచ్చాము. కానీ డీజీపీ స్థాయి వ్యక్తి 400 రోజులు ఎక్కడికి వెళతారన్నారు. కేవలం తిట్టడానికే పరిమితమైన మంత్రులు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు.
జిఓ నెంబర్1 తీసుకురావడం పులివెందుల పిల్లికి పరికితనం కాదా అని వంగలపూడి అనిత ప్రశ్నించారు. తండ్రి వైఎస్సార్ సీఎంగా చేసిన సమయంలో జగన్ ఎన్ని సూట్ కేసులు తీశారో చెప్పాలన్నారు. 45 వేల కోట్ల ఆస్తులు ఈడి అటాచ్ మెంట్లో ఉన్నది లోకేష్ కాదన్నారు. ఇప్పటివరకకూ లోకేష్ ఆస్తిలో పైసా కూడా ఈడీ అటాచ్ మెంట్ లేదని స్పష్టం చేశారు. లోకేష్ గురించి మాట్లాడేటప్పుడు ఏపీ మంత్రులు మీ అవినీతిమరకలు గురించి గుర్తుచేసుకోవాలని సెటైర్లు వేశారు.
27నుంచి నారా లోకేష్ పాదయాత్ర
ఈ నెల 27నుంచి రాష్ట్రంలో నారా లోకేష్ పాదయాత్ర ప్రారంభం కానుంది...40 రోజుల క్రితమే లోకేష్ పాదయాత్ర చేయనున్నట్లు పార్టీ వర్గాలు ప్రకటించాయి..రాష్ట్రలో ఉన్న వివిధ వర్గాల ప్రజల సమస్యలను ఫోకస్ చేస్తూ పాదయాత్ర సాగనుందని తెలిపారు..పాదయాత్రకు యువగళం అన్న పేరును ఖరారు చేశారు. 400 రోజులు 4వేల కిలోమీటర్లు ఈ పాదయాత్ర సాగనుంది. జనవరి 27న కుప్పంలో ప్రారంభమయ్యే ఈ యువగళం పాదయాత్ర ఇచ్చాపురంలో పూర్తి ఆవుతోంది. పాదయాత్ర తేదీ దగ్గర పడటంతో నాయకులు క్యాడర్ ఏర్పాట్లలో బిజీగా ఉన్నారు.
పాదయాత్ర కు అనుమతి కావాలంటూ పోలిట్ బ్యూరో సబ్యుడు వర్ల రామయ్య ఈ నెల 9న ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డికి లేఖ రాశారు. స్పందించక పోవడంతో రెండు సార్లు రిమైండర్ కూడా పంపారు. 21 వ తేదిన డీజీపీ స్పందిస్తూ ప్రత్యుత్తరం పంపారు . 400 రోజులపాటు లోకేష్ చేపట్టనున్న యువగళం పాదయాత్రకు సంబధించి డీజీపీ అడిగిన వివరాలు ... నాలుగు వందల రోజులకు సంబంధించి ప్రతి రోజు ఎవరెవరు పాదయాత్రలో పాల్గొంటారు..? లోకేష్ ను కలుసుకునే వ్యక్తుల వివరాలు వారి ఆథార్ కార్డు తో సహా సమర్పించాలి అని లేఖలో ఉందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాదయాత్రలో ఉండే వాహన కాన్వాయ్ వివరాలు... వాహనాల రిజిస్ట్రేషన్ నెంబర్లు, డ్రైవర్ల డ్రైవింగ్ లైసెన్స్ తో సహ వివరాలు...రూట్ మ్యాప్ ఏ బజారు నుంచి ప్రారంభమై ఎక్కడ ఆ రోజు ముగుస్తోందో 400 రోజలకు సంబంధించిన వివరాలు... ఏ సమయంలో ఏ ప్రాంతంలో యాత్ర సాగుతోందో తేదీల వారిగా వివరాలు... ప్రతి రోజు బస చేసే ప్రాంతం ..ఎక్కడ నైట్ స్టే అవుతారో తెలియచేస్తూ స్థానికంగా ఆ బాధ్యతలు చూసే వారి ఫోన్ నెంబర్లు అందచేయాలని లేఖలో ప్రస్తావించారు.