Botsa Satyanarayana Win as MLC | విశాఖపట్నం: విశాఖ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీగా ఏపీ మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఏకగ్రీవం అయ్యారు. ఈ ఉప ఎన్నికల నుంచి కూటమి పార్టీలు వెనక్కి తగ్గాయి. తమకు సంఖ్యా బలం లేదని, అభ్యర్థిని నిలపకూడదని నిర్ణయం తీసుకోవడం తెలిసిందే. ఈ క్రమంలో రెండు రోజుల కిందట ఇండిపెండెంట్ అభ్యర్థి షేక్ షఫీ సైతం నామినేషన్ ఉపసంహరించుకున్నారు. దాంతో వైసీపీ నేత బొత్స సత్యనారాయణ ఎమ్మెల్సీగా ఏకగ్రీవం అయ్యారు. రిటర్నింగ్ ఆఫీసర్ మాజీ మంత్రి బొత్సకు ఎమ్మెల్సీగా ఎన్నికైనట్లు ధ్రువీకరణ పత్రాన్ని శుక్రవారం అందజేశారు.