" నమ్మకానికి అమ్మ వంటిది " అనే ట్యాగ్ లైన్ పెట్టి చిట్‌ఫండ్స్ వ్యాపారం చేసిన వేల్ఫేర్ గ్రూప్ వ్యవహారం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒరిస్సా, చత్తీస్‌ఘడ్‌, జార్ఖండ్‌లలో దుమారం రేపుతోంది. ఆ సంస్థ ప్రజలను రూ. 1200కోట్ల మేర మోసగించిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే ఈ నాలుగు రాష్ట్రాల్లోనే అగ్రిగోల్డ్ సంస్థ చేసిన మోసం వల్ల లక్షలాది మంది మోసపోయారు. వారిని ఆదుకోవడానికి ప్రభత్వం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఇలాంటి సమయంలో వేల్ఫేర్ గ్రూప్ యజమాని అయిన మళ్ల విజయ్ ప్రసాద్‌ను ఒరిస్సా పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లడం చర్చనీయాంశమయింది. ఆయన ఏపీ అధికార పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత కావడం ఈ వ్యవహారం హాట్ టాపిక్ అవడానికి కారణం.


నమ్మకాన్ని అమ్మవంటిదని ప్రచారం చేసి డిపాజిట్లు..!


వేల్ఫేర్ గ్రూప్ అంటే నమ్మకానికి అమ్మవంటిది అనే ప్రచారాన్ని పదేళ్ల కిందట ఉద్ధృతంగా చేశారు. ప్రధానంగా చిట్ ఫండ్ వ్యాపారం అని ప్రచారం చేశారు కానీ అచ్చంగా అగ్రిగోల్డ్ తరహాలోనే డిపాజిట్లు సేకరించారు. 1999లో వెల్ఫేర్‌ గ్రూపును మళ్ల విజయ్ ప్రసాద్ విశాఖ కేంద్రంగా ప్రారంభించారు. డిపాజిట్‌ చేసిన వారికి తక్కువ కాలంలోనే భారీ మొత్తం ఇస్తామని, సులభ వాయిదాల్లో డబ్బు చెల్లించి తమ సంస్థ అభివృద్ధి చేసే లేఅవుట్లలో ప్లాట్లను దక్కించుకోవచ్చని ప్రచారం చేశారు. ఐదు రాష్ట్రాల్లో 82 బ్రాంచ్‌లను వేగంగా ఏర్పాటు చేశారు. ఏజెంట్ల వ్యవస్థను నియమించుకుని దిగువ మధ్యతరగతి వద్ద చిట్స్ కట్టించుకోవడం.. డిపాజిట్లు తీసుకున్నారు. సేకరించిన మొత్తాన్ని ఇతర వ్యాపారాల్లో పెట్టుబడిగా పెట్టారు. కొన్ని సినిమాలు కూడా నిర్మించారు.


Also Read : వైసీపీ మాజీ ఎమ్మెల్యే అరెస్ట్



కాలపరిమితి తీరిన తర్వాత చెల్లించలేక చేతులెత్తేసిన వేల్ఫేర్ గ్రూప్.. !


చిట్స్ పాడుకున్న వారికి, డిపాజిట్లు చేసినవారికి చెల్లింపులు చేయడంలో వేల్ఫేర్ గ్రూప్ విఫలమయింది.  ఛత్తీస్ గఢ్‌, జార్ఖండ్‌ డిపాజిట్ చేసిన వారు ఫిర్యాదు చేయడంతో 2016లోనే సీబీఐ కేసు నమోదు చేశారు. మళ్ల విజయ్ ప్రసాద్ ఇళ్లలో సోదాలు చేశారు. డిపాజిట్లను వ్యక్తిగత ఖాతాలకు మళ్లించినట్లుగా గుర్తించారు.  ఆ తర్వాత కూడా వ్యాపారం కొనసాగించారు. 2018లో నెల్లూరులో ఖాతాదారులు ఆ సంస్థ కార్యాలయంపై దాడి చేయడం సంచలనం సృష్టించింది.  డిపాజిట్లు తిరిగి చెల్లించకపోవడంతో  నెల్లూరులోని కార్యాలయాన్ని మూసేసుకుని వెల్ఫేర్ గ్రూప్ ఉద్యోగులు పరారయ్యారు.  ఆ తరవాత ఐదు రాష్ట్రాల్లోనూ కార్యాలయాలను మూసి వేశారు. ఈ కారణంగా ఆయా రాష్ట్రాల్లో కేసులు నమోదయ్యాయి. ఒరిస్సాలో బాధితులు ఎక్కువగా ఉండటంతో అనేక కేసులు నమోదయ్యాయి. ఇటీవల అక్కడి ప్రభుత్వం ఆర్థిక నేరాలపై ప్రత్యేక దృష్టి పెట్టడంతో  అరెస్టులు ప్రారంభించారు.


Also Read : ఆశపడిన వైసీపీ ఎమ్మెల్యేకు టోకరా



వేల్ఫేర్ గ్రూప్ ఆస్తులన్నీ ఎక్కడ ఉన్నాయి..?


అగ్రిగోల్డ్ ఆస్తులు అమ్మి డిపాజిటర్లకు చెల్లిస్తున్నారు. అయితే వేల్ఫేర్ గ్రూప్ ఆస్తులు ఎక్కడ ఉన్నాయో.. ఎవరికీ తెలియని పరిస్థితి ఉంది. అనేక చోట్ల వేల్ఫేర్ గ్రూప్‌ రియల్ ఎస్టేట్ వెంచర్లు వేసింది. నోట్ల రద్దు తర్వాత కూడా ఆ కంపెనీలోకి పెద్ద ఎత్తున డిపాజిట్లు వచ్చినట్లుగా సీబీఐ అధికారులు గుర్తించినట్లుగా తెలుస్తోంది. కడప జిల్లా పులివెందులలోనూ వేల్ఫేర్ గ్రూప్ భారీ రియల్ ఎస్టేట్ వెంచర్ వేసింది. అయితే ఆస్తులన్నీ ఎక్కడికి వెళ్లాయో స్పష్టత లేదు.


భార్యను పంపించంటూ భర్తకు 80 ఏళ్ల వృద్ధుడి ఆఫర్.. ఆ తర్వాత..



వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత కావడంతో రాజకీయ దుమారం..!


మళ్ల విజయ్ ప్రసాద్ మొదట్లో కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన వైఎస్ కుటుంబానికి ఆప్తుడు. ఆతర్వాత ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రస్తుతం ఆయనకు రాష్ట్ర విద్య, మౌలిక వసతుల కల్పన అభివృద్ధి కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవి ఉంది. విశాఖ రాజకీయాల్లో చురుగ్గా ఉంటారు. దీంతో సహజంగానే ఈ అంశంపై రాజకీయ విమర్శలు, ప్రతి విమర్శలు ప్రారంభమయ్యాయి. అగ్రిగోల్డ్ తరహాలోనే ప్రజల్ని మోసం చేసినందున ఆస్తులు అమ్మి అందరికీ చెల్లించాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోనూ ఆ సంస్థ బాధితులు ఎక్కువగానే ఉన్నారు. అయితే ఆయన అధికార పార్టీ నేత కావడంతో బయటకు వచ్చేందుకు భయపడుతున్నారన్న అభిప్రాయం ఉంది. 


Also Read : లోదుస్తులు మాత్రమే దొంగిలించే గజదొంగ