Vizag Steel Plant: విశాఖ ఉక్కు కర్మాగారం కార్మికులు మరోసారి ఆందోళనను ఉద్ధృతం చేశారు. వేతనాలు పెంచాలంటూ స్టీల్ ప్లాంట్ పరిపాలనా భవనాన్ని ముట్టడించారు. సెయిల్ తరహాలో తమకు వేతన సమవర్ణ ఒప్పందం అమలు చేయాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేశాయి. అలాగే పరిపాలనా భవనం వద్దకు వెళ్లే అన్ని మార్గాల్లో బైఠాయించి వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు.


ఒక్కసారిగా పెద్ద సంఖ్యలో స్టీల్ ప్లాంట్ కార్మికులు పరిపాలనా భవనం ముట్టడికి రావడంతో ఉక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ క్రమంలోనే అక్కడ భారీగా పోలీసులు మోహరించారు. దీంతో కార్మికులు, పోలీసుల మధ్య వాగ్వాదం చెలరేగింది.


ఆరేళ్లుగా వేతన ఒప్పందాన్ని అమలు చేయకపోవడాన్ని నిరసిస్తూ ఆందోళన నిర్వహించారు. అలాగే పోరాట కమిటీ నాయకులు యాజమాన్యంతో కుమ్మక్కయ్యారని కార్మికులు చెబుతున్నారు. అందువల్లే ఆందోళనలు చేయకుండా స్టీల్ ప్లాంట్ అమ్ముతామని ప్రభుత్వం తెగేసి చెబుతున్న మిన్నుకుంటున్నారని అన్నారు. తమ సమస్యలను గాలికి వదిలేసి వారి లాభాల గురించి మాత్రమే ఆలోచించుకుంటున్నారని ఆరోపించారు.