Entry Fees at Rushikonda Beach: విశాఖపట్నం: రుషికొండ బీచ్ కు ప్రవేశ రుసుము విషయంపై రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తగ్గినట్లు కనిపిస్తోంది. బీచ్ లోకి ప్రవేశ రుసుం తీసుకోవడం లేదని చెబుతోంది. స్థానిక రుషికొండ బీచ్ లో ప్రవేశానికి రుసుము వసూలు చేస్తున్నారని వస్తున్న వార్తల్లో నిజం లేదని ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పష్టం చేశారు. రుషికొండ బీచ్ కు బ్లూ స్టార్ హోదా లభించిందని తెలిపారు.
బ్లూ స్టార్ హోదా లభించిన బీచ్ లకు కేంద్ర ప్రభుత్వ నిబంధనలు ప్రకారం, ఆ బీచ్ లో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు రుసుము వసూలు చేయాలని కేంద్రం పేర్కొందని మంత్రి అమర్నాథ్ తెలిపారు. దీనిని ఆధారంగా చేసుకుని బీచ్ లో రుసుము వసూలు చేయడానికి రంగం సిద్ధమవుతున్న సమయంలో మంత్రి అమర్నాథ్ స్పందించారు. రుషికొండ బీచ్ లో ప్రవేశానికి ఎటువంటి రుసుము చెల్లించిన అవసరం లేదని, బీచ్ లో సదుపాయాలు కల్పించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. అయితే బీచ్ లో ప్రవేశ రుసుము వసూలు చేస్తున్నట్లు వస్తున్న వార్తలను నమ్మొద్దని అమర్నాథ్ స్పష్టం చేశారు.
ఈ బీచ్‌ను పరిశుభ్రంగా ఉంచడానికి క్లీనర్లు, సెక్యూరిటీ, లైఫ్ గార్డులు అంతా కలిసి 39 మంది పనిచేస్తున్నారు. వారికి నెలకు రూ.6 లక్షల వ్యయం అవుతోంది. ప్రభుత్వం ఈ బీచ్‌కు ఎటువంటి నిధులు ఇవ్వడం లేదు. అందుకని పార్కింగ్ ఫీజు, టాయిలెట్, స్నానాల గదుల వద్ద ఫీజులు వసూలు చేస్తున్నారు. ఇవి సరిపోవడం లేదని ఇతర రాష్ట్రాల్లో బ్లూ ఫాగ్ బీచ్‌లను పరిశీలించారు. అక్కడ ప్రవేశ రుసుము వసూలు చేస్తున్నారని.. ఇక్కడ కూడా అలాగే చేయాలని ఏపీ ప్రభుత్వం భావించింది. ఈ నెల 11వ తేదీ నుంచి ఈ బీచ్‌కు వచ్చే వారి నుంచి రూ.20 టిక్కెట్ వసూలు చేస్తామని ప్రకటించారు. కానీ ఈ వార్తల్లో నిజం లేదని ఎలాంటి ప్రవేశ రుసుం రూ.20 వసూలు చేయడం లేదని, ప్రభుత్వమే నిర్వహణ ఖర్చులు భరిస్తుందని మంత్రి అమర్నాథ్ పేర్కొన్నారు.
విశాఖలో ఇక ఏమీ మిగల్లేదని బీచ్‌లో ఎంట్రీ ఫీజు వేస్తారా ?
రుషికొండ బీచ్ వద్ద ఎంట్రీ ఫీజు వసూలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించడంపై మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు మండిపడ్డారు. వైజాగ్ లో తాకట్టు పెట్టాలకున్నవన్నీ పెట్టేశారు. అమ్మలనుకున్నవన్నీ అమ్మేశారూ..... కూల్చాలనుకున్నవన్నీ కూల్చేశారు...వెయ్యాలకున్న పన్నులన్నీ వేసేశారు...ఇప్పుడేమో బీచ్ ల వద్ద పార్కింగ్ ఫీజులు, ఎంట్రీ ఫీజులు వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. వైజాగ్ అంటే అందమైన బీచ్‌లు గుర్తుకొస్తాయి, సముద్రతీరంలో కాసేపు సేదదీరితే ఒత్తిడి తగ్గుతోందని విశాఖ వాసులు సాయంత్రం అలా బీచ్‌కు వెళ్తుంటారు, ఐతే ఇకపై 'బ్లూ' ఫాగ్ గా గుర్తింపు ఉన్న రుషి కొండ బీచ్‌కు వెళ్లాలంటే 20 రూపాయల ఎంట్రీ ఫీజు పెట్టడంతో ప్రకృతి ప్రేమికులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారన్నారు.
Also Read: విశాఖలో ఇక ఏమీ మిగల్లేదని బీచ్‌లో ఎంట్రీ ఫీజు వేస్తారా ? - ప్రభుత్వంపై గంటా ఫైర్ !
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial