Visakhapatnam Railway Station | విశాఖపట్నం: విశాఖపట్నం రైల్వేస్టేషన్‌లో ఆదివారం వేకువజామున పెను ప్రమాదం తప్పింది. విశాఖ స్టేషన్ నుంచి వెళ్తున్న ఓ రైలు విద్యుత్ తీగలను ఈడ్చుకెళ్లింది. ఇది గమనించిన అధికారులు విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. దీంతో విశాఖ రైల్వే స్టేషన్లో పెను ప్రమాదం తప్పిపోయింది. దాంతో పులు రైళ్ల రాకపోకలు కి అంతరాయం తలెత్తింది. పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. ప్రస్తుతం రైళ్ల రాకపోకలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. ఆదివారం వేకువజామున ఈ ఘటన జరిగింది.
తమిళనాడులోని తిరునెల్వేలి నుంచి బయలుదేరిన సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ (22606) పశ్చిమ బెంగాల్‌లోని పురులియాకు వెళ్తోంది. ఈ క్రమంలో ఆదివారం తెల్లవారుజామున 5.20 గంటలకు విశాఖపట్నం రైల్వేస్టేషన్‌కు చేరుకుంది. ఇక్కడ రైలు ఇంజిన్‌ను మార్పు చేసిన అనంతరం తొలగించిన ఇంజిన్ వెళ్తూ పైన ఉన్న విద్యుత్ తీగలను ఈడ్చుకెళ్లింది. దాదాపు 100 మీటర్లు విద్యుత్ తీగల్ని లాక్కెల్లింది.
ఇది గుర్తించిన రైల్వే సిబ్బంది అప్రమత్తమై వెంటనే విద్యుత్ సరఫరాను నిలిపివేయడంతో పెను ప్రమాదం తప్పింది. కానీ విద్యుత్ సరఫరా నిలిపివేయడం, విద్యుత్ తీగల్ని సవరించే క్రమంలో కొంత సమయం రైలు సర్వీసులకు అంతరాయం కలిగిందని డీఆర్‌ఎం మనోజ్ సాహూ తెలిపారు. అనంతరం రైళ్ల రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నాయి.
ఏనుగు దాడిలో ఒకరి మృతి
చిత్తూరు జిల్లాలోని కౌండిన్య అభయారణ్యం సమీపంలో ఏనుగు దాడిలో పశువుల కాపరి మృతిచెందాడు. కుప్పనపల్లె వద్ద శనివారం ఈ ఘటన చోటుచేసుకొంది. కుప్పనపల్లెకు చెందిన శంకరప్ప అనే వృద్ధుడు పశువులను మేపేందుకు అడవికి వెళ్లాడు. పశువులను మేతకు వదిలి వదిలి ఇంటికి తిరిగొస్తుండగా ఓ ఏనుగు అతడిపై దాడి చేసింది. ఇది గమనించిన మరో పశువుల కాపరి శంకరప్పను స్థానికుల సాయంతో హాస్పిటల్‌కు తరలించారు. అక్కడి నుంచి పలమనేరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా పరీక్షించిన డాక్టర్లు అప్పటికే అతడు మృతి చెందినట్లు నిర్ధారించారు.