వందే భారత్ ఎక్స్ ప్రెస్ పై మళ్లీ రాళ్ల దాడి జరిగింది. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో రైలుపై ఆకతాయిలు రాళ్ళు రువ్వారు. దీంతో C 8 కోచ్ అద్దం బద్దలు అయింది. సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వస్తుండగా బుధవారం (ఏప్రిల్ 5) నాడు ఈ ఘటన జరిగింది. ఖమ్మం - విజయవాడ మధ్య గుర్తు తెలియని వ్యక్తులు అద్దాల్ని పగలగొట్టారు. అలాగే రైలు విశాఖపట్నానికి చేరుకుంది. పగిలిన అద్దాన్ని రిపేర్ చేయడానికి నాలుగు గంటల సమయం పడుతుందని రైల్వేశాఖ ప్రకటించింది. దీనివల్ల విశాఖపట్నం నుంచి ఉదయం 5:45 కి బయలు దేరాల్సిన వందేభారత్ ట్రైన్ 9:45 కి బయలు దేరుతుందని వాల్తేరు సీనియర్ డీసీఎం ఏకే త్రిపాఠి ఓ ప్రకటనలో తెలిపారు.