ప్రస్తుతం జరుగుతున్న పదవ తరగతి పరీక్షల విషయంలో పేపర్ లీకేజ్‌కు తావులేకుండా ఉండేందుకు ప్రభుత్వ పరీక్షల విభాగం కొన్ని జాగ్రత్తలను పరీక్ష నిర్వాహకులకు తెలియజేసింది. ఈ మేరకు ప్రభుత్వ పరీక్షల సంచాలకులు దేవానందరెడ్డి ఒక ప్రకటన విడుదల చేశారు. తెలంగాణలో వరుస పేపర్ల లీకేజీల ఘటనల నేపథ్యంలో రాష్ట్రంలో ప్రభుత్వం ముందస్తు చర్యలను చేపట్టింది. పదవ తరగతి పరీక్షా కేంద్రాలలో ఎదైనా అక్రమాలు, అవకతవకలు జరిగినచో చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్‌మెంటల్ ఆఫీసర్, సెంటర్ కస్టోడియస్‌లు బాధ్యత వహించాల్సి ఉంటుందని దేవానందరెడ్డి పేర్కొన్నారు.
పరీక్షా కేంద్రాలన్నింటిని 'నో మొబైల్' జోన్లుగా ప్రకటించామని, కావున పరీక్ష విధులలో పాల్గొనే సిబ్బంది అంతా తమ మొబైల్ ఫోన్ ఇంటిలోనే ఉంచి రావాలి లేదా సెంటర్ లో పోలీస్ పికెటింగ్ వద్ద మొబైల్ అప్పగించాలని పేర్కొన్నారు. ఒకసారి పరీక్ష కేంద్రంలోకి వచ్చిన సిబ్బంది, పరీక్ష ముగిసేవరకు ఎటువంటి పరిస్థితులలో బయటికి రాకూడదన్నారు. అటెండర్లు, ఇతర సహాయకులు కూడా టీ, ఇతర శీతల పానీయాల వంటి అవసరాలకు కూడా పరీక్షా సమయంలో బయటకు రాకూడదన్నారు.
పరీక్ష విధులు లేని ఉపాధ్యాయులు పరీక్ష జరిగే సమయంలో పరీక్షా కేంద్రాల పరిసరాలలో ఉండకూడదన్నారు. పరీక్షా కేంద్రాలుగా ఉన్న కె.జి.బి.వి, రెసిడెన్షియల్ పాఠశాలలకు చెందిన పరీక్ష విధులు లేని ఉపాధ్యాయులు పరీక్ష జరిగే సమయంలో పాఠశాలలో ఉండకూడదని పేర్కొన్నారు. పరీక్షా కేంద్రంలో ప్రైవేట్ వ్యక్తులు ఎవరు ఉండకూడదని, పరీక్ష ప్రశ్నా పత్రాలు, వాటిపై వదంతులు వాట్సాప్ గ్రూప్ లలోకాని, సామాజిక మాధ్యమాలలో కానిప్రచారం చేయకూడదని పేర్కొన్నారు.
చీఫ్ సూపరింటెండెంట్లు పరీక్షకు హాజరు కాని అభ్యర్థుల ప్రశ్నాపత్రాలను, మిగిలిన ప్రశ్నాపత్రాలను ఉదయం 10.00 గంటల లోపల ప్రశ్నాపత్రాల అకౌంట్ రాసి జాగ్రత్తగా సీల్ చేసి ఉంచాలని పేర్కొన్నారు. పై నిబంధనలు అతిక్రమించిన వారిపై పరీక్షల చట్టం 25(7) ప్రకారం, 7 సంవత్సరాల వరకు జైలుశిక్ష, లక్ష రూపాయల వరకు జరిమానా పడుతుందని దేవానందరెడ్డి హెచ్చరించారు.
Also Read:
ఏపీఆర్‌జేసీ సెట్-2023 ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల, పరీక్ష ఎప్పుడంటే?
ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయాల సంస్థ నిర్వహణలో ఉన్న జూనియర్ కళాశాలల్లో ఇంటర్‌లో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదలైంది. ఏపీఆర్‌జేసీ ఉమ్మడి ప్రవేశ పరీక్ష - 2023కు ఏప్రిల్ 4 నుంచి 24 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఇంటర్ ప్రథమ సంవత్సరం ప్రవేశ పరీక్ష హాల్‌టికెట్లను మే 12 నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మే 20న మధ్యాహ్నం 2.30గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నారు. ఈ పరీక్ష ఫలితాలను జూన్ 8న ప్రకటిస్తారు. అనంతరం ఇంటర్‌లో కోర్సుల వారీగా సీట్లను భర్తీ చేసేందుకు తొలి విడత కౌన్సిలింగ్ జూన్ 12 నుంచి 16 వరకు; జూన్ 19 నుంచి 21 వరకు రెండో విడత; జూన్ 26 నుంచి 28 వరకు మూడో విడత కౌన్సెలింగ్ జరగనుంది.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..
ఏపీ గురుకుల పాఠశాలల్లో ప్రవేశాలు, నోటిఫికేషన్ వెల్లడి - పరీక్ష ఎప్పుడంటే?
ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయాల సంస్థ నిర్వహణలో ఉన్న పాఠశాలల్లో ప్రవేశాల కోసం 'ఏపీఆర్‌ఎస్ క్యాట్-2023' నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ప్రవేశ పరీక్ష ద్వారా 5వ తరగతితోపాటు 6, 7, 8 తరగతుల్లో మిగిలిన సీట్ల భర్తీని చేపట్టనున్నారు. విద్యార్థుల నుంచి ఏప్రిల్ 4 నుంచి 24 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. ప్రవేశ పరీక్ష హాల్‌టికెట్లను మే 12 నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మే 20న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నారు. ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థుల మొదటి జాబితాను జూన్ 8న, రెండో జాబితాను జూన్ 16న, మూడో జాబితాను జూన్ 23న ప్రకటించనున్నారు.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..