విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ ఉద్యమానికి ( Vizag Steel Plant ) శనివారంతో ఏడాది పూర్తవుతున్న సందర్భంగా కేంద్రంలో మోడీ ప్రభుత్వంపై ( Modi Governament ) మరో ఉద్యమ పోరాటానికి కార్మిక సంఘాలు సిద్ధమవుతున్నాయి. విశాఖ ఉక్కు అమ్మకాన్ని తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ ఆదివారం జైల్ భరో ( Jail Bharo )  కార్యక్రమాన్ని  నిర్వహించనున్నారు.  జైల్ భరోను జయప్రదం చేసేలా అన్ని కార్మిక, రాజకీయ, ప్రజా సంఘాలను ఏకం చేసేందుకు స్టీల్ ప్లాంట్ పరిరక్షణ ఉద్యమ నాయకులు ( Steel Plant JAC ) ప్రయత్నాలు చేస్తున్నారు. 


పార్లమెంట్‌లో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గళమెత్తాల్సిందే.. ఏపీ ఎంపీలపై ఒత్తిడి తెచ్చేందుకు పవన్‌ కొత్త వ్యూహం !


స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం నాయకులందరూ జేఏసీగా ఏర్పడి జీవీఎంసీ గాంధీ విగ్రహం నుండి టూ టౌన్ పోలీస్‌ స్టేషన్ వరకు ప్రదర్శనగా వెళ్లి జైల్ భరో నిర్వహించాలని నిర్ణయించారు.  ఈ కార్యక్రమంలో కార్మికులు, విద్యార్ధులు, యువజనలు, మహిళలు అన్ని తరగతుల వారు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ ఉద్యమం ద్వారా మోదీ ప్రభుత్వ కళ్ళు తెరిపించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.  ఉక్కు పరిరక్షణ ఉద్యమం కోవిడ్ విపత్కర పరిస్థితుల్లోనూ ఆగలేదని నేతలు గుర్తు చేస్తున్నారు.  ప్రజల ప్రయోజనాలకన్నా కార్పొరేట్ల ప్రయోజనాలకే మోడీ ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. 


ఏపీకి వైసీపీ హానికరం... లక్షల కోట్ల అప్పులున్న రాష్ట్రాన్ని ప్రైవేటీకరణ చేస్తారా.... ఉక్కు దీక్షలో పవన్


ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకం తమ విధానమని నిస్సిగ్గుగా మోదీ ప్రభుత్వం ప్రకటించిందని విమర్శించారు. ఈ స్థితిలో ప్రభుత్వ రంగ రక్షణ పోరాటాన్ని ప్రజా ఉద్య మంగా మలిచేందుకు విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ, కార్మిక, ప్రజా సంఘాల జెఎసి నిర్ణయించాయని ఉద్యమ నేతలు చెబుతున్నారు. దీనిలో భాగంగా కోటి సంతకాల సేకరణ ఉద్యమం కొనసాగుతోందని ఈ ఉద్యమంతో కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తిప్పికొడతామని ఉద్యోగ నేతలు ధీమాగా ఉన్నారు. 


స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు ఇప్పటికే తమ ఉద్యమ కార్చరణ ప్రకటించారు. బీజేపీ కార్యాలయం ముట్టడించి..  23న రాష్ట్ర బంద్‌ ( State Bundh ) నిర్వహించాలని నిర్ణయించారు.   స్టీల్ ప్లాంట్ విషయంలో ఇటీవల పవన్ కల్యాణ్ ( Pawan Kalyan ) కూడా మద్దతు పలుకుతున్నారు. ఓ బహిరంగసభ..మరో దీక్ష నిర్వహించారు. అన్ని పార్టీలూ  స్టీల‌్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరిగే పోరాటానికి మద్దతివ్వడానికి సిద్ధంగా ఉన్నాయి.