Chodavaram: ఉమ్మడి విశాఖ జిల్లాలోని మరో నియోజకవర్గం చోడవరం. ఈ నియోజకవర్గంలో ఏర్పాటు అయినప్పటి నుంచి ఇప్పటివరకు 17 సార్లు ఎన్నికలు జరిగాయి. 1955లో ఈ నియోజకవర్గంలో తొలిసారి ఎన్నికలు జరిగాయి. ప్రస్తుతం ఉన్న చోడవరం నియోజకవర్గంలోనే గతంలో రెండు నియోజకవర్గాలు ఉండేవి. ఇందులో ఒకటి చోడవరం కాగా రెండోది కొండకర్ల. మొదటి రెండు ఎన్నికలు ఈ రెండు నియోజకవర్గాలు పేరుమీద గానే ఎన్నికలు జరిగాయి. 


ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల ఫలితాలు


1955లో కొండకర్ల నియోజకవర్గంలో జరిగిన ఎన్నికల్లో కేఎల్పి నుంచి పోటీ చేసిన ఎంపీ నాయుడు విజయం సాధించారు. సిపిఐ నుంచి పోటీ చేసిన పి వెంకటరమణపై ఆయన 210 ఓట్ల తేడాతో విజయం సాధించారు. 1962లో కొండకర్లకు జరిగిన మరో ఎన్నికల్లో సిపిఐ నుంచి పోటీ చేసిన పి వెంకటరమణ విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన వై నాయుడమ్మపై 3026 ఓట్ల తేడాతో గెలుపొందారు. 1952లో చోడవరం నియోజకవర్గానికి జరిగిన ఎన్నికల్లో కేఎల్పి నుంచి పోటీ చేసిన కే వెంకట రామేశం విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన బిఎస్ రాజుపై 7326 ఓట్ల తేడాతో విజయాన్ని దక్కించుకున్నారు. 1955లో జరిగిన ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన జై రెడ్డి ఎక్కడ విజయం సాధించారు. కేఎల్పి నుంచి పోటీ చేసిన బిజీ నాయుడుపై ఆయన 2785 ఓట్ల తేడాతో విజయాన్ని దక్కించుకున్నారు. 1962 లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన ఐ సత్యనారాయణ తన సమీప ప్రత్యర్థి ఇండిపెండెంట్గా పోటీ చేసిన బిజీ నాయుడుపై 3440 ఓట్ల తేడాతో విజయం సాధించారు. 



1967లో జరిగిన ఎన్నికల్లో స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన వేచలపు పాలవెల్లి ఇక్కడ విజయం సాధించారు తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన ఐ సత్యనారాయణ పై 15,300 ఓట్ల తేడాతో ఆమె గెలుపొందారు. 1972లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన వేచలపు పాలవెల్లి మరోసారి ఇక్కడ విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి ఇండిపెండెంట్ గా పోటీ చేసిన బి సూర్యనారాయణపై 7,224 ఓట్ల తేడాతో ఆమె విజయం సాధించారు. 1978లో జరిగిన ఎన్నికల్లో జనతా పార్టీ నుంచి పోటీ చేసిన ఈమని సీతారామశాస్త్రి విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన వేచలపు పాలవెల్లిపై 12,066 ఓట్ల తేడాతో విజయాన్ని నమోదు చేశారు. 



1983లో జరిగిన ఎన్నికల్లో టిడిపి నుంచి పోటీ చేసిన జి ఎర్రునాయుడు ఇక్కడ విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన జి కన్నం నాయుడుపై 9282 ఓట్ల తేడాతో ఆయన విజయాన్ని నమోదు చేశారు. 1985లో జరిగిన ఎన్నికల్లో టిడిపి నుంచి పోటీ చేసిన జి ఎర్రునాయుడు రెండోసారి విజయం దక్కించుకున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన తన సమీప ప్రత్యర్థి జి కన్నం నాయుడుపై 17,742 ఓట్ల తేడాతో విజయం సాధించారు. 1989లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన బలిరెడ్డి సత్యారావు ఇక్కడ విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి టిడిపి నుంచి పోటీ చేసిన జి ఎర్రునాయుడుపై 9743 ఓట్ల తేడాతో విజయాన్ని దక్కించుకున్నారు. 1994లో జరిగిన ఎన్నికల్లో టిడిపి నుంచి పోటీ చేసిన జి ఎర్రునాయుడు మరోసారి విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన బలిరెడ్డి సత్యారావు పై 19,076 ఓట్ల తేడాతో విజయాన్ని దక్కించుకున్నారు. 



1999లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన బలిరెడ్డి సత్యారావు ఇక్కడ విజయాన్ని సాధించారు. తన సమీప ప్రత్యర్థి టిడిపి నుంచి పోటీ చేసిన జి ఎర్రునాయుడుపై 5,518 ఓట్ల తేడాతో విజయాన్ని నమోదు చేశారు. 2004లో జరిగిన ఎన్నికల్లో టిడిపి నుంచి పోటీ చేసిన గంటా శ్రీనివాసరావు తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన బలిరెడ్డి సత్యారావుపై 9601 ఓట్ల తేడాతో విజయాన్ని దక్కించుకున్నారు. 2009లో జరిగిన ఎన్నికల్లో టిడిపి నుంచి పోటీ చేసిన నాగ సన్యాసిరాజు తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన కరణం ధర్మశ్రీ పై 1385 ఓట్ల తేడాతో విజయం సాధించారు. 2014లో జరిగిన ఎన్నికల్లో టిడిపి నుంచి పోటీ చేసిన కే నాగ సన్యాసిరాజు మరోసారి విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన కరణం ధర్మశ్రీ పై 1509 ఓట్ల తేడాతో విజయాన్ని దక్కించుకున్నారు. 2019 ఎన్నికల్లో వైసిపి అభ్యర్థిగా పోటీ చేసిన కరణం ధర్మశ్రీ ఇక్కడ విజయం సాధించారు. టిడిపి అభ్యర్థిగా బరిలోకి దిగిన కే నాగ సన్యాసిరాజుపై 27,637 ఓట్ల తేడాతో విజయాన్ని దక్కించుకున్నారు.