Rushikonda Building : విశాఖ సాగరతీరం లో  ప్రభుత్వం నిర్మించిన వివాదాస్పద భవనసముదాయనికిఎ  ప్రారంభోత్సవం జరిగింది. మంత్రులు, వివిధ మఠాధి పతులు, పీఠాధిపతుల సమక్షం లో హడావిడిగా ప్రారంభోత్సవం జరిగింది. ఋషికొండ లో ప్రభుత్వం రూ. 450 కోట్ల తో  నిర్మించిన భవన  సముదాయాన్నిఈ రోజు మంత్రి రోజా ప్రారంభించారు. ఇప్పటికే కోర్టులో ఈ భవనాలకు సంబందించి కేసులు వున్నా హడావిడిగా ప్రభుత్వం ప్రారంభించడం,ఎవ్వరికీ ఎలాంటి సమాచారం లేక పోవడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి..                   


గతం లో ఈ ప్రాంతం లో హరిత రిసార్ట్స్ అనే ఉండేవని, వాటి స్థానం లో ఋషికొండ టూరిజం రిసార్ట్స్ పేరుతో నూతన భవనాలని నిర్మించామని మంత్రి అమర్నాథ్ చెప్పారు.  పరభుత్వం ఏదో తప్పు చేసినట్టు ప్రతిపక్షాలు హడావిడి చేశాయని ధ్వజ మెత్తారు.కాగా ప్రస్తుతం ఉన్న భవనాలు టూరిజం పరంగా ఉపయోగించాలా లేక ముఖ్యమంత్రి పరిపాలనా భవనాలుగా ఉపయోగించాలా అనే అంశాలను ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. మంచి ముహూర్తం కావడం తోనే హడావిడిగా లాంఛనంగా ప్రారంభోత్సవం చేయాల్సి వచ్చిందని తెలిపారు.   నిర్మాణ పనులు పూర్తిస్తాయిలో జరిగాక అందరిని ఆహ్వానిస్తామన్నారు. విశాఖ నగరం అన్నిరంగాల్లో అభివృద్ధి చెందుతున్న నేపధ్యం లో ప్రభుత్వం టూరిజం డెవలప్ మెంట్ కోసం ఋషికొండ లో నిర్మాణ0 చేపట్టిందని అమర్ పేర్కొన్నారు.9.2 ఎకరాల్లో నిర్మాణాలు జరిగాయని అమర్‌నాథ్‌ తెలిపారు. ఈ భవంతులకు అనుమతులు తీసుకున్నామని చెప్పారు. న్యాయస్థానాలకు సంబంధించిన ఎలాంటి ఇబ్బందులూ వీటికి లేవన్నారు.                                                                        


మార్చి 5వ తేదీ తరువాత సీఎం విశాఖ వచ్చి వారానికి మూడు రోజులు ఇక్కడే ఉంటారని వైసీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఉత్తరాంధ్ర వైసీపీ సమన్వయకర్త వైవీ సుబ్బారెడ్డి కొద్దిరోజుల క్రితం మాట్లాడుతూ.. త్వరలో జగన్‌ విశాఖ నుంచే పరిపాలన ప్రారంభిస్తారని చెప్పారు. రూ.198 కోట్ల అంచనా వ్యయంతో పనులు ప్రారంభించి ఇప్పటివరకూ రూ.450 కోట్లు ఖర్చు చేశారు. అత్యంత విలాసవంతంగా నిర్మించారు. రుషికొండపై కొత్తగా నిర్మిస్తున్న భవనాలు సీఎం క్యాంపు కార్యాలయం కోసమేనని చెబుతున్నారు. మరో వైపు రుషికొండ పైకి వెల్లేందుకు ప్రయత్నించిన ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ను పోలీసులు అడ్డుకున్నారు. కారు దిగనివ్వకుండా పోలీసులు చుట్టుముట్టారు. దీంతో ఆయన కారులో ఉండిపోయారు. పోలీసుల తీరుపై కేఏ పాల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.