Srikakulam Crime News: శ్రీకాకుళం జిల్లాలోని కాశీబుగ్గ, సోంపేట పరిధిలో చోరీలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. వాళ్లు చెప్పిన విషయాలు విన్న ఖాకీలు షాక్ తిన్నారు. చోరీలకు పాల్పడే బంగారాన్ని తాకట్టు పెట్టి వచ్చిన డబ్బులు పంచుకొని ఎంజాయ్ చేయడం వీళ్ల అలవాటు. 


కాశీబుగ్గ, సోంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో రాబరీ,చైన్‌ స్నాచింగ్‌కు పాల్పడుతున్న నలుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ముఠాపై కాశీబుగ్గ పోలీస్ స్టేషన్‌లో రెండు కేసులు  రిజిస్టర్ అయ్యాయి. ఈ కేసులో సుమారు 11 తులాల బంగారాన్ని  రికవరీ చేశారు. సోంపేట పోలీస్ స్టేషన్‌ పరిధఇలోని కేసులో నాలుగున్నర తులాల బంగారు చోరీ అయింది. దాన్ని ఈ గ్యాంగ్‌ బరంపూర్‌లో ఓ ఫైనాన్స్ లిమిటెడ్‌లో తాకట్టు పెట్టారు. దీంతో ఆ సంస్థ వాళ్లకు నోటీసులు పంపించారు. 


ఊరు చివర సింగిల్‌గా ఉన్న ఇళ్లను మాత్రమే ఈ ముఠా టార్గెట్ చేస్తుంది. గత నెల 16న శివాజీనగర్ బసవరాజు గోపాల్ ఇంటి ముందు రెక్కీ నిర్వహించారు. ఇంట్లో ఎవరూ లేరని నిర్దారించుకున్న తర్వాత రూమ్ అద్దెకు కావాలని చెప్పి వెళ్లారు. అక్కడ మాట్లాడుతూ మంచి నీళ్లు అడిగారు. మాస్క్ వేసుకొని ఇంట్లోకి వెళ్లి బెదిరించి రెండున్నర తులాలు బంగారు పుస్తెలతాడు, తులం లాకెట్‌ లాక్కొని ఉండాయించారు. 


ఆ బంగారాన్ని మర్రివలస సంధ్య అనే మహిళతో కలిసి విశాఖ ఎంవీపీ కాలనీలోని ఫైనాన్‌ కంపెనీలో తాకట్టు పెట్టారు. వచ్చిన రూ.2.10 లక్షలు తీసుకున్నారు. రూ.10వేలు సంధ్య తీసుకంది. మిగతా రూ.2లక్షలను ముఠా సభ్యులు పంచుకున్నారు. 


ఈ నెల 5న పలాసలోని కొత్తవీధిలో రెక్కీ చేసి ఒంటరిగా ఇంట్లో ఉన్న మహిళను టార్గెట్ చేశారు. తిరుమల అనే పేరు గల వ్యక్తి ఉన్నారా అని అడిగి తలుపు తీసిన వెంటనే ఆమెపై దాడి చేశారు. కత్తితో బెదిరించారు. ఇంట్లో ఉన్న ఇద్దరు మహిళల్లో ఒకరిపై కుర్చీతో దాడిచేశారు. ఇంతలో పక్కనే ఉన్న మహిళ మెడలో ఉన్న 5 తులాల పుస్తెలతాడు, 4 తులాల నల్లపూసలు, చైన్‌ లాక్కున్నారు. అక్కడి నుంచి మోటార్ సైకిల్‌పై పారిపోయారు. అక్కడ చోరీ చేసిన బంగారాన్ని విశాఖపట్నం తీసుకువెళ్లి సంద్యకు ఇచ్చేందుకు వెళ్తుండగా పోలీసులు పట్టుకున్నారు. 


సోంపేటలో మహదేవపురంలో గత నెల 25న ఒంటరిగా ఇంట్లో ఉన్న మహిళకు నీరు కావాలని అడిగి ఇంట్లోకి ప్రవేశించి బెదిరించి మెడలోని మూడు తులాల పుస్తెలతాడు, నల్లపూసలు లాక్కున్నారు. ఈ బంగారాన్ని అదే రోజు బరంపురంలోని ఫైనాన్స్ కంపెనీలో తాకట్టు పెట్టారు. రూ.1.24 లక్షలు రాగానే పంచుకున్నారు. 


శ్రీకాకుళం జిల్లాలో ఈ మధ్యకాలంలో దొంగతనాలు చైన్స్ స్నాచింగ్  కేసులు అధికంగా రిజిస్టర్ అవ్వడంతో పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. ఈ నలుగురు ఒక టీంగా ఏర్పడ్డారు. మొదట ఒక వ్యక్తి ఇంటి అద్దె కోసం కావాలని అడుగుతాడు. రీసెంట్‌గానే వ్యాపారి నిమిత్తం వచ్చామని అద్దె ఎంతైనా పరవాలేదు ఇవ్వండి అని రిక్వస్ట్ చేస్తాడు. తర్వాత కుటుంబ సభ్యులు మిగతా వారు వెళ్తారు. తర్వాత వచ్చిన పని పూర్తి చేస్తారు. 


ఇల్లు అద్దెకి ఇవ్వాలి అనుకున్నప్పుడు వారి పూర్తి సమాచారం తెలుసుకొని తర్వాతే ఇవ్వండి అని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఏదైనా ఫంక్షన్స్ గాని పండగలకు గాని వెళ్లేటప్పుడు బంగారు నగలతో వెళితే తోడుగా ఎవరినైనా తీసుకొని వెళ్ళండి అని సూచిస్తున్నారు.