Doctor Challa Krishnaveer Placed In World Book Records: ప్రముఖ భాషావేత్త, సాఫ్ట్ స్కిల్స్ నిపుణుడు అయిన డాక్టర్.చల్లా కృష్ణవీర్ అభిషేక్ (Challa Krishnaveer Abhishek) సాఫ్ట్ స్కిల్స్ రంగంలో అందించిన విశేష కృషికి ప్రపంచ బుక్ రికార్డ్స్‌లో (World Book Records) గౌరవనీయమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. ఆర్ట్స్ అండ్ కామర్స్ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ ఎ.నరసింహారావు సోమవారం కృష్ణవీర్ అభిషేక్‌కు వరల్డ్ బుక్ రికార్డ్స్ సర్టిఫికెట్ అందజేశారు. సాఫ్ట్ స్కిల్స్, లాంగ్వేజ్ టీచింగ్‌లో విశేష కృషి చేసినందుకు ఆయన్ను ప్రొఫెసర్ నరసింహారావు అభినందించారు. డాక్టర్ అభిషేక్.. వేలాది మంది యూనివర్సిటీ విద్యార్థులకు సాఫ్ట్ స్కిల్స్, పర్సనాలిటీ డెవలప్‌మెంట్‌పై శిక్షణ ఇచ్చారని తెలిపారు. విజ్ఞాన సాధనలో అసమానమైన అంకితభావం, నిబద్ధత కలిగి ఉన్నారని చెప్పారు. 


రచయితగా డాక్టర్ కృష్ణవీర్ అభిషేక్ వివిధ అంశాల్లో  175 పుస్తకాలు రాశారు. ముఖ్యంగా మహాత్మాగాంధీ, సాఫ్ట్ స్కిల్స్, జర్నలిజం, కవిత్వం, వ్యక్తిత్వ వికాసంపై దృష్టి సారించారు. ఆయన నైపుణ్యం భావోద్వేగ భాషా బోధనా పద్ధతుల క్లిష్టమైన సూక్ష్మ నైపుణ్యాలకు విస్తరించింది. అటు, అంతరించిపోతున్న ఆదిమ భాషల పరిరక్షణలో భాగంగా పరిశోధనలను సైతం చేస్తున్నారు.  భాషా వైవిధ్యం, సాంస్కృతిక వారసత్వం పట్ల ఆయనకున్న ప్రగాఢ నిబద్ధతను నొక్కి చెప్పారు. ఈ సేవలతో ఆయనకు వరల్డ్ బుక్ రికార్డ్స్‌లో ప్రతిష్టాత్మక గుర్తింపు లభించింది.