వికేంద్రీకరణపై న్యాయపరమైన చిక్కులు తొలగిన వెంటనే విశాఖ నుంచి పరిపాలనను ప్రారంభిస్తామన్నారు ఉమ్మడి విశాఖ జిల్లాల వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ వై.వి.సుబ్బారెడ్డి. బుధవారం సాయంత్రం స్థానిక సర్క్యూట్ హౌస్‌లో మీడియాతో మాట్లాడుతూ వికేంద్రీకరణకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు. విశాఖపట్నం, కర్నూలుతోపాటు అమరావతిని కూడా పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తామని చెప్పారు. 


విశాఖ రాజధానిగా ఉండకూడదని, ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందకూడదన్న ఉద్దేశంతో ఈ ప్రాంతానికి దండయాత్రగా వస్తున్న రైతులకు శాంతియుత నిరసన తెలియజేయాలని ఈ ప్రాంత వాసులకు సుబ్బారెడ్డి పిలుపునిచ్చారు. అమరావతి శాసన రాజధానిగా ఉంటుందని ఆ ప్రాంతాన్ని కూడా పూర్తిగా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలియజేశారు.  వికేంద్రీకరణకు మద్దతుగా నాన్ పొలిటికల్ జేఏసీ చేపడుతున్న కార్యక్రమాలకు తాము మద్దతు తెలియజేస్తున్నామని సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. జేఏసీ ముఖ్య నాయకులతో గురువారం సమావేశమవుతామని ఆయన చెప్పారు. 


ఉత్తరాంధ్ర ప్రజలు తమను నమ్మారని, అందువలన విశాఖ గర్జన విజయవంతం అయ్యే అవకాశం ఉందని సుబ్బారెడ్డి చెప్పారు. ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేశాం కాబట్టే ఈ ప్రాంత ప్రజల మద్దతును తాము కోరుకుంటున్నామని సుబ్బారెడ్డి చెప్పారు. అమరావతిపై కొంతమంది ఎందుకు అంత ప్రేమ చూపిస్తున్నారో ప్రజలు ఇప్పటికే గమనించారని ఆయన అన్నారు. ఐదేళ్ళపాటు అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు అమరావతిలో శాశ్వత రాజధానిని నిర్మించలేక పోయారని, ఆర్థిక వనరులను కూడా సక్రమంగా వినియోగించుకోలేక పోయారని ఆయన విమర్శించారు. 


విశాఖను పాలనా రాజధానిగా ప్రకటించినప్పటి నుంచి తెలుగుదేశం అధినేత చంద్రబాబు, కులమీడియా కాలకూట విషం చిమ్ముతూన్నరని వైఎస్ఆర్ సిపి జాతీయ ప్రధాన కార్యదర్శి,రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మండిపడ్డారు. పలు అంశాలపై ఆయన సోషల్ మీడియా వేదికగా బుధవారం స్పందించారు. తెలుగుదేశం పార్టీ అనుకుల మీడియా విశాఖ నగరం సముద్రపు కోతకు గురై అదృశ్యం అవుతుందని ప్రజలను భయ భ్రాంతులకు గురిచేసిన విషయాన్ని గుర్తుచేశారు. విశాఖ నగరంలో భూ ఆక్రమణలంటూ పెయిడ్ ఆర్టిస్టులతో కొత్త కథలు చెబుతోందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు  ఉత్తరాంధ్ర అభివృద్ది కాకుడదని కేవలం ఆ అమరావతి 24 గ్రామాలే  అభివృద్ది చెందాలని బలంగా కోరుకుంటున్నారని ఆరోపించారు. 


ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, మద్దతు ఇచ్చే మీడియా ఒక అబద్దాన్ని వేయిసార్లు చెప్పినా అబద్దమే కానీ... అది నిజం ఎప్పటికీ కాదని అన్నారు. ఆలా ఒక అబద్దం నిజమౌతుందని అనుకోవడం ఒక భ్రమ అని అన్నారు. ఆ భ్రమలో బతికిన వారికి ఏమైందో చరిత్ర చెబుతోందని అన్నారు. అసలు చరిత్రనే నిషేదిద్దామని అనుకునే వారికి ఇది అర్ధం కాదు అంటూ.. జర్మన్ హిట్లర్, జోసెఫ్ గ్లోబల్స్ ఫోటోల పక్కన చంద్రబాబు, రామోజీరావు ఫోటోలను పోస్టు చేశారు.


బెంజి కార్లలో తిరిగేవారు, రోలెక్స్ వాచ్ ధరించేవారు రైతులు కాదని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు విమర్శించారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో జరుగుతున్న అమరావతి రైతుల పాదయాత్రకు వ్యతిరేకంగా ఆయన బైక్ ర్యాలీ చేపట్టారు. తణుకులో బహిరంగ సభలో మాట్లాడారు. మూడు రాజధానులు వల్ల పరిపాలన వికేంద్రీకరణ జరుగుతుందన్నారు. హైదరాబాద్‌ 10ఏళ్ళపాటు హక్కు ఉన్న ఓటుకు నోటు కేసులో దొరికిపోయి దొంగలగా పారిపోయి రాత్రికి రాత్రే వచ్చి బస్సులో చంద్రబాబు పడుకున్నారని ఎద్దేవా చేశారు. రియల్ ఎస్టేట్ ముసుగులో చేస్తున్న పాదయాత్ర పేక్ యాత్ర అన్నారు. 29గ్రామాల అవసరం కావాలా మూడు ప్రాంతలా ప్రజల అవసరాలను మంట పెడతారా అని జనసేన, టీడీపీ, బీజేపీ పార్టీలకు సవాల్ విసిరారు.


రాబోయే తరాలకు అన్యాయం జరగకుండా ఉండాలని మూడు ప్రాంతాలు విడిపోయే ఆలోచన లేకుండా ముందు చూపుతో వికేంద్రీకరణ చేస్తున్నారని అన్నారు. మళ్ళీ అమరావతే చుట్టూనే చంద్రబాబు లక్ష 10వేల కోట్లు అక్కడ పెడితే డబ్బు ఎక్కడి నుంచి తెస్తారని ప్రశ్నించారు. శ్రీలంక లాగా అయిపోతుంది అంటున్నవ్ చంద్రబాబు... తింటానికి తిండి కూడా లేకుండా చేయాలనీ అనుకుంటున్నారని విమర్శించారు. మూడు ప్రాంతాల చుట్టూఅభివృద్ధి కాదని ఒకప్రాంత అభివృద్ధి చేస్తే రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజల పరిస్థితి ఏమిటన్నారు. స్వార్ధపూరిత,  మోసపూరితమైన రైతు  ముసుగులో తెలుగుదేశం చేస్తున్న దొంగ యాత్రకు మద్దతు వద్దంటూ నినాదాలు చేశారు. అమరావతి రాజధాని రైతుల పాదయాత్రను నిరసిస్తూ నల్ల బెలూన్స్ వదిలారు మంత్రి కారుమూరి.