Vizag News : అసలే ఎన్నికలు ముంచుకొచ్చేస్తున్నాయి.. సీఎం జగన్ టిక్కెట్ కూడా ఖరారు చేశారు. ఇంకేముంది ఏర్పాట్లు ప్రారంభించుకోవాలన్నట్లుగా విశాఖ సౌత్ వైసీపీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్  పండగ ముహుర్తం చూసుకుని పంపకాలు ప్రారంభించారు. కనుమ రోజు తన క్యాడర్ కు ముక్క, చుక్క పంపిణీ చేశారు. అదీ కూడా తన కాలేజీలోనే కౌంటర్ పెట్టారు.                           
 
విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ కార్యకర్తలకు ఇచ్చిన కనుమ కానుక వివాదాస్పదంగా మారింది.. కళాశాలలో తమ కార్యకర్తలకు మద్యం, కోళ్లు పంపిణీ చేసిన వీడియోలు వైరల్ అయ్యాయి. ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కు  డిఫెన్స్ అకాడమీ పేరుతో ఓ కాలేజీ ఉంది. ఈ కాలేజీలో  కనుమ పండుగ సందర్భంగా   మద్యం, కోళ్ల పంపిణీ చేశారు. ఆ కాలేజీలో కౌంటర్లు ఏర్పాటు చేశారు.  ఈ కళాశాల ను రామబాణం క్యాంపస్ అని కూడా అంటారు. డిఫెన్స్ ఉద్యోగాలకు వెళ్లేందుకు శిక్షణ తీసుకునే విద్యార్థులు కూర్చునే తరగతి గదుల్లో 400 మద్యం బాటిళ్లు, బతికి ఉన్న కోళ్ల పంపిణీ చేస్తున్న వైనంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది.. అది కాస్తా వివాదంగా మారింది. ఈ పంపిణీ కోసం ముందు రోజే టోకెన్ లు పంపిణీ చేశారు.             

  


సాధారణంగా ఏపీలో మూడు మద్యం బాటిళ్లు కన్నా ఎక్కువ ఉంటే సెబ్ పోలీసులు కేసులు పెడతారు. అలాంటిది ఎమ్మెల్యే వాసుపల్లి వందల   400 మద్యం బాటిళ్లు ఎలా వచ్చాయంటూ ఆరోపణలు వస్తున్నాయి. మద్యం పంపిణీ సమయంలో కళాశాలపై అంతస్తులో ఉన్న కార్యాలయం లోనే ఎమ్మెల్యే గణేష్ ఉన్నారని తెలుస్తోంది. కానీ, లిక్కర్, కోడి పంపిణీకి సంబంధించిన వీడియోలు వైరల్‌గా మారి వివాదం రేగడంపై ఎమ్మెల్యే  స్పందించలేదు.              





 ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్  ముఖ్యమైన పండుగల కు..  ఇలానే  కోడి, మద్యం బాటిళ్లను తన అనుచరులకు పంపిణీ చేస్తూంటారు. టీడీపీలో గెలిచి వైసీపీలో మారిన ఆయన ఇటీవలి కాలంలో ఇదే పంథా అనుసరిస్తున్నారు. అయితే  ఎప్పుడూ ఇలాంటి పంపిణీ కాలేజీలో పెట్టలేదు. ఇప్పుడు మాత్రం కాలేజీలోనే పెట్టడం వివాదాస్పమవుతోంది.  ఇటీవల ఆయనకు సీఎం జగన్ టిక్కెట్ ఖరారు చేశారు. దీంతో ఈ సారి మరింత ఎక్కువ మందికి పండుగ కానుకలు పంపిణీ చేసినట్లుగా తెలుస్తోంది. ల