Kottavalasa Train Accident:మాటలకు అందని విషాదం. ఒడిశాలో ప్రమాదం గురుతులు ఇంకా మరువక ముందే మరో ఘోర ప్రమాదం జరిగింది. సిగ్నలింగ్ వ్యవస్థలో లోపాలు కారణంగా ఘోరం జరిగిపోయింది. విజయనగరం జిల్లా కొత్తవలస మండలంలో జరిగిన రైలు ప్రమాదంలో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. వందల మంది గాయపడ్డారు.
కంటకాపల్లి- అలమండ మధ్య రాత్రి 7 గంటల సమయంలో దారణం ప్రమాదం జరిగింది. ట్రాక్‌పై ఉన్న ప్యాసింజర్ రైలును వెనుకనుంచి వచ్చిన ట్రైన్ బలంగా ఢీ కొట్టింది. విశాఖ నుంచి బయల్దేరిన విశాఖపట్నం పలాస రైలును విశాఖ పట్నం రాయగడ ట్రైన్ ఢీ కొట్టింది. దీంతో పక్కనే ఉన్న గూడ్స్ ట్రైన్‌పైకి ఈ బోగీలు దూసుకెళ్లాయి. ఒడిశాలోని బాలేశ్వర్‌లో కూడా ఇలాంటి ప్రమాదమే జరిగింది.
విజయనగరం వద్ద జరిగిన ప్రమాదంలో మొత్తంగా ఏడు బోగీలు నుజ్జునుజ్జు అయ్యాయి. పట్టాలు పైకి లేచాయి. దాని కింద నుంచి రైలు బోగీలు దూసుకెళ్లాయి. ఇలా అక్కడ జరిగిన ప్రమాదం చూస్తే ఒళ్లు జలదరించక మానదు. ప్రమాదం జరిగిన తర్వాత అక్కడ సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. రాత్రి వేళ కావడంతో చలితో సహాయక చర్యలు వేగంగా సాగలేదు. ఉదయం నుంచి వాటి స్పీడ్ పెంచారు.
కొత్తవలస వద్ద జరిగిన దుర్ఘటనలో ఇప్పటికి 14 మంది మృతి చెందిననట్టు అధికారులు గుర్తించారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రమాదంలో మూడు బోగీలు నుజ్జు నుజ్జు అయ్యాయి. వంద మందికిపైగా గాయపడ్డారు. బోగీలు తీస్తున్న కొద్దీ మృతుల సంఖ్య పెరిగొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.
రెండు ప్యాసింజర్‌రైళ్లలో సుమారు 1500 మంది ప్రయాణిస్తున్నట్టు రైలు అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రమాదంలో పలాస వెళ్లే రైలులో ఉన్న గార్డు, రాయగడ రైలులో ఉన్న లోకోపైలెట్ మృతి చెందినట్టు గుర్తించారు. ప్రమాదం జరిగిన కాసేపటికి ఘటనాస్థలానికి చేరుకున్న ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలు సహాయక చర్యలు ముమ్మరం చేశాయి. ముందు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. బోగీలను కట్ చేసి అందులో ఇరుక్కుపోయిన వారిని అతి కష్టమ్మీద బయడటకు తీసి ఆసుపత్రికి తరలించారు. గాయపడ్డవారంతా విజయనగరం ప్రభుత్వాసుపత్రితోపాటు విశాఖలోని కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్నారు. ఘటనా స్థలంలో మంత్రి బొత్స సత్యనారాయణ, జిల్లా అధికారులు ఉండి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.
రైలు ప్రమాదంలో మృతి చెందిన వారి వివరాలు :
1, గిరిజాల లక్ష్మి (35).
ఎస్. పి. రామచంద్రాపురం.
జి. సిగడాం మండలం.
శ్రీకాకుళం జిల్లా.
2, కంచు భారతి రవి (30).
సన్/ఆఫ్ చిన్నారావు,
జోడుకొమ్ము (గ్రామం),
జామి (మండలం),
విజయనగరం జిల్లా.
3, చల్లా సతీష్ (32)
సన్ / ఆఫ్ చిరంజీవరావు (లేట్),
ప్రదీప్ నగర్,
విజయనగరం జిల్లా.
4, ఎస్. హెచ్. ఎస్. రావు
రాయఘడ పాసింజర్ లోకో పైలట్.
ఉత్తరప్రదేశ్.
5, కరణం అక్కలనాయుడు (45),
సన్ / ఆఫ్ చిన్నయ్య,
కాపు సంబాం (గ్రామం),
గరివిడి (మండలం),
విజయనగరం జిల్లా.
6, విశాఖ పాసింజర్ రైలు గార్డు
ఆరు మృత దేహాలు విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రి మార్చరీలో ఉంచారు.