ఆదివారం కంటకాపల్లి - అలమండ మధ్య జరిగిన రైలు ప్రమాదంతో రైల్వే శాఖ పలు రైళ్లను రద్దు చేసింది. మరికొన్నింటిని దారి మళ్లించింది. 
1) కోర్బా - విశాఖపట్నం (18517)ఎక్స్‌ప్రెస్‌ 
2) పారాదీప్ - విశాఖపట్నం (22809)ఎక్స్‌ప్రెస్‌ 
3)రాయగడ - విశాఖపట్నం (08503)ప్యాసింజర్ స్పెషల్
4) పలాస - విశాఖపట్నం (08531) ప్యాసింజర్ స్పెషల్
5) విశాఖపట్నం - గునుపుర్ (08522)ప్యాసింజర్ స్పెషల్
6)గునూపుర్ - విశాఖపట్నం (08521) ప్యాసింజర్ స్పెషల్
7) విజయనగరం - విశాఖపట్నం (07469) మెము స్పెషల్
8) విజయవాడ - విశాఖపట్నం (12718) రత్నాచల్ ఎక్స్‌ప్రెస్‌ 
9) విశాఖపట్నం - విజయవాడ (12717) రత్నాచల్ ఎక్స్‌ప్రెస్‌ 
10) గుంటూరు - విశాఖపట్నం (12739) సింహాద్రి ఎక్స్‌ప్రెస్‌ 
11) కాకినాడ - విశాఖపట్నం (17267) మెము ఎక్స్‌ప్రెస్‌ 
12) విశాఖపట్నం - కాకినాడ (17268) మెము ఎక్స్‌ప్రెస్‌ 
13) రాజమండ్రీ - విశాఖపట్నం (07466) మెము స్పెషల్
14) విశాఖపట్నం - రాజమండ్రీ (07467) మెము స్పెషల్
15)కోరాపుట్ - విశాఖపట్నం (08545) స్పెషల్
16) విశాఖపట్నం - కోరాపుట్ (08546) స్పెషల్
17) పలాస - విశాఖపట్నం (08531) స్పెషల్
18) చెన్నై - పూరి (22860) ఎక్స్‌ప్రెస్‌ 
19)రాయగడ - గుంటూరు (17244) ఎక్స్‌ప్రెస్‌ 


ఈ రైళ్లు మళ్లించారు


MGR చెన్నై సెంట్రల్ నుంచి బయలుదేరే రైలు నం. 22808 MGR చెన్నై సెంట్రల్-సంత్రాగచ్చి విజయవాడ-నాగ్‌పూర్-రాయ్‌పూర్-జార్సుగూడ-ఖరగ్‌పూర్ మీదుగా మళ్లించారు. 


హైదరాబాద్‌లో బయలుదేరే రైలు నెం. 18046 హైదరాబాద్- షాలిమార్ ఎక్స్‌ప్రెస్ విజయవాడ-నాగ్‌పూర్-రాయ్‌పూర్-జార్సుగూడ-ఖరగ్‌పూర్ మీదుగా మళ్లించారు. 


త్రివేండ్రం సెంట్రల్‌లో బయలుదేరిన రైలు నం. 22641 త్రివేంద్రం సెంట్రల్- షాలిమార్ ఎక్స్‌ప్రెస్‌ను విజయవాడ-నాగ్‌పూర్-రాయ్‌పూర్-జార్సుగూడ-ఖరగ్‌పూర్ మీదుగా దారి మళ్లించారు. 


అగర్తలా నుంచి బయలుదేరి రైలు నం.12504 అగర్తల-SMV బెంగళూరు ఎక్స్‌ప్రెస్ విజయనగరం-టిట్లాగఢ్-రాయ్‌పూర్-నాగ్‌పూర్-ఖాజీపేట-విజయవాడ మీదుగా వెళ్లనుంది. 


సంత్రాగచ్చి నుంచి బయలుదేరే రైలు నెం. 22855 సంత్రాగచ్చి-తిరుపతి ఎక్స్‌ప్రెస్ విజయనగరం-టిట్లాగఢ్-రాయ్‌పూర్-నాగ్‌పూర్-ఖాజీపేట-విజయవాడ మీదుగా దారి మళ్లించారు. 


షాలిమార్‌లో బయలుదేరే రైలు నం. 12841 షాలిమార్-MGR చెన్నై సెంట్రల్ కోరమండల్ ఎక్స్‌ప్రెస్ విజయనగరం-టిట్లాగఢ్-రాయ్‌పూర్-నాగ్‌పూర్-ఖాజీపేట-విజయవాడ మీదుగా దారి మళ్లించారు. 


MGR చెన్నై సెంట్రల్ నుంచి బయలుదేరిన రైలు నం. 12842 MGR చెన్నై సెంట్రల్- షాలిమార్ కోరమండల్ ఎక్స్‌ప్రెస్ విజయవాడ-నాగ్‌పూర్-రాయ్‌పూర్-జార్సుగూడ-ఖరగ్‌పూర్ మీదుగా దారి మళ్లించారు. 


 


ఏపీలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. రెండు రైళ్లు ఢీకొన్న ఘటనలో 12 మంది మృతిచెందగా, పదలు సంఖ్యలో ప్రయాణికులు గాయపడ్డారు. రాత్రి 7 గంటల 10 నిమిషాలకు విశాఖ నుంచి పలాస వెళ్తున్న ప్యాసింజర్ రైలు (08532) సిగ్నల్ కోసం కొత్తవలస మండలం అలమండ, కంటకాపల్లి వద్ద పట్టాలపై ఆగి ఉంది. అదే లైనులో వెనుకే వచ్చిన విశాఖ- రాయగడ రైలు (08504).. పలాస వెళ్తున్న రైలును ఢీకొట్టింది. మొదట పట్టాలు తప్పిన రైలును మరో రైలు ఢీకొట్టినట్లు అధికారులు భావించారు. కానీ సిగ్నల్ కోసం వేచి ఉన్న పలాసకు వెళ్తున్న రైలును విశాఖ నుంచి రాయగడ వెళ్తున్న రైలు ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న వెంటనే రెస్క్యూ టీమ్ అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.