విశాఖలో జరుగుతున్న గ్లోబల్‌ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌ ముగింపు సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ మాట్లాడుతూ... ఈ సదస్సును విజయవంతం చేసిన పారిశ్రామికవేత్తలకు ధన్యవాదాలు చెప్పారు. పారిశ్రామికవేత్తల పెట్టుబడులుతో ఈ రాష్ట్రాన్ని మరింత ముందుకు తీసుకెళ్తుందన్నారు. అనుకూలమైన వాతావరణం ఏర్పాటుకు ఇది దోహదపడుతుందన్నారు.


తన పాలనలో ఆర్థిక వ్యవస్థ వేగం పుంజుకుందని చెప్పారు జగన్ . అనేక రంగాలకు తాము ఇచ్చిన ప్రధాన్యత ఆర్థిక వ్యవస్థను కాపాడాయి అన్నారు. వ్యాపార అనుకూల వాతావరణం ఏర్పాటు చేశామన్నారు. బ్రాడ్‌ బాండ్, ఇంటర్నెట్‌ అందరికీ అందించామన్నారు. పదిహేను రంగాను ప్రాధాన్యత అంశాలుగా తీసుకున్నట్టు చెప్పారు. 


గత మూడున్నరేళ్లలో ఏపీ ఆర్థికంగా ముందడుగు వేస్తోందన్నారు సీఎం జగన్. కీలక సమంయోల ఈ సమ్మిట్ నిర్వహించామన్నారు. ఏపీని పారిశ్రామిక హబ్‌గా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. 15 కీలక రంగాల్లో ఫలవంతమైన చర్యలు జరిగాయని పేర్కొన్నారు. కరోనా సమయంలో ప్రభుత్వం పథకాలు ప్రజలకు అండగా నిలిచిందన్నారు. ఏపీ ప్రభుత్వం చిత్తశుద్ధితో అడుగులేస్తోందని వివరించారు. 


రెండు రోజుల సమ్మిట్‌లో 378 ఎంవోయూలు జరిగాయని వివరించారు సీఎం జగన్. మొత్తం 13 లక్షల 41వేల 734 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు పరిశ్రమలు ఆసక్తి చూపినట్టు పేర్కొన్నారు. దీని వల్ల 6 లక్షల 9వేల 868 మందికి ఉపాధి లభించనుందన్నారు. 


ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించిన గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ 2023కి పరిశ్రమల నుంచి భారీ స్పందన లభించింది. ఈ కార్యక్రమంలో దేశ విదేశశాల నుంచి  ప్రపంచస్థాయి సంస్థలు తరలి వచ్చాయి. రాష్ట్రానికి రూ.13 లక్షల కోట్ల విలువైన పెట్టుబడి ప్రతిపాదనలు తీసుకొచ్చాయి. 


గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో ముగింపు ప్రసంగం చేసిన సీఎం జగన్.. “అపారమైన సానుకూల దృక్పథంలో ప్రారంభించిన సమిట్‌లో  రూ. 13,41,734 కోట్లకుపైగా పెట్టుబడు పెట్టేందుకు 6,09,868 మందికి పైగా ఉపాధి అవకాశాలు కల్పించేందుకు 378 MOUలు చేసుకున్నాం. ఒక్క ఎనర్జీ సెక్టార్‌లోనే 1,90,268 మందికి ఉపాధి కల్పించే రూ.8,84,823 కోట్ల పెట్టుబడులకు 40 అవగాహన ఒప్పందాలు కుదిరాయి. ఐటీ అండ్‌ ఐటీఈఎస్‌ సెక్టార్‌లో రూ. 25,587 కోట్ల పెట్టుబడితో 56 అవగాహన ఒప్పందాలు కుదిరాయి. ఇవి 1,04,442 మందికి ఉపాధిని కల్పిస్తాయి. పర్యాటక రంగంలో 30,787 మందికి ఉపాధి కల్పించే రూ. 22,096 కోట్ల పెట్టుబడుల కోసం 117 అవగాహన ఒప్పందాలు కుదిరాయి."


"గణనీయమైన పెట్టుబడులకు అవకాశశం ఉన్న రంగాల్లో పునరుత్పాదక ఇంధన రంగం ఒకటి అని గట్టిగా చెప్పగలను. నిబద్ధత గ్రీన్ ఎనర్జీ కోసం ప్రయత్నిస్తూ భారత్‌కు గణనీయమైన సహకారాన్ని అందిస్తాం ” అని ముఖ్యమంత్రి తెలిపారు. 14 ఇండస్ట్రీయల్ ఫెసిలిటీస్‌ను రిమోట్ ద్వారా సీఎం ప్రారంభించారు. రూ.3,841 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేసిన ఈ యూనిట్లు 9,108 మంది కార్మికులకు ఉపాధి కల్పిస్తాయి.


ఈ సమ్మిట్ సందర్భంగా 100 మందితో  15 సెక్టార్లపై సెషన్‌లు నిర్వహించారు. ఏపీలో ఉన్న అడ్వాంటేజ్‌లను తెలియజేశారు. ఇందులో ఆటోమొబైల్ & EV సెక్టార్, హెల్త్‌కేర్ & మెడికల్ ఎక్విప్‌మెంట్, రెన్యూవబుల్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమ్మోనియా, అగ్రి ప్రాసెసింగ్ టూరిజం మొదలైనవి ఉన్నాయి. దీనితో పాటు ఆంధ్రప్రదేశ్‌తో సహకారం కోసం అవకాశాలను అన్వేషించడానికి UAE, నెదర్లాండ్స్, వియత్నాం, ఆస్ట్రేలియాతో సమావేశాలు నిర్వహించారు. 


రెండు రోజుల శిఖరాగ్ర సదస్సులో కనిపించిన అద్భుతమైన ఆశావాదం రాష్ట్రంలో వ్యాపార వాతావరణాన్ని మరింత అనుకూలంగా మారుస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. “ఎంఒయు దశ నుంచి ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులను త్వరితగతిన గ్రౌండింగ్ చేయాలని పారిశ్రామికవేత్తలకకు సీఎం అభ్యర్థించారు.  దీనికి కావాల్సిన అన్ని సౌకర్యాలను ప్రభుత్వం అందిస్తుందన్నారు.