Srikakulam Latest News: శ్రీకాకుళం పోలీస్ డాగ్స్ కేనాల్ ఇది. ఈ డాగ్స్‌కి రోజు వారి శిక్షణ ఇచ్చి అవసరమైనప్పడు వాటిని విచారణలో వినియోగిస్తుంటారు. ఇలా కుక్కలను క్రైమ్ సీన్‌కు తీసుకుని వెళ్లే వారిని హ్యాండ్లర్స్ అంటారు. లెబ్రేడర్ రిట్రీవర్, డాబర్ మాన్, జర్మన్ షెపర్డ్ జాగిలాలనే పోలీసులు తమ శాఖలో ఎక్కువగా ఉపయోగిస్తారు. అలాగే పోలీస్ డాగ్స్‌ని ట్రేడ్స్ అంటారు.
శ్రీకాకుళంజిల్లా డిపార్ట్‌మెంట్‌లో మూడు రకాల ట్రేడ్లు ఉన్నాయని హ్యండ్లర్ పెంటయ్య రెడ్డి వివరించారు. నార్కోటిక్, ఎక్స్‌ప్లోజివ్, ట్రాకర్. దొంగతనాలకు, మర్డర్లలో నిందితులను గుర్తించడానికి ఈ ట్రాకర్ వినియోగిస్తుంటారు. దొంగల్ని పట్టుకోవడావడానికి ఉపయోగిస్తారు. శ్రీకాకుళం జిల్లాలో ఈ ట్రాకర్లు నాలుగు ఉండేవి. ఇందులో రెండు రిటైర్ అయ్యాయి.
బాంబులు ఎక్కడున్నా, వీఐపీ సెక్యూరిటీ పర్సప్‌కు ఎక్స్ పోజివ్ రకాన్ని వాడుకుంటారు. ఎక్కడ బాంబులు, ఎక్స్‌ప్లోజివ్స్ ఉన్నా పట్టుకోవడం దీని డ్యూటీ. గంజాయి, బ్రౌన్ షుగర్ ఇలాంటి మత్తు పదార్థాలు గుర్తించడానికి వాడేదే నార్కోటిక్. ఆ స్మెల్ ను ఇది పసిగడుతుంది.
పోలీస్ డాగ్స్‌కు పది నెలలు మంగళగిరిలోని Intelligence security wing (ISW) లో ట్రైనింగ్ ఇస్తారు. హ్యండ్లర్ ఇచ్చే సిగ్నల్స్ అర్థం చేసుకోవడం, వాసన పసిగట్టడంపై శిక్షణ ఇస్తారు. అనంతరం పోలీసు అవసరరాలకు తగ్గట్టు ఈ డాగ్స్‌ను ఉపయోగిస్తారు.
ఎక్స్‌ప్లోజీవ్ డాగ్ హ్యండ్లర్లు కార్డెక్స్ లాంటి తక్కువ స్మెల్ ఉన్న వాటిని వాటికి వాసన చూపించి ట్రైనింగ్ ఇస్తారు. అయితే ఎంతటి తక్కువ వాసన వచ్చినా కనిపెట్టేందుకు ఇలా ట్రైనింగ్ ఇస్తారు. దీనిపై ఏబీపీ దేశం కోసం పోలీసులు ఓ డెమో కూడా చేసి చూపించారు. ఓ కార్డెక్స్ ఆ డాగ్ చూడకుండానే ఐదు బ్యాగుల్లో ఒకదాంట్లో పెట్టారు. కాసేపటికి ఎక్స్ పోజివ్ డాగ్ వచ్చి ఏ బ్యాగ్‌లో కార్డెక్స్ ఉందో అక్కడే ఆగింది. ఇండికేషన్ ఇచ్చింది.
ఒకే డాగ్ రెండింటిని పట్టుకోగలదా లేదా అనేది చూపించడం కోసం ఈసారి పేలుడు పదార్థంతోపాటు గంజాయిని కూడా పెట్టి మరో డెమో చేసి చూపించారు
ఒకటి ఎక్స్ పోజివ్, రెండు నార్కోటిక్. ఐదు బ్యాగులున్న ప్రాంతంలో ఒకదాంట్లో ఎక్స్‌ప్లోజివ్ పెట్టారు. మరో దాంట్లో గంజాయిని పెట్టారు. అన్నీ బ్యాగులు ఈక్వల్‌గా ఉన్నాయి. కాసేపటికి నార్కోటిక్ డాగ్ వదిలారు. ఐదు బ్యాగ్‌లు వెతికిన కుక్క గంజాయి పెట్టిన బ్యాగ్‌లను వెతికి పెట్టింది. ఐదో బ్యాగు దగ్గర అరుస్తూ నిలబడింది. హ్యండర్లుకు సిగ్నల్ ఇచ్చింది. దాని ట్రేడ్ నార్కోటిక్ కాబట్టి గంజాయిని పట్టుకుంది .
ఈసారి బ్యాగుల్లో కాకుండా వాహనాల వరుసలో ఏదైనా వాహనంలో గంజాయి పెడితే పట్టుకుంటుందో లేదో చూద్దామని మరో డెమో చూపించారు. ట్రైనింగ్ ఇచ్చే హ్యండ్లరుకు కానీ, డాగ్‌కు కానీ తెలియకుండా గంజాయిని వాహనంలో పెట్టారు. ఇది చాలా తక్కువ మోతాదులో పెట్టారు. ఎంత అంటే పది గ్రాములు ఉంటుంది. స్మాల్ క్వాంటీటీస్‌ను కూడా పట్టుకునేందుకు డాగ్స్‌కు ట్రైనింగ్ ఇస్తారు.
అక్కడ ఉన్న ఐదు వెహికిల్స్ ఒకదానిలో గంజాయిని పెట్టారు. నోటితో కరుచుకుని సిగ్నల్ ఇచ్చింది. ఇక్కడ ఉంది అనే విషయాన్ని సిగ్నల్ ఇచ్చింది. ఎక్కడైతే పెట్టామో దానిని, బ్యాగుల దగ్గర పెడితే బ్యాగుల దగ్గర, వాహనాల్లో పెడితే వాహనాల దగ్గర ఎక్కడ ఉంటే అక్కడ కూర్చుకుంది. అంటే ఎవరైతే నార్కోటిక్స్, పేలుడు క్యారీ చేస్తారో, ఆ విషయాన్ని హ్యండ్లర్‌కు సిగ్నల్ ఇస్తుంది.
శ్రీకాకుళం జిల్లాలో నిర్వహించిన డాగ్స్ పరేడ్ ఆకట్టుకుంది. ఈ సందర్భంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ టైంలో నార్కోటిక్ డాగ్ స్కూటీలో వెళ్తున్న ఓ యువకుడిని వెంబడించింది. పోలీసులు ఆ స్కూటీని చెక్ చేయగా...అందులో గంజాయి దొరికింది. విశాఖలో నార్కోటిక్ ని పట్టుకోవడంలో ముఖ్యంగా చాలా చిన్నచిన్న క్వాంటిటీలను సైతం పట్టుకోవడంలో డాగ్స్ బాగా ఉపయోగపడుతున్నాయని చెప్పారు.
గంజాయి ఏజెన్సీ నుంచి సిటీ ద్వారా ట్రైన్స్‌లో, కంటైనర్స్‌లో వెళ్తుంది కాబట్టి, ఈ విషయాన్ని గుర్తించేందుకు ప్రతీది చెక్ చేయడం సాధ్యం కాదు. అందుకే ట్రైన్డ్ డాగ్స్ రంగంలోకి దించారు. ఈ విషయంపై రెండు మూడు సంవత్సరాలు క్రితమే ప్రభుత్వానికి అభ్యర్థించామని పోలీసులు తెలిపారు. కొన్ని రోజులు ప్రయోగాత్మకంగా పరీక్షించి ఇప్పుడు పూర్తి స్థాయిలో రంగంలోకి దిగుతున్నామన్నారు పోలీసులు
సాధారణంగా 7 నుంచి 10 ఏళ్లు సేవలందించి పోలీస్ డాగ్స్ రిటైర్ అవుతాయి. ఆ తర్వాత కూడా పోలీసు విభాగమే వాటి సంరక్షణ చూస్తుంది. ఏదైనా డాగ్ చనిపోతే పోలీసు లాంఛనాలతో అంత్యక్రియలు కూడా చేస్తారు.