ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి రేపు (ఏప్రిల్ 19) శ్రీకాకుళం జిల్లా పర్యటనకు వెళ్లనున్నారు. దీనికి సంబంధించి షెడ్యూల్‌ ను అధికారులు ఖరారు చేశారు. సంతబొమ్మాళి మండలంలో మూలపేట గ్రీన్‌ఫీల్డ్‌ పోర్టు నిర్మాణానికి రేపు సీఎం జగన్ శంకుస్థాపన చేస్తారు.


పర్యటన షెడ్యూల్ ఇదీ



  • ఉదయం 8 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు.

  • ఉదయం 9.20కు విశాఖపట్టణం ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు.

  • 9:30 గంటలకు విశాఖపట్నంలో బయలుదేరి సంతబొమ్మాళి మండలం మూలపేటలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్‌కు 10.15 గంటలకు చేరుకుంటారు.

  • 10.30 – 10.47 గంటల మధ్య మూలపేట గ్రీన్‌ఫీల్డ్‌ పోర్టు నిర్మాణానికి ముఖ్యమంత్రి శంకుస్ధాపన చేస్తారు.

  • అనంతరం గంగమ్మ తల్లికి పూజా కార్యక్రమాలు చేస్తారు.

  • 11.25 – 11.35 గంటల మధ్య నౌపడ వద్ద పోర్టు నిర్వాసిత కాలనీకి శంకుస్ధాపన చేస్తారు.

  • దీంతోపాటు ఎచ్చెర్ల మండలం బుడగట్లపాలెం ఫిషింగ్‌ హార్బర్‌కు, హిరమండలం వంశధార లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్ట్‌కు శంకుస్ధాపన కార్యక్రమంలో పాల్గొంటారు.

  • 11.40 – 12.30 గంటల మధ్య బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌ ప్రసంగం ఉండనుంది.

  • అనంతరం మూలపేట, విష్ణుచక్రం గ్రామాల ప్రజలతో ముఖాముఖి, సన్మాన కార్యక్రమం, సమావేశం ఉంటుంది.

  • అనంతరం మధ్యాహ్నం 1.10 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి మధ్యాహ్నం 3 గంటలకు గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు.
    3.25 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.


దశాబ్దాలకు పోర్టుకు శంకుస్థాపన



  • 1978లో భావనపాడు పోర్టుగా తెరపైకి ప్రతిపాదన

  • రాజకీయ, ఆర్థిక కారణాలతో దశాబ్దాల జాప్యం

  • సాంకేతిక సమస్యలతో మరికొన్నేళ్లు ఆలస్యం

  • 2019లో చంద్రబాబు హయాంలో భూసేకరణకు నోటిఫికేషన్

  • వైకాపా ప్రభుత్వ హయాంలో మూలపేట పోర్టుగా పేరుమార్పు,శంకుస్థాపన

  • చివరికి స్థలం మార్చి.. పరిధి కుదించి శంకుస్థాపనకు సిద్ధం

  • ఇది కూడా ఎన్నికల హామీగా మిగులుతుందేమోనన్న అనుమానాలు


2024 ఎన్నికల్లోపు నిర్మాణం పూర్తి అయ్యే అవకాశమైతే లేదు. ఎన్నికల తర్వాత ఏ ప్రభుత్వం వచ్చినా నిర్మాణాన్ని కొనసాగిస్తే తప్ప జిల్లావాసుల కల ఫలించదు. రూ.13.48 కోట్ల అంచనా వ్యయం తో ఫిషింగ్ హార్బర్ నిర్మాణానికి 1978 అక్టోబరు 13న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఆ ప్రకారం 1980 బడ్జెట్ లో తొలిసారి రూ.1.81 కోట్లు మంజూరు చేశారు. 1988 నాటికి నిర్మాణం పూర్తి చేయాలని నిర్ణయించినా కార్యరూపం దాల్చలేదు. సుమారు 27 సర్వేలు నిర్వహించినా పోర్టుకు మోక్షం కలగలేదు. 1983 మే 31న హార్బర్ రక్షణకు రూ. 52.65 లక్షలతో సముద్రంలో రాతిగోడల నిర్మాణానికి సాంకేతిక అనుమతి లభించింది.