Amudalavalasa AP Elections 2024- శ్రీకాకుళం: ఆమదాలవలస నియోజకవర్గంలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఈ నియోజకవర్గంలో మామా అల్లుళ్ళ మధ్య పోటీ నెలకొనగా స్వతంత్ర అభ్యర్థి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ప్రజలలోకి వెళ్తున్నారు. మరికొంత మంది స్వతంత్ర అభ్యర్థులుగా ఆ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున తమ్మినేని సీతారాం మరోసారి ఆమదాలవలస నుంచి బరిలోకి దిగుతున్నారు. 10వ సారి ఆయన అసెంబ్లీ ఎన్నికలలో పోటీ పడుతున్నారు. ఆయన స్పీడ్ కి అడ్డుకట్టు వేసేందుకు టీడీపీ, జనసేన, బిజెపి పార్టీల ఉమ్మడి అభ్యర్థి కూన రవికుమార్ ప్రయత్నాలు సాగిస్తున్నారు.


పోటాపోటీగా ప్రచారం చేస్తున్న నేతలు 
అటు తమ్మినేని సీతారాం ఇటు కూన రవికుమార్ లు పోటాపోటీగా ప్రచారం కొనసాగిస్తున్నా రు. వైకాపాలో ఉంటూ ఆ పార్టీలో జరిగిన అవమానాలతో రాజీనా మా చేసిన సువ్వారి గాంధీ స్వతంత్ర అభ్యర్ధిగా పోటీకి సిద్దమై ప్రచా రం చేసుకుంటున్నారు. దీంతో ముగ్గురు నాయకులు కూడా నియో జకవర్గంలో విస్తృతంగా పర్యటనలు చేస్తూ ప్రచారాలను నిర్వహి స్తున్నారు. వైకాపా అభ్యర్థిగా పోటీ చేస్తున్న తమ్మినేని సీతారాం ఆమదాలవలస సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈ ఎన్నికలలో ఆయన తనయుడు తమ్మినేని చిరంజీవి నాగ్ ను బరిలోకి దింపా లని భావించారు. అయితే వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి 2024 ఎన్నికలలో తమ్మినేని సీతారాంనే పోటీ చేయాలని స్పష్టం చేయడంతో ఆయన బరిలో నిలిచారు. ఆమదాలవలస వైకాపా అభ్యర్ధిగా ఆయననే పార్టీ ప్రకటించింది. దీంతో తమ్మినేని సీతారాం నియోజ కవర్గంలో ప్రచారాన్ని ప్రారంభించారు.


రోజుకో ప్రాంతంలో తమ్మినేని ప్రచారం.. 
ఆమదాలవలస నియోజక -వర్గంలో ఆమదాలవలస మున్సిపాల్టీతో పాటు ఆమదాల వలస మం డలం, పొందూరు, బూర్జ, సరుబుజ్జిలి మండలాలు ఉండగా వాటిలో రోజుకో ప్రాంతంలో తమ్మినేని ప్రచారాన్ని సాగిస్తున్నారు. వైకాపా ప్రభుత్వ ఐదేళ్ళ పాలనలో చేసిన అభివృద్ది, సంక్షేమ పథకాలను ప్రజలకి వివరిస్తూ మరోసారి వైకాపాకి అండగా నిలవాలని ఆయన విజ్ఞప్తి చేస్తున్నారు. గ్రామాల చెంతకే ప్రభుత్వ సేవలను తీసుకువచ్చిన, లబ్ధిదారులకి నేరుగా సంక్షేమ ఫలాలు అందిస్తున్న జగన్మోహన్ రెడ్డికి ప్రజలు మద్దతు ఇవ్వాలని ఆయన కోరుతున్నారు. ఇదే సందర్భంలో ప్రతిపక్ష పార్టీలు చెప్పే మాటలను నమ్మవద్దని కూడా ప్రజలను హెచ్చరిస్తున్నారు. ఆమదాలవలస నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న తనను, శ్రీకాకుళం ఎంపిగా పోటీ చేస్తున్న పేరాడ తిలక్ లను రానున్న ఎన్నికలలో గెలిపించాలని ప్రజలకి తెలియజేస్తున్నారు. ఇంటింటి వెళ్ళి ప్రజలను కలుసుకు ంటూ వారి మద్దతును కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు.


ఆమదాలవలస నియోజకవర్గం నుంచి తెదేపా, జనసేన, బిజెపి ఉమ్మడి అభ్యర్ధిగా బరిలో నిలుస్తున్న కూన రవికుమార్ కూడా గ్రామాలలో  తిరుగుతున్నారు. ఇంటింటికి వెళ్ళి విస్తృత ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు నాయకత్వంలోనే రాష్ట్ర ం అభివృద్ధి చెందుతుందని, ఆయన వస్తే సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తారని ప్రజలకి వివరిస్తున్నారు. ఐదేళ్ళ వైకాపా పాలనలో ప్రజలపై భారాలను మోపారని, చార్జీల మోత మ్రోగించారని తెలియజేస్తున్నారు. వైకాపా నేతల అవినీతి, అక్రమాల కు అడ్డుకట్టు వేయాలంటే రాష్ట్రంలో తెదేపా, జనసేన, బిజెపిల ఉమ్మడి ప్రభుత్వం రావాలని కూన రవికుమార్ తెలియజేస్తూ ముందుకు సాగుతున్నారు. తెదేపా, జనసేన, బిజెపి పార్టీల నాయకులు కూన రవికుమార్ తో పాటు ప్రచార కార్యక్రమాలు, సమావేశాలలో పాల్గొంటున్నారు.


గత ఎన్నికల్లో ఏం జరిగింది.. 
రానున్న ఎన్నికలలో ఆమదాలవలస నుంచి తనను, శ్రీకాకుళం పార్లమెంట్ సభ్యుడు గా కింజరాపు రామ్మోహన్నాయుడును గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రధాన పార్టీల నుంచి పోటీ చేస్తున్న తమ్మినేని సీతారాంలు వరుసకి మామా అల్లుళ్ళు కాగా వారి మధ్య పోటీ రసవత్తరంగా మారింది. 2009 నుంచి వరుసగా జరుగుతున్న ఎన్నికలలో తమ్మినేని సీతారాం, కూన రవికుమార్ లు ఆమదాలవలస నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. 2009లో కాంగ్రెస్ అభ్యర్థి బొడ్డేపల్లి సత్యవతి అక్కడ గెలుపొందగా 2014లో కూన రవికుమార్ తెదేపా అభ్యర్థిగా విజయం సాధించారు. 2019 ఎన్నికలలో వైకాపా తరపున తమ్మినేని సీతారాం గెలుపొందారు. 2024 ఎన్నికలలో మరోసారి వైకాపా తరపున తమ్మినేని సీతారాం, తెదేపా, జనసేన, బిజెపి పార్టీల తరపున కూన రవికుమార్ లో పోటీ చేస్తూ విజయం కోసం శ్రమిస్తున్నారు.


వైకాపాకి రాజీనామా చేసిన పొందూరు మండలానికి చెందిన నాయకుడు సువ్వారి గాంధీ స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేసేందుకు సిద్దమయ్యారు. తన అనుయాయులు, మద్దతుదా రులతో సమాలోచనలు చేసిన ఆయన నియోజకవర్గంలో ప్రచారాన్ని కూడా ప్రారంభించారు. మామా, అల్లుళ్ళ అవగాహన రాజకీయాలకు చరమగీతం పాడేలా తనకు ఒక్క అవకాశం ఇవ్వాలని సువ్వారి గాంధీ నియోజకవర్గ ప్రజలను కోరుతున్నారు. అధికార, ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులను ఢీ కొట్టేందుకు గాంధీ తన మద్దతుదారులతో ప్రచారం సాగిస్తున్నారు. ఇంటింటికి వెళ్ళి తనకి ఒక్క అవకాశం ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేస్తున్నారు. తన బందువర్గాన్ని, మిత్రులను, శ్రేయేభిలాషులను కలుసుకుని రానున్న ఎన్నికలలో తనకి ఆశీస్సులు అందించాలని ఆయన కోరుతున్నారు. అదేవిదంగా పలువురు ఈ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగేందుకు సిద్దమవుతున్నారు. మొత్తం మీద చూస్తే ఆమదాలవలస నియోజకవర్గంలో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి.