ఆంధ్రాయూనివర్శిటీ గ్రౌండ్స్‌లో మార్చి 3, 4 తేదీల్లో జరిగే గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌కు ఏర్పాట్లు స్పీడ్‌గా జరుగుతున్నాయి. అధికార యంత్రాంగం ఇప్పటికే ఏర్పాట్లలో నిమగ్నమై ఉంది. సమ్మిట్‌కు వచ్చే పారిశ్రామికవేత్తలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి దీనిపై సమీక్షలు నిర్వహిస్తున్నారు. ముఖ్యమంత్రి కూడా సోమవారం సమీక్ష నిర్వహించార. సమ్మిట్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని సూచించారు. పరిశ్రమల ేర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న అన్ని రకాల ప్రోత్సాహకాల సమాచారాన్ని వాళ్లుకు తెలియజేయాలన్నారు.
మూడో తేదీ ఉదయం 10 గంటలకు సదస్సు ప్రారంభం కానుంది. ఈ సదస్సు జరిగే రెండు రోజుల పాటు సీఎం జగన్ విశాఖలోనే ఉంటారు. వివిధ పారిశ్రామిక రంగాలపై జరిగే సెషన్లలలో సీఎం స్వయంగా పాల్గొంటారు. పారిశ్రామికవేత్తలతో సమావేశమవుతారు. రాష్ట్రంలో ఉన్న వనరులు, ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహకాలను పారిశ్రామికవేత్తలకు వివరిస్తారు. సమ్మిట్ మొదటి రోజు జరిగే విందులో పారిశ్రామికవేత్తలతో కలిసి సీఎం పాల్గొంటారు.
విశాఖలో మార్చి 3, 4 వ తేదీల్లో నిర్వహించనున్న గ్లోబస్ ఇన్వెస్టర్ సమ్మిట్‌కు ఏర్పాట్లు చాలా వేగంగా జరుగుతున్నాయని... ఈ కార్యక్రమానికి అందరూ హాజరై విజయవంతం చేయాలన్నారు సీఎం జగన్. రాష్ట్ర ప్రగతిని, అందాలను ఆస్వాదించాల్సిందే కోరుతున్నానంటూ ట్వీట్ చేశారు. అందర్నీ త్వరలోనే విశాఖలో కలుస్తానన్నారు.
కీలకమైన 15 రంగాల్లో పెట్టుబడులు ఆకర్షించడమే ధ్యేంగా ఈ సమ్మిట్‌ను ప్రభుత్వం నిర్వహిస్తోంది. తొలిరోజు తొమ్మిది రంగాలపై, రెండో రోజు ఆరు రంగాలపై చర్చ నిర్వహిస్తారు. ఫుడ్ ప్రాసెసింగ్, రెన్యువబుల్ ఎనర్జీ గ్రీన్ హైడ్రోజన్, హెల్త్‌కేర్-మెడికల్ ఎక్విప్‌మెంట్, ఏరో స్పేస్-డిఫెన్స్, పెట్రోలియం-పెట్రో కెమికల్స్, స్కిల్ డెవలప్‌మెంట్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్‌ప్రా లాజిస్టిక్, ఎలక్ర్టానికిస్, ఆటోమోటివ్- ఈవీ, స్టార్టప్ ఇన్నోవేషన్, ఉన్నత విద్య, టూరిజం, టెక్స్‌టైల్, ఫార్మాస్యూటికల్ విభాగాల్లో పెట్టబుడులకు ఎక్కువ అవకాశం ఉందని ప్రభుత్వం వివరించనుంది.