హైదరాబాద్‌లోని ఏపీ కాలేజ్ ఆఫ్ జర్నలిజం 2023-24 విద్యా సంవత్సరానికి వివిధ జర్నలిజం కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది. కోర్సులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. డిగ్రీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు మార్చి 7లోగా దరఖాస్తులు పొందాలి. మార్చి 13లోగా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.
వివరాలు..
➥ పీజీ డిప్లొమా ఇన్ జర్నలిజం (పీజీడీజే)
అర్హత: డిగ్రీ.
కోర్సు వ్యవధి: 12 నెలలు
➥ డిప్లొమా ఇన్ జర్నలిజం (డీజే)
అర్హత: డిగ్రీ.
కోర్సు వ్యవధి: 6 నెలలలు
➥ డిప్లొమా ఇన్ టీవీ జర్నలిజం(డీటీవీజే)
అర్హత: డిగ్రీ.
కోర్సు వ్యవధి: 6 నెలలు
➥ సర్టిఫికెట్ కోర్స్ ఆఫ్ జర్నలిజం (సీజే)
అర్హత: పదోతరగతి లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి.
కోర్సు వ్యవధి: 3 నెలలు
దరఖాస్తు ఫీజు: రూ. 500.
దరఖాస్తు విధానం: ప్రవేశం కోరువారు తమ పేరును రిజిస్టరు చేసుకుని దరఖాస్తు ఫారం ఈ మెయిల్ ద్వారా పొందటకం కోసం రూ.500లు కాలేజీ బ్యాంక్ ఖాతాకు ఆన్‌లైన్ ద్వారా ట్రాన్స్‌ఫర్ చేయాలి.
Account Name: Director, A P College of Journalism
Bank Name : Karur Vysya Bank, Abids, Hyderabad.
Account No. : 1443155000015751 IFSC Code : KVBL0001443
మీ నగదు బదిలీ అయిన వెంటనే director@apcj.in కు మీ పేరు, అడ్రసుతో పాటు Transaction Details పంపితే, మీ Registration ప్రోసెస్ అవుతుంది. మీకు ఈ మెయిల్ ద్వారా నంబరు ముద్రించిన దరఖాస్తు ఫారం అందుతుంది. పొందిన దరఖాస్తును పూర్తి చేసి, దరఖాస్తుఫారం లో సూచించిన ప్రకారం, మొదటి వాయిదా ఫీజు ఆన్ లైన్ ద్వారా చెల్లించి, సంబంధిత డాక్యుమెంట్లను, ఆన్ లైన్లో అప్ లోడ్ చెయ్యాలి.
ముఖ్యమైన తేదీలు..
➥ దరఖాస్తులు పొందటానికి చివరితేదీ: 07.03.2023.
➥ దరఖాస్తుల సమర్పణకు చివరితేదీ: 13.03.2023.
Also Read:
NEST: నేషనల్ ఎంట్రన్స్ స్క్రీనింగ్ టెస్ట్- 2023 నోటిఫికేషన్ వెల్లడి, పరీక్ష ఎప్పుడంటే?
భువనేశ్వర్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ & రిసెర్చ్ (నైసర్), యూనివర్సిటీ ఆఫ్ ముంబయి ఆధ్వర్యంలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ సెంటర్ ఫర్ ఎక్స్‌లెన్స్ ఇన్ బేసిక్ సైన్సెస్ (సీఈబీఎస్) సంస్థల్లో అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే 'నేషనల్ ఎంట్రన్స్ స్క్రీనింగ్ టెస్ట్ (నెస్ట్) 2023' నోటిఫికేషన్ విడుదలైంది. ఇంటర్ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఇంటర్ చదువుతున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు ఫిబ్రవరి 27 నుంచి మే 17 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ఫీజుగా జనరల్, ఓబీసీ అభ్యర్థులు రూ.1,200 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులు రూ.600 చెల్లిస్తే సరిపోతుంది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
CIPET: సీపెట్ అడ్మిషన్ టెస్ట్-2023 నోటిఫికేషన్ వెల్లడి, పరీక్ష ఎప్పుడంటే?
సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోకెమికల్స్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ(సీపెట్) 2023 విద్యా సంవత్సరానికి గాను వివిధ కోర్సుల ప్రవేశాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. కోర్సు అనుసరించి పదవతరగతి, డిగ్రీ, డిప్లొమా ఉత్తీర్ణులైన అభ్యర్థులు ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు మే 28 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తుచేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజుగా జనరల్, ఓబీసీ అభ్యర్థులు రూ.500 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.250. నార్త్ ఈస్ట్రర్న్ రిజీయన్ అభ్యర్థులు రూ. 100 చెల్లిస్తే సరిపోతుంది. కంప్యూటర్ పరీక్షలో మెరిట్ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..