Global Investors Summit Live Updates: గ్లోబల్‌ ఇన్వెస్టర్స్ సమ్మిట్ విజయవంతం చేసిన వారందరికీ ధన్యవాదాలు : జగన్

విశాఖపట్నంలో జరుగుతున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌ కు సంబంధించిన లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ చూడవచ్చు.

ABP Desam Last Updated: 04 Mar 2023 12:21 PM
పారిశ్రామికవేత్తలు ఇచ్చిన ఎనర్జీతో పని చేసి వారి అంచనాలు అందుకుంటాం: ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి

సీఎం జగన్ విశ్వసనీయత, ఆయన మాటలను నమ్మే భారతదేశంలోని బిజినెస్‌ టైకూన్స్ శిఖరాగ్రానికి దిగేలా చేసింది. ఈ సమ్మిట్‌ ఫలవంతమైన చర్చలు, పెట్టుబడి, వ్యూహాత్మక సంస్కరణలతో ముగుస్తుంది. ఆంధ్రప్రదేశ్‌లో అన్ని విభాగాల్లో పెట్టుబడులకు అవకాశం ఉంది. పారిశ్రామికవేత్తల అంచనాలను అందుకునేందుకు మా ప్రభుత్వం అదే ఎనర్జీతో పని చేస్తుంది.  - అమర్‌నాథ్‌, ఏపీ ఐటీ అండ్‌ పరిశ్రమల మినిస్టర్ 

రెండో రోజు జరిిగిన ఎంవోయూలు

ఎండానా ఎనర్జీస్‌ ఎంవోయూ రూ. 285 కోట్లు 
అబ్సింకా హోటల్స్ ఎంవోయూ రూ. 260 కోట్లు 
సర్‌రే విలేజ్‌ రిసార్ట్స్‌ ఎంవోయూ రూ. 250 కోట్లు 
హ్యాపీ వండర్‌లాండ్‌ రిసార్ట్స్‌ ఎంవోయూ రూ.250 కోట్లు 
ఛాంపియన్స్‌ యాచ్‌ క్లబ్‌ ఎంవోయూ రూ.250 కోట్లు 
టెక్నోజెన్‌ ఎంవోయూ రూ. 250 కోట్లు 
పార్లె ఆగ్రో ఎంవోయూ రూ. 250 కోట్లు 
ఎకో అజైల్‌ రిసార్ట్ ఎంవోయూ రూ. 243 కోట్లు 
ఎల్జీ పాలిమర్స్‌ ఎంవోయూ రూ. 240 కోట్లు 
హైథియన్‌ హ్యాయన్‌ మిషనరీ ఎంవోయూ రూ. 230 కోట్లు 
గోకుల్‌ ఆగ్రో ఎంవోయూ రూ. 230 కోట్లు 

రెండో రోజు జరిగిన ఎంవోయూ ఇవే

రెండో రోజు జరిగిన ఎంవోయూ వివరాలు 
ఎకో స్టీల్‌ ఎంవోయూ- రూ. 894కోట్లు 
బ్లూస్టార్‌  ఎంవోయూ- రూ. 890 కోట్లు 
 ఎస్‌ 2పీ సోలార్‌ సిస్టమ్స్‌ ఎంవోయూ- రూ. 850 కోట్లు  
 గ్రీన్‌లామ్‌ సౌత్‌ లిమిటెడ్‌ ఎంవోయూ- రూ. 800 కేట్లు 
ఎక్స్‌ప్రెస్‌ వెల్‌ రీసోర్సెస్‌  ఎంవోయూ- రూ. 800 కోట్లు 
రామ్‌కో  ఎంవోయూ- రూ. 750కోట్లు
క్రిబ్రో గ్రీన్‌  ఎంవోయూ- రూ. 725 కోట్లు 
ప్రకాశ్‌ ఫెరోస్‌  ఎంవోయూ- రూ. 723 కోట్లు 
ప్రతిష్ట బిజినెస్‌  ఎంవోయూ- రూ. 700కోట్లు 
తాజ్‌ గ్రూప్‌  ఎంవోయూ- రూ. 700 కోట్లు 
కింబర్లీ క్లార్క్‌  ఎంవోయూ- రూ. 700 కోట్లు 
అలియన్స్ టైర్‌ గ్రూప్‌  ఎంవోయూ- రూ. 679 కోట్లు 

గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌లో ఎంవోయూలపై సంతకాలు చేస్తున్న పారిశ్రామికవేత్తలు

గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌ రెండో రోజు ప్రారంభమైంది. నేడు 1.15 లక్షల కోట్ల విలువైన 248 ఒప్పందాలు జరగనున్నాయి. ఎంవోయూలపై కంపెనీలు ప్రభుత్వాధికారులు సంతకాలు చేయనున్నారు. సదస్సు వద్ద మాట్లాడిన మంత్రి అమర్‌నాథ్‌... సీఎం వైఎస్‌ జగన్ క్రెడిబిలిటీ ఉన్న నాయకుడని అన్నారు. అందుకే పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు వస్తున్నారని అన్నారు.  ఇప్పుడు వస్తున్న వన్నీ రియలిస్టిక్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ అని చెప్పారు. మూడేళ్లలో 89 శాతం ఎంవోయూలు వాస్తరూపంలోకి వస్తాయన్నారు. 

జే ఫర్ జగన్.. జే ఫర్ జోష్: దాల్మియా గ్రూప్ ఎండీ పునీత్ దాల్మియా

జే ఫర్ జగన్.. జే ఫర్ జోష్: దాల్మియా గ్రూప్ ఎండీ పునీత్ దాల్మియా
"సుమారు 15 ఏళ్ల క్రితం సీఎం జగన్ తండ్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలోనే ఏపీతో మా అనుబంధం ప్రారంభమైంది. మేము కడప జిల్లాలో 1000 కోట్ల పెట్టుబడితో సిమెంట్ ప్లాంట్‌ను స్థాపించాము. ప్రభుత్వం నుంచి ఇక్కడ మాకు అన్ని రకాలుగా లభించిన సహకారానికి మేము సంతోషంగా ఉన్నాము.. మరియు మౌలిక సౌకర్యాల విషయంలో ఈ రాష్ట్రం అభివృద్ధి చెందడాన్ని మేము గమనించాం." అని దాల్మియా భారత్ ఎండీ పునీత్ దాల్మియా పేర్కొన్నారు. అదేవిధంగా సీఎం జగన్ ను ఉద్దేశిస్తూ, జే అంటే జగన్.. జే అంటే జోష్ అంటూ దాల్మియా కొనియాడారు.

5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారత్ - ఏపీ కీలకమన్న నితిన్ గడ్కరీ

5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారత్ సాగిస్తున్న పయనంలో ఆంధ్రప్రదేశ్ కీలకమని కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. 975 కిలోమీటర్ల పొడవైన సుదీర్ఘ తీర రేఖ ఉన్న ఏపీ, భారత గ్రోత్ స్టోరీలో పాలుపంచుకుంటోందన్నారు. తీరం వెంబడి ఆరు పోర్టులు కలిగి.. మరో నాలుగు నిర్మాణంలో ఉన్న రాష్ట్రం దేశ లాజిస్టిక్ రంగంలో ఎక్కువ భాగాన్ని కలిగి ఉందన్నారు. విశాఖలో ఏపీ ప్రభుత్వం నిర్వహిస్తున్న గ్లోబల్ ఇన్సస్టర్ సమ్మింట్  రాష్ట్రంలోని పోర్టులన్నింటినీ నాలుగు లేన్ల జాతీయ రహదారులతో అనుసంధానం చేయనున్నట్లు గడ్కరీ ప్  భారతదేశ అభివృద్ధి పథంలో ఆంధ్రప్రదగేశ్ కీలకమని   రాష్ట్రంలోని పోర్టులన్నింటినీ నాలుగు లేన్ల జాతీయ రహదారులతో అనుసంధానం చేస్తామని ఆయన చెప్పారు. రాష్ట్రం గుండా వెళ్లేలా 5 గ్రీన్ ఫీల్డ్ జాతీయ  రహదారులను నిర్మిస్తున్నారమని, దీనికోసం 30వేల కోట్లను ఖర్చు చేయనున్నామని చెప్పారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై ప్రత్యేక దృష్టి పెట్టామని అందులో భాగంగానే ఈ ఈ తొమ్మిదేళ్లలో 4200కిలోమీటర్లు ఉన్న జాతీయ రహదారులను 8700కు పెంచామని చెప్పారు.

Naveen Jindal Speech: భవిష్యత్తులో ఏపీని గొప్ప పారిశ్రామిక కేంద్రంగా చూస్తాము: నవీన్ జిందాల్

"గత అనేక సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్‌తో మాకు ఉన్న సానుకూల అనుభవాన్ని పంచుకోవడానికి మేము సంతోషిస్తున్నాము. మేము భవిష్యత్తులో ఏపీని గొప్ప పారిశ్రామిక కేంద్రంగా చూస్తాము. ఏపీలోని అద్భుతమైన మౌలిక సదుపాయాలు, నైపుణ్యం కలిగిన యువత, అద్భుతమైన వ్యాపార అనుకూల వాతావరణం కలిగి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం దాని దూరదృష్టితో కూడిన నాయకత్వం, ప్రభుత్వ విధానాలకు మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం" అని నవీన్ జిందాల్ వెల్లడించారు.

CM Jagan on AP Capital: ఏపీ రాజధాని విశాఖపట్నమే, నేనూ షిఫ్ట్ అవుతా - మరోసారి సదస్సులో సీఎం ప్రకటన

విశాఖపట్నం రాజధాని అని మరోసారి సీఎం జగన్ ప్రకటన చేశారు. ఆ నగరంలో జరుగుతున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2023లో మాట్లాడుతున్న సందర్భంగా ఈ ప్రకటన చేశారు. త్వరలోనే విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కాబోతోందని చెప్పారు. తాను కూడా త్వరలోనే విశాఖపట్నానికి మారతానని చెప్పారు.

CM Jagan Speech: ఏపీకి రూ.13 లక్షల కోట్ల పెట్టుబడులు - సీఎం జగన్

ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు 348 పెట్టుబడి ప్రతిపాదనలు వచ్చాయని, వాటి విలువ రూ.13 లక్షల కోట్లు అని సీఎం జగన్ అన్నారు. దీనివల్ల 6 లక్షల మందికి ఉపాధి కలుగుతుందని చెప్పారు. ఆంధ్రాలో పరిశ్రమలు నెలకొల్పేందుకు అపారమైన భూములు అందుబాటులో ఉన్నాయని సీఎం జగన్ అన్నారు. పెట్టుబడులు పెట్టేందుకు ఎలాంటి ముప్పు లేని వాతావరణం ఏపీలో ఉందని చెప్పారు. ఎంటర్ ప్రైసెస్, స్కిల్ డెవలప్ పెంట్, పునరుత్పాదక ఇంధనంకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెప్పారు.

Mukhesh Ambani Speech: ముఖేష్ అంబానీ ఏం మాట్లాడారంటే..

విశాఖ పెట్టుబడిదారుల సదస్సులో ముఖేష్ అంబానీ మాట్లాడారు. ఈ సదస్సులో భాగం అయినందుకు సంతోషంగా ఉందని అన్నారు. ఏపీకి రిలయన్స్ ఎంతో ప్రాధాన్యం ఇస్తోందని అన్నారు. కొన్ని రంగాల్లో ఏపీ మొదటి స్థానానికి చేరుకుంటోందని అన్నారు. కొన్ని రంగాల్లో ఏపీలో వనరులు పుష్కలంగా ఉన్నాయని చెప్పారు. అంతేకాక, అంతర్జాతీయ స్థాయి నిపుణులు ఏపీ నుంచే వచ్చారని చెప్పారు. నవ భారతదేశ నిర్మాణంలో ఏపీ పాత్ర చాలా కీలకం కాబోతోందని చెప్పారు.

Jindal Steel: ఏపీలో రూ.10వేల కోట్లు పెట్టుబడులు పెడుతున్నాం - నవీన్ జిందాల్

జిందాల్ స్టీల్ ఛైర్మన్ నవీన్ జిందాల్ మాట్లాడుతూ.. ఏపీలో తాము రూ.10 వేల కోట్ల పెట్టుబడులు పెడుతున్నట్లుగా ప్రకటించారు. తద్వారా 10 వేల మందికి ఉపాధి దొరుకుతుందని చెప్పారు. మౌలిక వసతులు కూడా అద్భుతంగా ఉన్నాయని కొనియాడారు. 

Global Investors Summit: సదస్సులో మాట్లాడుతున్న ప్రముఖ పారిశ్రామిక వేత్తలు

గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో పారిశ్రామిక వేత్తలు మాట్లాడుతున్నారు. మంత్రుల ప్రసంగం అనంతరం, నాఫ్ సీఈవో సుమ్మిత్ బిదానీ, అపోలో హాస్పిటల్స్ వైస్ ఛైర్ పర్సన్ ప్రీతారెడ్డి, శ్రీసిమెంట్ ఛైర్మన్ హరిమోహన్, కియా ప్రతినిధి కబ్ డోంగ్‌లీ, టోరే ఇండస్ట్రీస్ ఎండీ మసహిరో యమగూచి, టెస్లా కో ఫౌండర్ మార్టిన్ ఎబర్ హార్డ్, జీఎంఆర్ గ్రూప్ ఛైర్మన్ గ్రంథి మల్లికార్జున రావు, సయాంట్ ఛైర్మన్ బీవీఆర్ మోహన్ రెడ్డి, భారత్ బయోటెక్ ఛైర్మన్ క్రిష్ణ ఎల్లా తదితరులు మాట్లాడారు.

Buggana Rajendranath Reddy: పునరుత్పాదక ఇంధన రంగంలో పెట్టుబడులకు మంచి అవకాశాలు - బుగ్గన

ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి మాట్లాడుతూ.. పలు రంగాల్లో లాజిస్టిక్స్‌ అద్భుతంగా ఉన్నాయని అన్నారు. నైపుణ్యం కలిగిన మానవ వనరులకు ఏపీలో కొదవ లేదని చెప్పారు. పునరుత్పాదక ఇంధన రంగంలో పెట్టుబడులకు మంచి అవకాశాలున్నాయని, బిజినెస్‌ ఇండస్ట్రీపై సీఎం జగన్‌ మంచి దార్శనికతతో ఉన్నారని అన్నారు. ఐటీ, ఐటీ ఆధారిత పరిశ్రమలకు మంచి వాతావరణం ఉందని అన్నారు. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో ఏపీ తొలి స్థానంలో ఉందని అన్నారు.

Gudivada Amarnath: వేగంగా ఏపీలో మౌలిక సదుపాయాల కల్పన - మంత్రి గుడివాడ

సదస్సు ప్రారంభం సందర్భంగా మంత్రి గుడివాడ అమర్ నాథ్ ప్రసంగించారు. రాష్ట్రంలో పారిశ్రామికంగా పుష్కలమైన అవకాశాలు ఉన్నాయని అన్నారు. ఏపీలో మౌలిక సదుపాయాల కల్పన వేగంగా జరుగుతోందని, సంక్షేమం, డెవలప్ మెంట్ కు అధిక ప్రాధాన్యం ఇస్తూ సీఎం జగన్ పాలన సాగిస్తున్నారని కొనియాడారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వం ముందుందని ప్రసంగించారు.

Global Investors Summit Starts: గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సు ప్రారంభం

గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సు ప్రారంభం అయింది. ఈ సందర్భంగా రాష్ట్ర గీతం అయిన ‘మా తెలుగు తల్లికి మల్లెపువ్వు దండ..’ గీతాన్ని ఆలపించారు. వేదికపై సీఎం జగన్, ముఖేష్ అంబానీతో పాటు ప్రముఖ పారిశ్రామిక వేత్తలు ఉన్నారు. 

CM Jagan: సదస్సుకు బయలుదేరిన సీఎం జగన్

  • గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌ – 2023కు హాజరయ్యేందుకు ఆంధ్రా యూనివర్సిటీ గ్రౌండ్స్‌ ప్రాంగణానికి బయలుదేరిన సీఎం వైఎస్‌ జగన్‌

  • సీఎం జగన్‌కు దారిపొడవునా ఆత్మీయ స్వాగతం పలికిన విశాఖవాసులు

Vizag Summit: విశాఖపట్నం చేరుకున్న ముఖేష్ అంబానీ

విశాఖపట్నంలో మరికొద్దిసేపట్లో ప్రారంభం కాబోతున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సు కోసం రిలయన్స్ సంస్థ అధినేత ముఖేష్ అంబానీ విశాఖపట్నం చేరుకున్నారు. ఆయన వెంట 15 మంది బోర్డు డైరెక్టర్లు, వైస్ ప్రెసిడెంట్లు కూడా ఉన్నారు. అంబానీకి విశాఖపట్నం ఇంఛార్జి మంత్రి విడదల రజిని స్వాగతం పలికారు. ఆమెతో పాటు ఎంపీలు విజయసాయిరెడ్డి కూడా ఉన్నారు. ఆయన కోసం ఉన్న ప్రత్యేక కాన్వాయ్‌లో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సుకు ముఖేష్ అంబానీ వెళ్లనున్నారు.

Background

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గ్లోబల్ సమ్మిట్‌లో ఇవాళ ఎంవోయూలు జరగనున్నాయి. ఉదయం 9 గంటల నుంచి ఈ ప్రక్రియ ప్రారంభం కానుంది. పదిన్నరకు ప్రముఖ ఇండో అమెరికన్ మ్యుజీషియన్ కర్ష్‌కాలే బ్యాండ్‌ ప్రదర్శన ఉంటుంది. అనంతరం ఏపీ సీఎస్‌ జవహార్‌ రెడ్డి ప్రసంగిస్తారు. అనంతరం రాష్ట్రంలో ఉన్న వనరుల గురించి పరిశ్రమల మంత్రి అమర్‌నాథ్‌రెడ్డి స్పీచ్ ఉంటుంది. ఆ తర్వాత నోవా ఎయిర్‌ సీఈవో అండ్‌ ఎండీ గజాసన్‌ నాబర్‌, అవాడ గ్రూప్‌ ఛైర్మన్‌ వినీత్‌ మిట్టల్, లారస్ ల్యాబ్స్‌ ఫౌండర్‌ అండ్ సీఈవో సత్యనారాయణ చావ, హెటిరో గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీస్‌ ఎండీ డాక్టర్‌ వంశీ కృష్ణ బండి, గ్రీన్‌కో చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ అండ్‌ ఎండీ అనీల్‌ కుమార్‌ చలమశెట్టి, సెయింట్‌ గోబిన్ ఆసియా-పసిఫిక్ అండ్‌ ఇండియా సీఈవో సంతానం మాట్లాడనున్నారు. 


రాష్ట్రవైద్యఆరోగ్య శాఖ మంత్రి విడదల రజనీ, అపాజీ అండ్‌ హిల్‌టాప్ గ్రూప్‌ డైరెక్ట్ అండ్‌ గ్రూప్‌ హెడ్‌ ఇండియా ఆపరేషన్స్‌ సర్జియో లీ, బ్లెండ్‌ హబ్ ఫౌండర్ హెన్‌రిక్‌ స్టామ్‌ క్రిస్టెన్‌ సన్‌, వెల్‌స్పన్ గ్రూప్ ఎండీ రాజేష్‌ మండవేవాలా, వెల్‌స్పన్‌ గ్రూప్‌ ఎండీ సతీష్‌ రెడ్డి, భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్ లిమిటెడ్‌ ఎండీ, ససీఐఐ సదరన్‌ రీజియన్ చైర్‌పర్శన్ సుచిత్ర కె. ఎల్లా  ప్రసంగిస్తారు. 


ఇవాళ్టి సభలో కేంద్ర  పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి పాల్గొంటారు. ఆయన కూడా ప్రసగించనున్నారు. ఆయనతోపాటు కేంద్ర పోర్టులు, షిప్పింగ్ శాఖ మంత్రి సర్బానంద్‌ సోనావాల్ కూడా సమ్మిట్‌కు హాజరై ప్రసగిస్తారు.  సాయంత్రానికి సీఎం జగన్ ముగింపు ఉపన్యాసం చేస్తారు. 
ఈ ప్రసంగాలతోపాటు ఉదయం 9 గంటల నుంచి వివిధ అంశాలపై చర్చలు ఉంటాయి. ఇవాళ 8 అంశాలపై సెషన్లు ఉంటాయి. ఉదయం 9గంటలకు ఆడిటోరియం 1లో పెట్రోడెవలప్‌మెంట్‌ అండ్ పెట్రో కెమికల్స్‌పై చర్చ ఉంటుంది. ఆడిటోరియం రెండులో హయ్యర్‌ ఎడ్యుకేషన్, మూడులో స్కిల్‌ డెవలప్‌మెంట్‌, నాలుగులో వియత్నాం  కంట్రీ సెషన్‌ ఉంటుంది. పది గంటలకు ఆడిటోరియం 1లో టూరిజం అండ్‌ హాస్పిటాలిటీ, రెండులో టెక్స్‌టైల్స్‌ అండ్‌ అపరెల్స్‌ మూడులో ఫార్మాస్యూటికల్స్ అండ్‌ లైఫ్‌ సైన్సెస్‌, నాలుగులో వెస్టర్న్ ఆస్ట్రేలియా కంట్రీ సెషన్ నిర్వహిస్తారు. 


మొదటి రోజు తొమ్మిది అంశాలపై సెమినార్లు జరిగాయి. రెన్యువబుల్ ఎనర్జీ అండ్ గ్రీన్ హైడ్రోజన్, ఆరోగ్య భద్రత వైద్య పరికారాలు, ఏరోస్పేస్‌ అండ్‌ ఢిఫెన్స్‌, ఐటీ, ఆటోమేటివ్‌ ఎలక్ట్రిక్‌ మొబిలిటీ, ఎలక్ట్రానిక్స్‌, ఇండస్ట్రీయల్ అండ్ లాజిస్టిక్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, స్టార్టప్‌ ఇన్నోవేషన్, అగ్రికల్చర్‌ అండ్‌ ఫుడ్‌ ప్రోసెసింగ్‌ రంగాల్లో సెషన్లు జరిగాయి. ఈ సెషన్లలో పాల్గొన్న అధికారులు రాష్ట్రంలో ఉన్న వనరులు, అనుకూల అంశాలను వచ్చిన గెస్ట్‌లకు వివరించారు. 


విశాఖలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌ మొదటి రోజు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పాల్గొన్నారు. ఈ సదస్సులో ఆయన మాట్లాడుతూ... 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారత్ సాగిస్తున్న పయనంలో ఏపీ కీలకమని  కేంద్ర నితిన్ గడ్కరీ తెలిపారు. 975 కిలోమీటర్ల పొడవైన సుదీర్ఘ తీర ప్రాంతం ఉన్న ఆంధ్రప్రదేశ్, భారత గ్రోత్ స్టోరీలో భాగస్వామ్యం అవుతుందన్నారు. తీరం వెంబడి ఆరు పోర్టులు కలిగి, మరో నాలుగు నిర్మాణంలో ఉన్న ఏపీ... దేశ లాజిస్టిక్ రంగంలో కీలక భాగస్వామ్యం కలిగి ఉందన్నారు. రాష్ట్రంలోని పోర్టులన్నింటినీ నాలుగు లేన్ల జాతీయ రహదారులతో అనుసంధానం చేయనున్నట్లు గడ్కరీ తెలిపారు. దేశ అభివృద్ధి పథంలో ఆంధ్రప్రదేశ్ కీలకమని   రాష్ట్రంలోని పోర్టులన్నింటినీ నాలుగు లేన్ల జాతీయ రహదారులతో అనుసంధానం చేస్తామని ఆయన చెప్పారు. రాష్ట్రం నుంచి వెళ్లేలా 5 గ్రీన్ ఫీల్డ్ జాతీయ  రహదారులను నిర్మిస్తున్నామని, దీనికోసం రూ.30 వేల కోట్లు ఖర్చు చేయనున్నామని చెప్పారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై ప్రత్యేక దృష్టి పెట్టామని అందులో భాగంగానే ఈ తొమ్మిదేళ్లలో 4200 కిలోమీటర్లు ఉన్న జాతీయ రహదారులను 8700 కిలోమీటర్లకు పెంచామని చెప్పారు. 

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.