CM Jagan Vizag Visit: ఏపీ సీఎం జగన్ నేడు (మే 11) విశాఖపట్నంలో పర్యటించారు. బీచ్ రోడ్డులో వీఎంఆర్డీఏ అభివృద్ధి చేసిన సీ హ్యారియర్ మ్యూజియాన్ని ప్రారంభించారు. అనంతరం ఆరిలోవలోని అపోలో ఆస్పత్రిలో క్యాన్సర్ సెంటన్ ప్రారంభించారు. కాసేపు అక్కడి సిబ్బందితో మాట్లాడారు. వాళ్ల విజ్ఞప్తి మేరకు గ్రూప్ ఫొటో దిగారు. అనంతరం క్యాన్సర్ యూనిట్ లోని రేడియేషన్ ఎక్విప్ మెంట్ ను పరిశీలించారు. ఆ తర్వాత వైఎస్సాఆర్ క్రికెట్ స్టేడియంలో ఆంధ్ర ప్రీమియర్ లీగ్ సీజన్ -2 ను ప్రారంభించారు.


ఈ సందర్భంగా రంజీ ప్లేయర్స్ తో ముచ్చటించారు. క్రీడల్లో మరింత రాణించాలని సీఎం జగన్ ఈ సందర్భంగా ఆకాంక్షించారు. పీఎం పాలెం (పోతుల మల్లయ్య పాలెం)లోని వైఎస్సార్ క్రికెట్ స్టేడియానికి చేరుకున్న ముఖ్యమంత్రి.. అక్కడ మహిళా క్రికెటర్లు సబనామ్, అంజలినీ ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం ఏపీఎల్ సీజన్ -2 ను ముఖ్యమంత్రి ప్రారంభించారు. వైఎస్సార్ స్టేడియంలో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ సందర్శించి, తర్వాత ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సభ్యులతో గ్రూప్ ఫోటో దిగారు. అక్కడ ఏర్పాటు చేసిన దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్సర్ విగ్రహాన్ని రెడ్డి ఆవిష్కరించారు.


విశాఖపట్నానికి చేరుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. ఎయిర్ పోర్టులో ఘన స్వాగతం పలికారు. నగర మేయర్ హరివెంకటకుమారితో పాటు మంత్రి అమర్నాథ్, విప్ కరణం ధర్మశ్రీ, ఎంపీ ఎంవీవీ సత్య నారాయణ తదితరులు.. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి ఆత్మీయ ఆహ్వానం పలికిన వాళ్లలో ఉన్నారు. పాలనా రాజధానిలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటుపలు శంకుస్థాపనల కోసం సీఎం వైెస్ జగన్ వచ్చారు. తాడేపల్లి నుండి గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకుని.. అక్కడి నుండి విశాఖకు విమానంలో వెళ్లారు. నగరంలో వరుసగా పలు కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. బీచ్ రోడ్డులో వీఎంఆర్డీఏ అభివృద్ధి చేసిన సీ హ్యారియర్ యుద్ధ విమాన మ్యూజియం ప్రారంభించారు. రామ్ నగర్ లోని వీఎంఆర్డీఏ కాంప్లెక్స్ తో పాటు ఎంవీపీలోని ఇండోర్స్ స్పోర్ట్స్ ఎరీనాను ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు. అలాగే ఎండాడలోని కాపు భవన్ కు శంకుస్థాపన చేశారు సీఎం. భీమిలిలో ఫిష్ ల్యాండింగ్ కేంద్రానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శంకుస్థాపన చేశారు.