ఆంధ్రప్రదేశ్‌లో దేవాదాయశాఖలో 60 ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్(ఈవో) గ్రేడ్-3 పోస్టుల భర్తీకి సంబంధించి తుది ఫలితాలు విడుదలయ్యాయి. మొత్తం 59 మంది ఉద్యోగాలకు ఎంపికైనట్లు ఏపీపీఎస్సీ ఒక ప్రకటనలో తెలిపింది. అయితే కర్నూలు జిల్లాకు సంబంధించి సరైన అర్హతలు లేని కారణంగా ఒక పోస్టును భర్తీచేయలేదు. జిల్లాలవారీగా ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల రిజిస్ట్రేషన్ వివరాలను ఏపీపీఎస్సీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు.
రాష్ట్రవ్యాప్తంగా ఫిబ్రవరి 17న సీబీటీ విధానంలో ప్రధాన పరీక్షను నిర్వహించిన విషయం తెలిసిందే. మెయిన్స్‌లో అర్హత సాధించిన అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన ఏప్రిల్ 26, మే 8 తేదీల్లో విజయవాడలోని ఏపీపీఎస్సీ కార్యాలయంలో నిర్వహించారు. అనంతరం తుది ఫలితాలను ప్రకటించారు.
జిల్లాలవారీగా ఎంపికైన అభ్యర్థులు..
శ్రీకాకుళం-04, విజయనగరం-04, విశాఖపట్టణం-04, తూర్పుగోదావరి-08, పశ్చిమగోదావరి-07, క్రిష్ణా-06, గుంటూరు-07, ప్రకాశం-06, నెల్లూరు-04, చిత్తూరు-01, అనంతపురం-02, కర్నూలు-05, కడప-01
తుది ఫలితాల కోసం క్లిక్ చేయండి..
Also Read:
టీఎస్‌పీఎస్సీ లైబ్రేరియన్ పోస్టుల పరీక్ష హాల్‌టికెట్లు వచ్చేశాయ్! షెడ్యూలు ప్రకారమే పరీక్ష!
తెలంగాణ ఇంటర్, సాంకేతిక విద్యాశాఖల్లో లైబ్రేరియన్ పోస్టుల భర్తీకి సంబంధించిన రాతపరీక్ష హాల్‌టికెట్లు అందుబాటులోకి వచ్చాయి. అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచారు. ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ టీఎస్‌పీఎస్సీ ఐడీ, పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి అధికారిక వెబ్‌సైట్ నుంచి హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం, మే 17న లైబ్రేరియన్ పోస్టుల రాతపరీక్ష నిర్వహించనున్నారు. అభ్యర్థులు పరీక్షకు 45 నిమిషాల ముందు వరకు వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అయితే చివరి నిమిషంలో సర్వర్ సమస్యలు తలెత్తే అవకాశాలుంటాయి. కాబట్టి, అభ్యర్థులు వీలైనంత త్వరగా తమ హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవాలి. అభ్యర్థులు ప్రాక్టీసు చేసేందుకు వెబ్‌సైట్‌లో మాక్ టెస్టు లింకు అందుబాటులో ఉంది.
హాల్‌టికెట్ల కోసం క్లిక్ చేయండి..
వెబ్‌సైట్‌లో అగ్రికల్చర్ ఆఫీసర్ హాల్‌టికెట్లు! పరీక్ష ఎప్పుడంటే?
తెలంగాణలో అగ్రికల్చర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నిర్వహించనున్న రాతపరీక్ష హాల్‌టికెట్లు అందుబాటులోకి వచ్చాయి. టీఎస్‌పీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచారు. ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ టీఎస్‌పీఎస్సీ ఐడీ, పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి అధికారిక వెబ్‌సైట్ నుంచి హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మే 16న రెండు సెషన్లలో అగ్రికల్చర్ ఆఫీసర్ నియామక పరీక్ష ఆన్‌లైన్ విధానంలో జరగనుంది. అభ్యర్థులు పరీక్షకు 45 నిమిషాల ముందు వరకు వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. చివరి నిమిషంలో సర్వర్ సమస్యలు తలెత్తే అవకాశాలుంటాయి.. కాబట్టి, అభ్యర్థులు వీలైనంత త్వరగా తమ హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవాలి. అభ్యర్థులు ప్రాక్టీసు చేసేందుకు వెబ్‌సైట్‌లో మాక్ టెస్టు లింకు అందుబాటులో ఉంది.
హాల్‌టికెట్ల కోసం క్లిక్ చేయండి..
రిజర్వ్ బ్యాంకులో 291 ఆఫీసర్ గ్రేడ్-బి పోస్టులు, అర్హతలివే!
ముంబయిలోని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సర్వీస్ బోర్డు దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న ఆర్బీఐ శాఖల్లో ఆఫీసర్ గ్రేడ్-బి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 291 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ ఉత్తీర్ణులై ఉండాలి. రెండు దశల ఆన్‌లైన్ పరీక్షలు, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక విధానం ఉంటుంది. సరైన అర్హతలున్నవారు మే 9 నుంచి జూన్ 9 మధ్య ఆన్‌లైన్ ద్వారా తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..