Anakapalle News: అనకాపల్లి జిల్లా నక్కపల్లి పోలీస్ స్టేషన్ లో ఉద్రిక్తత నెలకొంది. అధికార పార్టీ వైసీపీలో రెండు వర్గాల మధ్య వర్గపోరు బయట పడింది. ఎమ్మెల్యే వర్గీయులు ఉదయం తమపై దాడి చేశారని మరో వర్గీయులు ఆరోపించారు. ఈ ఘటనపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినా.. పోలీసులు పట్టించుకోలేదంటూ దళితులు, వారి తరఫు ప్రజా ప్రతినిధులు ఆందోళన చేపట్టారు. ఉదయం 11:30 గంటలకు ఇచ్చిన ఫిర్యాదుపై ఇప్పటి వరకు స్పందించలేదంటూ దళితులు నక్కపల్లి పోలీస్ స్టేషన్ ఎదుట నిరసన చేశారు. ఇప్పటి వరకూ ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేయక పోవడంతో వీసం వర్గీయులు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేసు నమోదు చేసి ఎఫ్.ఐ.ఆర్. కాపీ ఇవ్వాలంటూ నక్కపల్లి స్టేషన్ ముందే దళితులంతా బైఠాయించారు. ఎంపీపీ అయిన ఓ దళిత మహిళ పసిబిడ్డతో పోలీస్ స్టేషన్ కు వచ్చి తమకు న్యాయం చేయాలంటూ కోరింది.


ఇటీవల గుంటూరులో వైసీపీ, టీడీపీ నేతల మధ్య వాగ్వాదం


గుంటూరు జిల్లా తెనాలి మున్సిపల్ కౌన్సిల్ సమావేశం ఉద్రిక్తతంగా మారింది. టీడీపీ కౌన్సిలర్ యుగంధర్ పై వైసీపీకి చెందిన  కౌన్సిలర్లు దాడి చేశారు. నవరత్నాల పథకంలో భాగంగా చేపట్టిన పనుల్లో సింగిల్ టెండర్ ఆమోదం అంశంపై టీడీపీ సభ్యుడు యుగంధర్  అభ్యంతరం తెలిపారు. తాము ప్రతిపాదించిన ఆంశాలపై వైసీపీ కౌన్సిలర్లు మాట్లాడకుండా కూర్చోమని వినాలని ఎదురుదాడికి దిగారని టీడీపీ కౌన్సిలర్లు ఆరోపిస్తున్నారు. టీడీపీ సభ్యుడు తనకు మాట్లాడే అవకాశం లేదా మీరు మాత్రమే మాట్లాడతారా మీరే కూర్చోండని  బదులిచ్చారు. దానితో వైసీపీ 33వార్డ్ కౌన్సిలర్ ఒక్కసారిగా టీడీపీ కౌన్సిలర్ల మీదకు దూసుకొచ్చారు. మిగతా కౌన్సిలర్లు  అడ్డుకున్న ఆగకుండా వెంటపడి  దాడి చేశారు. అనంతరం తమపై జరిగిన దాడికి నిరసగా పోడియం ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు టీడీపీ కౌన్సిలర్లు. దాడి అనంతరం కౌన్సిల్ సమావేశం నుంచి వైసీపీ కౌన్సిలర్లు వెళ్లిపోయారు. ఈ గొడవలో పలువురి కౌన్సిలర్ల చొక్కాలు కూడా చిరిగిపోయాయి. మున్సిపల్ ఛైర్ పర్సన్ గొడవ ఆపడానికి ప్రయత్నించినా ఎవరూ తగ్గలేదు. 


సమస్యలు చర్చించకుండా తన్నుకున్న సభ్యులు


తెనాలి మున్సిపల్‌ కౌన్సిల్ సమావేశంలో టీడీపీ, వైసీపీ కౌన్సిలర్లు వాగ్వాదానికి దిగారు. ఈ వాగ్వాదం ముదరడంతో వైసీపీ, టీడీపీకి చెందిన ఇరుపార్టీల కౌన్సిలర్ల ఒకరిపై ఒకరు దాడికి పాల్పడ్డారు. ఈ గొడవలో పలువురు కౌన్సిలర్లు చొక్కాలు చిరిగిపోయేలా కొట్టుకున్నారు. మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ ఈ గొడవను ఆపడానికి చాలా ప్రయత్నించినా లాభం లేకపోయింది. ఎంత వారించినా గొడవ సద్దుమణుగకపోవడంతో ఛైర్‌పర్సన్‌ సభను ముగించి అక్కడి నుంచి వెళ్లిపోయారు. మున్సిపాలిటీలోని సమస్యలపై చర్చించాల్సిన కౌన్సిలర్లు ఇలా సభలోనే కొట్టుకోవడంపై పలువురు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ గొడవకు దిగిన సభ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. కౌన్సిల్ లో సభ్యులు విచక్షణ మరిచి దాడికి పాల్పడిన ఘటనపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజాప్రతినిధులే ఇలా వ్యవహరిస్తుంటే ప్రజాసమస్యలు ఎలా పరిష్కారం అవుతాయని ప్రశ్నిస్తున్నారు. పార్టీల పేరుతో కొట్టుకోకుండా సమస్యపై దృష్టి పెట్టాలని కోరుతున్నారు.