Adari Kishore Kumar protest against the arrest of Chandrababu:
విశాఖపట్నం : ఏపీ మాజీ సీఎం చంద్రబాబు అరెస్టును వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నేతలు ఆందోళన చేశారు. పలు జిల్లాల్లో నేతల్ని అదుపులోకి తీసుకుని అనంతరం విడిచి పెట్టారు. తాజాగా మంగళవారం నాడు విశాఖ విమానాశ్రయంలో చంద్రబాబు అరెస్ట్ కు వ్యతిరేకిస్తూ నిరసనకు దిగిన టీడీపీ ఫాలోవర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రన్ వే పై పడుకుని సైతం నిరసన తెలిపారు. సేవ్ డెమోక్రసీ అనే ప్లకార్డును ప్రదర్శించారు యువనేత ఆడారి కిషోర్ కుమార్.
తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు అరెస్ట్ ను యువనేత, పార్టీ ఫాలోవర్ ఆడారి కిషోర్ ఖండించారు. సేవ్ డెమోక్రసీ అనే ప్లకార్డును విమానాశ్రయంలో ప్రదర్శించారు. విమానం ఎక్కిన తరువాత సైతం చంద్రబాబుకు మద్దతుగా ప్లకార్డు ప్రదర్శించి నిరసన తెలిపారు. రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ఈ అంశంలో కలుగ చేసుకుని న్యాయం చెయ్యాలని కోరారు. అయితే నిరసన తెలిపిన ఆడారి కిషోర్ ను విశాఖ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
మిషన్ కర్షక దేవోభవ అవగాహన సదస్సులు ముగించుకుని హైదరాబాద్ నుంచి మంగళవారం సాయంత్రం ఇండిగో విమానంలో విశాఖ వచ్చారు ఆడారి కిషోర్. అదే సమయంలో గవర్నర్ నజీర్ విశాఖ పర్యటన ముగించుకుని విజయవాడ వెళ్లేందుకు విమానాశ్రయానికి వస్తున్నారు. ఈ క్రమంలోనే టీడీపీ సానుభూతిపరుడు ఆడాది కిషోర్ కుమార్ సేవ్ డెమోక్రసీ అని నినాదాలు చేశారు. ఈ సంఘటనతో అలర్ట్ అయిన పోలీసులు వెంటనే ఆయనను అదుపులోకి తీసుకుని విమానాశ్రయ పోలీస్ స్టేషన్ కు తరలించారు.