Vizag Beach : విశాఖపట్నంలో రేపు (శుక్రవారం) బీచ్ క్లీనింగ్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు అధికారులు. ఈ కార్యక్రమంలో 25 వేల మంది వాలంటీర్లు  హాజరుకానున్నట్టు జిల్లా కలెక్టర్ మల్లిఖార్జున తెలిపారు.  ఇందుకోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. విశాఖ ఆర్కే బీచ్ సమీపంలోని కోస్టల్ బ్యాటరీ నుంచి భీమిలి బీచ్ వరకూ 40 పాయింట్లను రెడీ చేసిన జిల్లా యంత్రాంగం ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా వైజాగ్ లోని యువతకు పిలుపునిచ్చారు. ఇన్ని వేల మంది బీచ్ క్లీనింగ్ లో పాల్గొనడం ఎప్పుడూ జరగలేదని, ఇది ఒక రికార్డుగా నిలిచిపోతుందని  అధికారులు చెబుతున్నారు. శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకూ ఈ కార్యక్రమం జరగనుందని జిల్లా కలెక్టర్ మల్లిఖార్జున, జీవీఎంసీ కమిషనర్ లక్ష్మీ షా తెలిపారు. బీచ్ క్లీనింగ్ కార్యక్రమంలో పాల్గొనేవారందరూ అరగంట ముందు తాము ఎంచుకున్న పాయింట్ వద్దకు చేరుకోవాలని, మైనర్లకు అనుమతిలేదని కలెక్టర్ చెప్పారు. బీచ్ క్లీనింగ్ జరిగే 40 పాయింట్ల వద్ద మంచి నీరు ,మజ్జిగ పాకెట్లతో సహా మెడికల్ కిట్లు ఏర్పాటు చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎక్కడా ప్లాస్టిక్ పదార్థాలు వాడకూడదని అధికారులు తెలిపారు.  ప్రజలు, కాలేజీ విద్యార్థులు, వాలంటీర్లు, టూరిస్టులు స్వచ్ఛందంగా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని జిల్లా కలెక్టర్ పిలునిచ్చారు.  


సీఎం జగన్ పర్యటన  


ఏపీ సీఎం జగన్ రేపు విశాఖలో పర్యటించనున్నారు.  బీచ్ రోడ్ లోని ఏయూ  కన్వేషన్ సెంటర్ లో ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణపై అమెరికా సంస్థ పార్లే ఫర్ ది ఓషన్ తో ఎంవోయూ చేసుకోబోతుంది రాష్ట్ర ప్రభుత్వం. ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించి వాటిని రీసైక్లింగ్ చేసి వివిధ రకాల వస్తువులను ఈ సంస్థ తయారుచేస్తుంది.  అలాగే ఆంధ్ర యూనివర్సిటీలో మైక్రో సాఫ్ట్ సంస్థ ద్వారా ట్రైనింగ్ పూర్తి  చేసుకున్న 5 వేలమంది విద్యార్థులకు సర్టిఫికేట్ ల పంపిణీ కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొంటారు. ఈ సందర్భంగా సీఎంకు ఆహ్వానం పలుకుతూ ఏర్పాటు చేసే బ్యానర్లను క్లాత్ తో తయారు చేసినవే వాడాలని, ప్లాస్టిక్ బ్యానర్లకు స్వస్తి పలకాలని వైసీపీ నేతలు తెలిపారు. శుక్రవారం ఉదయం 9:50 గంటలకు విశాఖ చేరుకోనున్న సీఎం జగన్ మధ్యాహ్నం 12:40 వరకూ నగర పర్యటనలో ఉంటారు.  


సీఎం టూర్ షెడ్యూల్


రేపు సీఎం జగన్‌ విశాఖపట్నం జిల్లాలో పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ ఖ‌రారు అయ్యింది. సాగర తీరాన్ని పరిరక్షించేందుకు అమెరికాకు చెందిన స్వచ్చంద సంస్ధ పార్లే ఫర్‌ ది ఓషన్స్‌తో ఒప్పందం, గ్రాడ్యుయేట్లకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు దిగ్గజ మైక్రోసాఫ్ట్‌ సంస్ధ శిక్షణ ఇచ్చిన 5 వేల మందికి ధ్రువ పత్రాలను సీఎం చేతులు మీద‌గా అందించనున్నారు. శుక్రవారం ఉదయం 8.30 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరనున్న సీఎం, 9.50 గంటలకు విశాఖపట్నం చేరుకుంటారు. 10.20  నుంచి 11.13 గంటల వరకు ఏయూ కన్వెన్షన్‌ సెంటర్‌లో ఏపీ ప్రభుత్వం, పార్లే ఫర్‌ ది ఓషన్స్‌ మధ్య అవగాహనా ఒప్పందం, అనంతరం ముఖ్యమంత్రి ప్రసంగం, తర్వాత అక్కడి నుంచి బయల‌్దేరి సిరిపురం ఏయూ కాన్వొకేషన్‌ హాల్‌కు చేరుకోనున్నారు. 11.23 నుంచి  12.10 గంటల వరకు మైక్రోసాఫ్ట్‌ సంస్ధ శిక్షణ ఇచ్చిన విద్యార్ధులకు ధ్రువపత్రాలను అందిస్తారు. అక్క‌డే విద్యార్ధులతో ముఖాముఖి, అనంతరం సీఎం ప్రసంగం, కార్యక్రమం అనంతరం 12.40 గంటలకు విశాఖ నుంచి బయలుదేరి 1.55 గంటలకు తాడేపల్లి నివాసానికి సీఎం చేరుకుంటారు.


Also Read : CM Jagan: గతంలో దోచుకో, తినుకో, పంచుకో - తేడా గమనించండి: సీఎం జగన్


Also Read : Chandrababu: ఖబడ్దార్ మిస్టర్ జగన్ రెడ్డీ, రాష్ట్రమంతా తిరుగుబాటు చేస్తాం - ఇక్కడ్నించే నాంది: చంద్రబాబు