Visakhapatnam and Vijayawada Metro trains:  మెట్రో రైల్ ప్రాజెక్ట్ ను రానున్న మూడు సంవత్సరాల్లో పూర్తి చేస్తామని మున్సిపల్ వ్యవహారాల శాఖ మంత్రి పి. నారాయణ తెలిపారు. 2014 ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం విశాఖపట్టణం, విజయవాడలలో మెట్రో రైల్ ప్రాజెక్టులు చేపట్టాల్సి ఉందన్నారు. ఫీజుబులిటీ రిపోర్టు స్టడీ చేయడానికి ఆరు నెలలు సమయం పట్టిందన్నారు. కేంద్రం అనుమతించిన మేరకు మెట్రో రైల్ నిర్మాణం చేపట్టడం జరిగిందన్నారు.

Continues below advertisement


విశాఖపట్టణంలో మెట్రో రైల్ కు టెండర్లు ఇవ్వడం జరిగిందని, నేడో, రేపో విజయవాడ మెట్రోకు టెండర్లు పిలవటం జరుగుతుందని నారాయణ తెలిపారు.   కేంద్రం మెట్రో రైల్ నిర్మాణానికి పాలసీ మార్చిందని మారిన పాలసీ ప్రకారం మెట్రో నిర్మాణం చేపట్టాల్సి ఉందన్నారు. అందుకనుగుణంగా నిన్న జరిగిన కేబినెట్ భేటీలో మెట్రో రైల్ నిర్మాణాలకు అనుమతులు ఇవ్వడం జరిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తమ వాటాగా 20 శాతం, కేంద్రం వాటాగా 20, మిగతాది కేంద్రం అనుమతితో సాప్ట్ లోన్ ను 30 సంవత్సరాల కాలపరిమితితో తక్కువ వడ్డీ రేటుకు అంతర్జాతీయ సంస్థల నుంచి కేంద్రం అందించడం జరుగుతుందన్నారు. గత ప్రభుత్వం పీజుబులిటీ చేపట్టి మెట్రో రైల్ నిర్మాణాన్ని చేపట్టకుండా పక్కన పడేసిందన్నారు. మా ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఈ ప్రాజెక్టును చేపట్టడం జరుగుతుందన్నారు. మెట్రో రైళ్ల నిర్మాణాలను బెంగళూరు, హైద్రాబాద్, నాగపూర్ తదితర ప్రాంతాల్లో చేపట్టడం జరిగిందని నారాయణ తెలిపారు. 


జంక్షన్స్ వద్ద ట్రాఫిక్  కు ఏవిధమైన ఆటంకాలు  ఏర్పడకుండా మొదటి ఫ్లైఓవర్ పై ట్రాఫిక్ వాహనాలు, రెండో ఫైఓవర్ పై మెట్రో ట్రైన్ వెళ్లేలా నిర్మాణాలు ఉంటాయని దీనివల్ల వాహనాదారులకు ఏ విదమైన ట్రాఫిక్ అంతరాయాలు లేకుండా ప్రయాణించవచ్చని నారాయణ తెలిపారు.  విశాఖపట్టణం మెట్రో రైల్ నిర్మాణాలు విశాఖపట్టణం మహానగర అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో రెండు పేజీల్లో పనులు చేపట్టడం జరుగుతుందని మొదటి పేజ్ లో మొత్తం 46 కిమీ మెట్రో లైన్ నిర్మాణం 42 స్టేషన్లతో మొత్తం రూ. 11,490 కోట్ల అంచనాతో మూడు క్యారిడార్ల లో మెట్రో రైల్ నిర్మాణం. మొదటి కారిడార్ ను స్టీల్ ప్లాంట్ గేటు నుంచి కొమ్మాది జంక్షన్ వరకు 34.40 కిమీ మెట్రో లైను 29 స్టేషన్ల తో నిర్మాణం... రెండో కారిడార్ గురుద్వారా జంక్షన్ నుంచి ఓల్డ్ పోస్ట్ ఆఫీస్ వరకు 5.7 కిమీ మెట్రో లైను ఆరు స్టేషన్ల తో నిర్మాణం, కారిడార్ మూడు ను తాడిచెట్ల పాలెం నుంచి చినవాల్తేరు వరకు 6.75 కిమీ మెట్రో లైను 7 మెట్రో స్టేషన్లతో నిర్మాణాలు చేపట్టనున్నారు.


విజయవాడ మెట్రో ను రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (సీఆర్డీఏ) ఆధ్వర్యంలో మొదటి పేజ్ ను రూ. 10,118 కోట్ల అంచనా వ్యయంతో 32.40 కిమీ మేర నిర్మాణం. మొదటి కారిడార్ ను 25.9 కిమీ ను పండిట్ నెహ్రూ బస్టేషన్ నుంచి గన్నవరం ఎయిర్ పోర్టు వరకు రెండో కారిడార్ ను పండిట్ నెహ్రూ బస్టేషన్ నుంచి పెనమలూరు వరకు చేపట్టనున్నారన్నారు.  విశాఖ, విజయవాడ మెట్రో రైళ్ల నిర్మాణం, పర్యవేక్షణ, సాంకేతిక సహకారం  కోసం కన్సల్టెన్సీతో ఏపీ మెట్రో రైల్ కార్పొరేష‌న్ ఎండీ రామకృష్ణా రెడ్డి ల మధ్య అవగాహన ఒప్పందాన్ని మంత్రి నారాయణ సమక్షంలో ఒప్పందంపై సంతకాలు చేసిన ప్రతినిధులు. విజ‌య‌వాడ మెట్రో డిజైన్ లు, సాంకేతిక‌త‌, ప‌నుల ప‌ర్య‌వేక్ష‌ణ కు టిప్సాతో, విశాఖ కు శిస్ట్రా క‌న్స‌ల్టెన్సీల‌తో ఎంఓయూ కుదుర్చుకున్నామని తెలిపారు.