Nara Rohith's Sundarakanda Release Date Officially Announced: యంగ్ హీరో నారా రోహిత్ మరో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఆయన హీరోగా లేటెస్ట్ మూవీ 'సుందరకాండ' త్వరలోనే థియేటర్లలోకి రానుంది.
బర్త్ డే స్పెషల్
నారా రోహిత్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. ఆగస్ట్ 27న మూవీ రిలీజ్ కానుంది. నారా రోహిత్, అభినవ్ గోమటం, నరేష్ ఓ ఫన్ చర్చ ద్వారా విడుదల తేదీని అధికారికంగా ప్రకటించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమాకు వెంకటేష్ నిమ్మలపూడి దర్శకత్వం వహించగా... వ్రితి వాఘని హీరోయిన్‌గా నటిస్తున్నారు. సందీప్ పిక్చర్ ప్యాలెస్ బ్యానర్‌పై సంతోష్ చిన్నపొల్ల, గౌతమ్ రెడ్డి, రాకేష్ మహంకాళి నిర్మిస్తున్నారు.
ఫన్నీ వీడియో అదుర్స్
ఈ సందర్భంగా రిలీజ్ చేసిన వీడియోలో రోహిత్, అభినవ్ గోమటం, సీనియర్ యాక్టర్ నరేష్ నవ్వులు పూయించారు. 'ఏంటి అలా చూస్తున్నారు. ఏదైనా ఆర్డర్ ఇవ్వొచ్చు కదా' అని నారో రోహిత్ అనగా... 'అభినవ్, నరేష్ మేం ఆర్డర్ ఇవ్వడానికి రాలేదు. బర్త్ డే విషెష్ చెప్పడానికి వచ్చాం' అంటూ ఎక్స్‌ప్రెషన్స్‌తోనే నవ్వులు పూయించారు. 'సుందరకాండ' గురించి అంటూ రోహిత్ అనగా... వెంటనే నరేష్... రాఘవేంద్రరావు, వెంకీ అదరగొట్టారు అంటూ ఫన్ చేశారు.
'సినిమా తీసి దాచుకోవడం ఏంటి మమకారమా?' అంటూ నరేష్ ప్రశ్నించగా... 'మమకారం కాదు సార్. మంచి డేట్ కోసం వెతుకున్నాం.' అని రోహిత్ అంటారు. 'మూవీలో 5 క్వాలిటీస్ లాగే ఇక్కడ కూడా ఏమైనా స్పెసిఫికేషన్స్ ఉన్నాయేమో...' అంటూ నరేష్ అనగా రోహిత్ సిగ్గుపడుతుంటారు. ఇది వర్కౌట్ అవ్వదు పద అంటూ నరేష్ అభినవ్ వెళ్తుండగా... రోహిత్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు.
ఈ మూవీలో నారా రోహిత్ సిద్ధార్థ్ అనే సింగిల్ మ్యాన్ పాత్రలో కనిపించారు. ఓ యువకుడి పెళ్లి వయసు దాటిపోయినా ఇంకా పెళ్లి కాకపోవడం, 5 క్వాలిటీస్ ఉన్న సరైన పార్ట్‌నర్ కోసం ఎదురుచూడడం, అతనికి మ్యాచెస్ కోసం చూసి పేరెంట్స్ కూడా విసిగిపోవడం వంటి అంశాలతో ఈ స్టోరీ రానుంది.
Also Read: యాక్టింగ్‌కు గుడ్ బై చెప్తే క్యాబ్ డ్రైవర్ అవుతా - అసలు రీజన్ ఏంటో చెప్పిన పహాద్ ఫాజిల్