BIGG BOSS 9 Critical Test For Common People 40 Members: కింగ్ నాగార్జున హోస్ట్‌గా ఫేమస్ టీవీ రియాలిటీ షో 'బిగ్ బాస్' సీజన్ 9 అనౌన్స్‌మెంట్ వచ్చినప్పటి నుంచీ భారీ హైప్ క్రియేట్ అవుతోంది. టాప్ సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకూ ఒకటే ఆలోచన. ఈ కొత్త  సీజన్‌లో ఎవరు హౌస్‌లో కంటెస్టెంట్స్‌గా ఉండబోతున్నారు అనేదే. గతానికి భిన్నంగా ఈసారి సామాన్యులకు సైతం హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చేందుకు ఛాన్స్ ఇచ్చారు నిర్వాహకులు.

40 మందికి ఫైనల్ అగ్ని పరీక్ష

ఈ ఆఫర్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. వెబ్ సైట్‌లో రిజిస్టర్ అయ్యి 'బిగ్ బాస్‌లోకి ఎందుకు రావాలనుకుంటున్నారో?' అనే దానిపై ఓ వీడియో తీసి పంపించిన వారిలో ఫస్ట్ ఫేజ్‌లో 200 మందిని సెలక్ట్ చేశారు. ఎక్స్‌ప్రెషన్స్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇలా అన్నింటి ఆధారంగా వీడియోలు చూసి 100 మందిని ఎంపిక చేశారు. వీరందరినీ జల్లెడ పట్టి దాదాపు 40 మందిని ఫైనల్‌గా సెలక్ట్ చేశారు. ఈ విషయాన్ని తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో నాగార్జున వెల్లడించారు.

 

అసలేంటీ అగ్ని పరీక్ష

ఈ 40 మందిలోనే అసలైన పోటీ పెట్టనున్నారు. అందులో నెగ్గిన వారే హౌస్‌లో అడుగుపెట్టనున్నారు. ఫైనల్‌గా 3 నుంచి నలుగురిని ఎంపిక చేయనున్నట్లు తెలుస్తోంది. 'థాంక్యూ ఫర్ అవుట్ స్టాండింగ్ రెస్పాన్స్. ఎంతోమంది నుంచి 40 మందిని సెలక్ట్ చేశాం. ఇప్పుడు మొదలవుతుంది అసలైన పరీక్ష. అగ్ని పరీక్ష. దాన్ని దాటుకుని బిగ్ బాస్ హౌస్‌లోకి ఎవరు వెళ్తారో చూద్దాం.' అంటూ నాగార్జున ఓ ప్రోమో వీడియో రిలీజ్ చేశారు. దీంతో అగ్ని పరీక్షలో ఎలాంటి టాస్కులు ఇస్తారు? అనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. వచ్చే నెలలోపే సామాన్యుల ఎంపిక జరగనుండగా... సెప్టెంబర్ 7 నుంచి కొత్త సీజన్ ప్రారంభం కానుంది.

జియో హాట్ స్టార్‌లోనూ...

'బిగ్ బాస్' సీజన్ 9 షో స్టార్ మాలో ప్రసారం కానుండగా... ప్రముఖ ఓటీటీ 'జియో హాట్ స్టార్'లోనూ ఎపిసోడ్స్ స్ట్రీమింగ్ కానున్నాయి. ఈ విషయాన్ని ప్రోమో వీడియోలో స్పష్టం చేశారు.

Also Read: యాక్టింగ్‌కు గుడ్ బై చెప్తే క్యాబ్ డ్రైవర్ అవుతా - అసలు రీజన్ ఏంటో చెప్పిన పహాద్ ఫాజిల్

బుల్లితెర యాక్టర్స్, టీవీషోస్, సోషల్ మీడియాలో పాపులర్ సెలబ్రిటీస్, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్‌నే ఇప్పటివరకూ హౌస్‌లో కంటెస్టెంట్లుగా తీసుకునేవారు. కొత్త సీజన్‌లో డిఫరెంట్‌గా సామాన్యులకు అవకాశం ఇచ్చారు. ఫేమస్ టీవీ షోస్ కిర్రాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్, జాతిరత్నాలు షోతో ఫేమస్ అయిన వారిని ఈసారి కంటెస్టెంట్లుగా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఫోక్ సింగర్స్, టీవీ యాక్టర్స్‌కు కూడా ఛాన్స్ ఇవ్వనున్నట్లు సమాచారం.

కంటెస్టెంట్స్ వీళ్లేనా...

ఈసారి జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్, జబర్దస్త్ ఐశ్వర్య, బమ్ చిక్ బబ్లూ, రీతూ చౌదరి, సీరియల్ యాక్టర్స్ సాయికిరణ్, దేబ్జానీ, కావ్యశ్రీ పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. అలాగే, కన్నడ హీరోయిన్ కావ్యా శెట్టి పేరు కూడా బలంగా వినిపిస్తోంది. వీరితో పాటే అలేఖ్య చిట్టి పికెల్స్ ఫేం రమ్య, కల్పికా గణేష్, సుమంత్ అశ్విన్, ఆరే రాజ్, శ్రావణి వర్మ, తేజస్విని గౌడ, దీపికా, వర్ష, పరమేశ్వర్ హివ్రాలే, తెలంగాణ ఫోక్ డ్యాన్సర్ నాగదుర్గా దత్తా, ఫోక్ సింగర్ లక్ష్మి పేర్లు కూడా జాబితాలో ఉన్నాయనే టాక్ వినిపిస్తోంది. మరి కంటెస్టెంట్స్ లిస్ట్‌పై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.