పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం నారాయణపురం వాసి శివరాత్రి శివ వయసు 20 ఏళ్లు. లోన్‌ యాప్‌ ద్వారా 8వేల రూపాయలు తీసుకున్నాడు. పూర్తిగా చెల్లించినప్పటికీ యాప్‌ ఎగ్జిక్యూటివ్‌లు వేధింపులు మొదలు పెట్టారు. 20వేలు కట్టాలంటూ బెదిరింపులకు దిగారు. 


చెప్పిన టైంకు డబ్బులు కట్టలేదని శివ ఫోన్ కాంటాక్ట్‌లో ఉన్న వారందరికీ మెసేజ్‌లు పెట్టారు. అక్కడితో ఆగిపోకుందా నిత్యం ఫోన్లు చేసి వేధించడంస్టార్ట్ చేశారు. తెలిసిన వారందరికీ ఫోన్‌లు చేసి పరువు తీయడం ప్రారంభించారు. ఈ ఫోన్లు ఎక్కువయ్యేసరికి తట్టుకోలేకపోయాడు శివ. చివరకు రాత్రి సమయంలో ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. 


ఈ విషయం తెలుసుకున్న ఫ్యామిలీ మెంబర్స్‌ కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. లోన్ యాప్‌ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు  కూడా చేశారు. 


రాయల్ ఇన్సూరెన్స్ కంపెనీలో మూడు నెలల‌క్రితం 8 వేలు అప్పుగా తీసుకున్నాడు శివ. 20 వేలు చెల్లించాలని యువకుడిని వేధిస్తున్నారు. కట్ట‌లేక పోవడంతో అతని కాంటాక్ట్ నెంబర్లకు వాట్సాప్ లో‌ మెసేజ్ లు కాల్స్‌చేశారు. అవమానకరంగా భావించి తీవ్ర మనస్థాపంతో నిన్న రాత్రి ఇంటిలో ఎవ్వరు లేని సమయంలో ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు డిగ్రీ పూర్తి చేసి‌ ఖాళీగా ఉన్నాడు. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాడు.


రాజమండ్రిలో అనాథలైన చిన్నారులు


రాజమహేంద్రవరంలో దంపతులు ఆత్మహత్యకు కారణమయ్యాయి. అల్లూరి సీతారామరాజు జిల్లా రాజవొమ్మంగి చెందిన కొల్లి దుర్గాప్రసాద్‌ (32), రమ్యలక్ష్మి (24) దంపతులు రాజమహేంద్రవరంలోని శాంతినగర్‌లో నివసిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. దుర్గాప్రసాద్‌ జొమాటో డెలివరీ బాయ్‌ పనిచేస్తున్నారు. అతడి భార్య రమ్యలక్ష్మి మిషన్‌ కుట్టుకుంటూ జీవిస్తున్నారు.  


లోన్ యాప్ లో అప్పు 


ఇటీవల ఇంటి అవసరాల కోసం ఆన్ లైన్ లోన్ యాప్‌లో కొంత నగదు అప్పుగా తీసుకున్నారు. ఆ అప్పు సకాలంలో తీర్చకపోవడంతో  లోన్‌ యాప్‌కు సంబంధించిన టెలీకాలర్స్‌ ఫోన్ కాల్స్ చేసి వేధింపులు మొదలుపెట్టారు. అప్పు చెల్లించకపోతే భార్యభర్తల నగ్న చిత్రాలు ఆన్ లైన్ లో పెడతామని బెదిరించారు. దుర్గాప్రసాద్‌ బంధువులకు, స్నేహితులకు కాల్స్ చేసి తీసుకున్న విషయాన్ని చెప్పేవారు. ఈ ఘటనలతో పరువు పోయిందని భావించిన దంపతులు మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడ్డారు.  


భార్యభర్తలు ఆత్మహత్య 









చలించిపోయిన సీఎం జగన్ 


ఈ ఘటనపై ఏపీ ప్రభుత్వం స్పందించింది. వేధింపులకు పాల్పడుతున్న లోన్ యాప్ లపై కఠిన చర్యలు తీసుకోవాలని ఏపీ ప్రభుత్వం ఆదేశించింది. ఆర్బీఐ అనుమతి లేని యాప్ లపై చర్యలకు ఆదేశాలు ఇచ్చింది.  రాజమహేంద్రవరంలో దంపతులు ఆత్మహత్యకు పాల్పడిన ఘటనపై సీఎం జగన్ చలించిపోయారు. తల్లిదండ్రుల మృతితో అనాథలైన చిన్నారులు ఇద్దరికి చెరో రూ.5 లక్షల ఆర్థిక సాయం అందించాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. చిన్నారుల సంరక్షణకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ ను ఆదేశించారు.