విజయవాడలోని ఓ ఆస్పత్రిలో మధుమేహ వైద్య పరీక్షలు చేయించేందుకు వెళ్తూ ప్రమాదవాత్తు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు దంపతులు. ఈ ఘటనలో భార్య అక్కడికక్కడే మృతి చెందగా భర్మ ప్రాణాలతో బయటపడ్డాడు. అయితే ప్రమాదానికి ముందు తన భార్య అన్న మాటలను పదే పదే గుర్తుకు తెచ్చుకుంటూ ఆ భర్త కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నాడు. ఆ దృశ్యాన్ని చూసిన బంధువులంతూ కంటతడి పెడుతున్నారు.
వినాయకచవితికి ముందే వెళ్లాల్సి ఉండగా..
విజయవాడ జిల్లాలోని గణపవరానికి చెందిన భాస్కర్ రెడ్డి నర్సమ్మ ఆరోగ్య పరీక్షల కోసం బైక్‌పై ఇంటి నుంచి బయల్దేరారు. నర్సమ్మకు మధుమేహ సమస్యతో బాధపడుతోంది. ఈ క్రమంలోనే ఈమె విజయవాడలోని ఓ ఆస్పత్రిలో చూపించుకుంటోంది. నెలకు ఒకసారి అలా వెళ్లి వస్తూ ఉంటుంది. అయితే వినాయక చవితికి ముందే నర్సమ్మ పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి వెళ్లాల్సి ఉండగా.. పండుగ ఉందని, అది అయిపోయాక వెళ్దామని ఊరుకున్నారు. ఈ క్రమంలోనే ఈరోజు ఉదయమే భార్యాభర్తలిద్దరూ బండిపై విజయవాడలోని ఆస్పత్రికి బయల‌్దేరారు.
చక్రాల కింద పడి చనిపోయిన భార్య..
మరో ఐదు నిమిషాల్లో గమ్య స్థానానికి చేరుకుంటారనే లోపు రామరప్పాడు రింగు వద్ద ప్రధాన రోడ్డు దాటుతుండగా... వారి వాహనంపైకి లారీ దూసుకొచ్చింది. ఈ దుర్ఘటనలో నర్సమ్మ అక్కడికక్కడే మృతి చెందింది. భాస్కర్ రావుకు స్వల్ప గాయాలు అయ్యాయి. బండి పైనుంచి కింద పడగానే లేచి.. భార్య ఎక్కడుంది, ఏమైందో అని చూశాడు. అయితే అప్పటికే ఆమె వాహనం చక్రాల కింద విగతజీవిగా ఉండటాన్ని గమనించి ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. విషయం గుర్తించిన స్థానికులు వీరిని ఆస్పత్రికి తరలించారు. అనంతరం పటమట పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతేదాహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురికీ తరలించారు. కేసు నమోదు చేసుకున్నారు.
లారీ మీదకొస్తుందండీ అంటూ చివరి మాటలు..
నర్సమ్మ మృతి గురించి తెలుసుకున్న గ్రామస్థులు పెద్ద ఎత్తున విజయవాడలోని ఆస్పత్రికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం స్వగ్రామానికి తీసుకెళ్లారు. భాస్కర్ రెడ్డి గాయాల పాలవడంతో విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందారు. ఈ క్రమంలోనే తన భార్య చివరగా అన్న మాటలను తలుచుకొని కన్నీరుమున్నీరయ్యారు. బైకు వెనక కూర్చున్న భార్య ఎదురుగా వస్తున్న లారీని చూసి... లారీ మీదకొస్తుందండీ అంటూ చివరగా చెప్పిందని.. ఆమె అలా చెప్పిన కాసేపట్లోనే ప్రమాదం జరగడం ఆమె చనిపోవడం జరిగిపోయాయని భాస్కర్ రావు కన్నీటి పర్యంతం అయ్యారు. బస్సులో వెళ్దామని భార్య చెప్పినా తాను వినలేదని.. ఆస్పత్రిలో పరీక్షలకు ఆలస్యం అవుతుందని బండిపై వెళ్తే ప్రాణాలే పోయాయంటూ ఆయన ఏడ్చిన తీరు కంటతడి పెట్టిస్తోంది.