Sharmila Deeksha For AP Special Statues In Dlhi: ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి ప్రత్యేక హోదా హెడ్‌లైన్స్‌లో ఉంటోంది. ఇప్పుడు ప్రత్యేక హోదా వాదాన్ని ఆంధ్రప్రదేశ్‌ పీసీసీ చీఫ్‌ షర్మిల ఎత్తుకున్నారు. ఆమె బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి దీనిపై గళమెత్తుతున్నారు. అధికార ప్రతిపక్షం- వైఎస్‌ఆర్‌సీపీ, టీడీపీ ఈ విషయంలో ఎందుకు సైలెంట్‌గా ఉన్నారని ప్రశ్నిస్తున్నారు. బీజేపీతో కుమ్మక్కైన ఈ రెండు పార్టీలు రాష్ట్రానికి తీరని అన్యాయం చేస్తున్నారని విమర్సిస్తూ వస్తున్నారు. 


ఇప్పుడు ప్రత్యేక హోదా ఉద్యమాన్ని తీవ్ర స్థాయికి తీసుకెళ్లేందుకు షర్మిల సిద్ధమయ్యారు. ఢిల్లీ వేదికగా రాష్ట్ర ఆకాంక్షను వినిపించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. సాయంత్రం ఢిల్లీలోని ఏపీ భవన్‌ వద్ద దీక్ష చేపట్టనున్నారు. ఈ దీక్షలు కాంగ్రెస్ సీనియర్ నేతలు హాజరుకానున్నారు. 


ప్రత్యేకహోదా ఉద్యమాన్ని భుజానికి ఎత్తుకున్న షర్మిల.... పార్టీల మద్ధతు కూడగడుతున్నారు. వివిధ పార్టీల నాయకలతో మంతనాలు జరుపుతున్నారు. వారితో సమావేశమై తమ డిమాండ్‌ నెరవేరేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు సహకరించాలని కోరుతున్నారు. 


షర్మిల ఈ ఉదయం ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌తో సమావేశమయ్యారు. కేంద్రం ప్రభుత్వం ఏపీకి చేస్తున్న అన్యాయాన్ని వివరించారు. విభజన హామీలు నెరవేర్చకుండా దాటవేత ధోరణితో ఉందని తెలిపారు. దీనిపై పోరాడేందుకు సిద్ధమయ్యామని సహకరించాలని విజ్ఞప్తి చేశారు. 
శరద్‌ పవార్‌తో సమావేశం అనంతరం డీఎంకే ఎంపీ తిరుచి శివతో సమావేశమయ్యారు షర్మిల. ఏపీలో ఉన్న పరిస్థితులు తెలిపారు. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయని కేంద్రంపై చేస్తున్న పోరాటంలో మద్దతు ఇవ్వాలని అభ్యర్థించారు. వాళ్లతోనే కాకుండా సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరితో సమావేశం కానున్నరాు. 


మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఏపీ భవన్ వద్ద షర్మిల దీక్ష చేపట్టనున్నారు. దీక్ష అనంతరం సాయంత్ర  నాలుగు గంటలకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో సమావేశంకానున్నారు.