Andhra Pradesh: ఎలక్ట్రిక్ వాహనాల వినియోగంలో ఆంధ్రప్రదేశ్ దూసుకుపోతోంది. ఏపీ ఇప్పటివరకు 296 ఎలక్ట్రిక్ కార్లను, 100 ఎలక్ట్రిక్ బస్సులను ప్రధాన మార్గాల్లో నడుపుతోంది. అంతేకాకుండా 255 ఎలక్ట్రిక్ వెహికల్ (EV) ఛార్జింగ్ స్టేషన్‌లను ఏర్పాటు చేసింది.  EV వాహనాలను ప్రోత్సహిస్తూ మరో 90 స్టేషన్‌లను ఏర్పాటు చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది.  భవిష్యత్తులో ఛార్జింగ్ పాయింట్ల ఏర్పాటు కోసం రాష్ట్రం చాలా ప్రాంతాలను  కూడా గుర్తించింది. ఇది ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య పెంచడానికి ఉపయోగపడుతుంది.  


ఎనర్జీ ఎఫిసియంట్ సర్వీసెస్ లిమిటెడ్ (EESL) CEO విశాల్ కపూర్ ఇటీవల గోవాలో నిర్వహించిన G20 సమ్మిట్ సమావేశంలో వివరాలు వెల్లడించారు. EV మార్పుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఆసక్తి ఉన్న వాళ్లు ఏపీకి తరలి రావాలని సూచించారు.   


CESL భారతదేశంలో EV విప్లవాన్ని ప్రోత్సహిస్తుందని, చమురుపై ఆధారపడడం తగ్గిస్తుందని, అధిక ఇంధన భద్రత, తక్కువ ఉద్గారాలు,  మెరుగైన గాలి నాణ్యత వంటి ప్రయోజనాలను అందిస్తుందని విశాల్ కపూర్ తెలిపారు. పనులు సులభంగా చేసుకునేలా ఇంధన పునర్వినియోగం అయ్యేలా పని చేస్తుందన్నారు. ఆర్థిక వృద్ధి, ఉద్యోగ అవకాశాలను స్థానికంగా తయారీ, నూతన ఆవిష్కరణలు ప్రేరేపిస్తాయని విశాల్ కపూర్ తెలిపారు. 


విశాల్ కపూర్ వివరాల మేరకు.. కన్వెర్జన్స్ ఎనర్జీస్ సర్వీస్ లిమిటెడ్ (CESL)  గ్రాస్ కాస్ట్ కాంట్రాక్టింగ్ మోడల్ ప్రొక్యూర్‌మెంట్‌ను క్రమబద్ధీకరిస్తుంది. ఆర్థిక వ్యవస్థలను అన్‌లాక్ చేస్తుంది. కార్యాచరణ ఖర్చులను తగ్గిస్తుంది. CESL వివరాల ప్రకారం ఎలక్ట్రిక్ వాహనాల రేట్లు డీజిల్ వాహనాలతో పోలిస్తే 31%, CNG వాహనాల కంటే 18% తక్కువ. 


EESL సీనియర్ సలహాదారు చంద్ర శేఖర రెడ్డి మాట్లాడుతూ.. ఎలక్ట్రిక్ మొబిలిటీకి ఆంధ్రప్రదేశ్ ప్రోయాక్టివ్ విధానం అనుసరిస్తోందన్నారు. ఎలక్ట్రిక్ వాహనాలను ఉపయోగిస్తూ పర్యావరణ పరిరక్షణకు తమ ప్రభుత్వం సహకారాన్ని అందిస్తుందన్నారు. ఇన్వెంటివ్ ఇనిషియేటివ్స్, మౌలిక సదుపాయాల కల్పన, ఎలక్ట్రిక్ వాహనాల ప్రోత్సహించడంలో ఆంధ్రప్రదేశ్ నిబద్ధతతో ఉందన్నారు. 


50 వేల బస్సులే లక్ష్యం
ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించేలా ఢిల్లీ, బెంగళూరు రాయితీ ఒప్పందాలపై సంతకం చేశాయి. 150కి పైగా ఎలక్ట్రిక్ బస్సులు ఇప్పటికే ఢిల్లీ వీధులను తిరుగుతున్నాయి. ఇది స్పష్టమైన మార్పును సూచిస్తుంది. 2030 నాటికి దేశవ్యాప్తంగా దాదాపు 50,000 ఎలక్ట్రిక్ బస్సులను నడిపేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. ఇందులో భాగంగా ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీస్ లిమిటెడ్ అనుబంధ సంస్థ కన్వర్జెన్స్ ఎఫిషియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (CESL), జాతీయ ఎలక్ట్రిక్ బస్ ప్రోగ్రామ్ (NEBP) ద్వారా భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహన విప్లవాన్ని ప్రోత్సహిస్తోంది. 


ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించడం, తయారు చేయడం దీని ప్రధాన లక్ష్యం. ప్రధాన నగరాల్లో ఎలక్ట్రిక్ బస్సులను విస్తృతంగా నడిపేలా చర్యలు తీసుకుంటుంది. ఇందులో చేరాలని CESL మహానగరాలను ఆహ్వానించింది. సూరత్, హైదరాబాద్, బెంగళూరు, కోల్‌కతా, ఢిల్లీ మొదలైన ప్రధాన నగరాల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. 5,450 ఎలక్ట్రిక్ బస్సులతో నగరాలు గ్రీన్ సిటీలుగా మారనున్నాయి.