కృష్ణా(Krishna) జిల్లా గూడూరు(Guduru) మండలం కోకనారాయణపాలెం(Kokanarayana Palem) సర్పంచ్‌ బండి రమేష్‌(Bandi Ramesh) అంతిమ యాత్రలో పాల్గొన్నారు మంత్రి జోగి రమేష్‌(Minister Jogi Ramesh). స్వయంగా పాడె మోశారు. ఆయనతోపాటు మాజీ మంత్రి పేర్ని నాని(Perni Nani) కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇద్దరూ చెరోవైపు మృతదేహాన్ని పట్టుకొన్నారు. 

Continues below advertisement


అంతిమ యాత్రకు ముందు సర్పంచ్‌  బండి రమేష్‌ ఫ్యామిలీని ఓదార్చారు మంత్రి జోగి రమేష్. అన్న విధాలుగా పార్టీ అండగా ఉంటామన్నారు. 



మంత్రిగా నియమితులైన జోగి రమేష్‌కు మద్దతుగా కృష్ణాజిల్లాలో ఊరేగింపు చేపట్టారు.  ఈ ఊరేగింపులో బండి రమేష్ పాల్గొన్నారు. సందడి చేశారు. అంతా సరదాగా ఉన్న టైంలో బండి రమేష్‌ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. 






ఊరేగింపులో కుప్పకూలిన రమేష్‌ను వెంటనే ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆయన మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. బండి రమేష్‌ మరణ వార్త విన్న మంత్రి జోరి రమేష్‌ షాక్‌కి గురయ్యారు. అప్పటి వరకు తనను అభినందిస్తూ సందడి చేసిన వ్యక్తి అకస్మాత్తుగా మరణించాడని తెలుసుకొని బాధపడ్డారు. 


బండి రమేష్‌ మరణ వార్తతో కోకనారాయణ పాలెం కూడా విషాదంలో మునిగిపోయింది. పోస్టుమార్టం ప్రక్రియ పూర్తైన తర్వాత ఇవాళ స్వగ్రామంలోనే రమేష్ అంత్యక్రియలు జరిపారు.


అంత్యక్రియలకు ముందు ర్యాలీ నిర్వహించారు. అందులో మంత్రి జోగి రమేష్‌, మాజీ మంత్రి పేర్ని నాని పాల్గొన్నారు. సర్పంచ్‌తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. రమేష్ ఫ్యామిలీకి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. సిన్సియర్‌ నేతను కోల్పోవడం బాధగా ఉందన్నారు పేర్ని నాని.