IPS Officers Promotions :  ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 11 మంది సీనియర్ ఐపీఎస్ (IPS Officers) లకు పదోన్నతి కల్పించింది. 2006 బ్యాచ్ కు చెందిన 11 మందికి ఐజీ(IG)లుగా ప్రమోట్ చేసింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులను జారీ చేసింది. 2024 జనవరి 1 నుంచి ఈ పదోన్నతులు వర్తించనున్నాయి. ఐజీలుగా పదొన్నతి పొందిన వారిలో ఎస్వీ రాజశేఖర్ బాబు, కెవీ మోహన్ రావు, పీహెచ్‌డీ రామకృష్ణ, జి.విజయ్ కుమార్, ఎస్.హరి కృష్ణ,  ఎం. రవి ప్రకాష్, కొల్లి రఘురామ్ రెడ్డి, సర్వశ్రేష్ట త్రిపాఠి, జీవీజీ అశోక్ కుమార్ ఉన్నారు.