విజయవాడ ఎంపీ కేశినేని నాని ప్రత్యక్ష రాజకీయాలకు దూరం కావాలని నిర్ణయించుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులను కూడా రాజకీయాలకు దూరంగా ఉంచాలని అనుకుంటున్నారు. తాను ఇక పోటీ చేయబోనని ఇటీవల పార్టీ అధినేత చంద్రబాబును కలిసి నేరుగా చెప్పినట్లుగా తెలుస్తోంది. విజయవాడ మేయర్ అభ్యర్థిగా కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ పడిన కేశినేని నాని కుమార్తె శ్వేత కూడా కొంత కాలంగా రాజకీయాల్లో యాక్టివ్‌గా లేరు. ఆమె గతంలో టాటా ట్రస్ట్‌లో కీలకంగా పని చేసేవారు. మళ్లీ టాటా ట్రస్ట్‌లోనే పనిచేసేందుకు వెళ్లిపోయినట్లుగా తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయను కాబట్టి ఇప్పటి నుంచి సమర్థుడైన అభ్యర్థిని ఎంపిక చేసుకోవాలని చంద్రబాబుకు సూచించినట్లుగా తెలుస్తోంది. ఎన్నికల్లో పోటీ చేయనప్పటికీ తాను తెలుగుదేశం పార్టీలోనే ఉంటానని ఆయన చెబుతున్నారు.
Also Read : "ఎయిడెడ్" స్వాధీనానికి బెదిరింపులు .. ఏపీ ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం !
కేశినేని నాని ముక్కుసూటిగా మాట్లాడే రాజకీయ నేతగా పేరు ఉంది. ఆయనకు ఇటీవలి కాలంలో బెజవాడ టీడీపీ నేతలతో సరిపడటం లేదు. వర్గపోరాటం ఎక్కువ అయింది. కార్పొరేషన్ ఎన్నికల సమయంలో కూడా ఇది బయటపడింది. అయితే అప్పట్లో పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు మాట్లాడి పరిస్థితుల్ని సర్దుబాటు చేశారు. కార్పొరేషన్ ఎన్నికల్లో పరాజయంతో కేశినేని నాని సైలెంటయ్యారు. ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకోవడం ఆసక్తి రేపుతోంది.
Also Read : పరిషత్ పీఠాల కోసం రచ్చ రచ్చ - పలు చోట్ల వైఎస్ఆర్ సీపీ ఎంపీటీసీ ఆందోళన !
తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా కేశినేని నాని ఇలాంటి కఠినమైన నిర్ణయాలు తీసుకున్నారు. కేశినేని నాని రాజకీయాల్లోకి రాక ముందే కేశినేని ట్రావెల్స్ ఓనర్‌గా పేరు ఉంది. ఆయన కుటుంబం ఏళ్ల తరబడి ట్రావెల్స్ బిజినెస్‌లో ఉంది. అయితే అధికార పార్టీ తరపున ఎంపీగా ఉన్నప్పుడు ప్రతిపక్ష వైసీపీ విమర్శలు చేసిందన్న కారణంగా ఆయన తన వ్యాపారాన్ని కూడా నిలిపి వేశారు. అప్పట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలిచి అలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని చెప్పినా వినలేదు.
అయితే కేశినేని నాని పార్టీలో ఉన్న వర్గ పోరాటం నేపధ్యంలో తన పంతం నెగ్గించుకోవడానికే పోటీ నుంచి విరమణ అనే ఓ ప్రచారం ప్రారంభించారన్న అభిప్రాయం కూడా టీడీపీలోని ఓ వర్గం వినిపిస్తోంది. అయితే కేశినేని నాని వర్గీయులు మాత్రం ఈ అంశంపై స్పందించడం లేదు. పార్టీలో ప్రాధాన్యం కోసం బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేసే తత్వం కేశినేని నానిది కాదని వారంటున్నారు. కేశినేని నాని నిర్ణయంపై చంద్రబాబు ఎలా స్పందించారన్నదానిపై స్పష్టత లేదు.
Watch Video : ‘‘జగనన్నా.. పగటిపూట కరెంటు ఇస్తానంటివే..’’ ఆవేదనతో రైతు సెల్ఫీ వీడియో