ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మటన్ మార్టులు పెట్టాలని నిర్ణయం తీసుకోవడం హాట్ టాపిక్ అయింది. తర్వాత అది శాఖాపరమైన ప్రతిపాదనేనని ఇంకా నిర్ణయం తీసుకోలేదని అక్కడి పశు సంవర్థక మంత్రి అప్పలరాజు ప్రకటించడంతో వివాదం సద్దుమణిగింది. అయితే తెలంగాణలో ఇప్పుడు మాటన్ మార్టుల ప్రస్తావన వచ్చింది. ప్రత్యేకంగా మార్టులని చెప్పకపోయినా సూపర్ మార్టుల స్థాయి దుకాణాలను ఏర్పాటు చేయాలన్న ఆలోచన చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. ప్రజలకు శుద్ధమైన మటన్ అందించే దిశగా పశుసంవర్ధక శాఖ అడుగులు వేస్తోందని ఇందు కోసం కీలకమైన నిర్ణయాలు తీసుకోబోతున్నట్లుగా అధికారులు చెబుతున్నారు.
Also Read : ఏపీ వదిలేసి తెలంగాణకు వచ్చేస్తా... తెలంగాణ అసెంబ్లీలో జేసీ దివాకర్ రెడ్డి...
ముఖ్యంగా మటన్ దుకాణాలను ప్రభుత్వ పరిధిలోకి తీసుకురావాలని దాదాపుగా నిర్ణయించారు. ప్రభుత్వమే ప్రతి జిల్లాలో ఒకటి లేదా రెండు వధశాలలు ఏర్పాటు చేయాలని ఫ్లాన్ చేస్తోంది. వీటిని స్థానిక మటన్ షాపులకు లింక్ చేస్తారు. అక్కడి నుంచి వినియోగదారులు కొనుక్కెళ్లవచ్చు. మటన్ దుకాణాల యజమానులు కూడా ప్రభుత్వం సరఫరా చేసే మటనే అమ్మాల్సి ఉంటుంది. ఈ ప్రతిపాదనలు ఇప్పటికే రెడీ అయ్యాయి ప్రభుత్వం తుది అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది.
Also Read : కాంగ్రెస్‌లో ఎవరూ హీరోలు కాదు.. రేవంత్‌పై ఊగిపోయిన జగ్గారెడ్డి !
మటన్ దుకాణాలు అపరిశుభ్ర వాతారవణంలో ఉంటాయన్న ఫిర్యాదులు ఉన్నాయి. అదే సమయంలో తెలంగాణ ప్రభుత్వం మేకలు, గొర్రెల యూనిట్లను పెద్ద ఎత్తున లబ్దిదారులకు సబ్సిడీపై పంపిణీ చేస్తోంది. వాటి వల్ల భారీగా ఉత్పత్తి ఉండనుంది. తెలంగాణ ప్రజల అవసరాల మేరకే ప్రభుత్వం పంపిణీ చేసిన మేకలు, గొర్రెల పథకం ఉపయోగపడాలని.. ఎక్కువ అయితేనే ఎగుమతి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
ఆ యూనిట్ల లబ్దిదారులకు మెరుగైన రేట్లు వచ్చేలా చూడటం.. ప్రజలకు పరిశుద్ధమైన మటన్ అందేలా చూసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. తెలంగాణ మార్క్ మటన్ సూపర్ మార్టులపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. మటన్ మార్టుల ప్రతిపాదన తెచ్చినందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై సోషల్ మీడియాలో వ్యతిరేక ప్రచారం జరిగింది. అలాంటిది జరగకుండా అధికారులు ముందు జాగ్రత్త పడనున్నారు.