Watch: ‘‘జగనన్నా.. పగటిపూట కరెంటు ఇస్తానంటివే..’’ ఆవేదనతో రైతు సెల్ఫీ వీడియో
ఏపీ ప్రభుత్వ తీరుపై అనంతపురం రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘‘జగనన్నా.. పగటిపూట కరెంటు ఇస్తానంటివే..’’ అంటూ ప్రశ్నిస్తున్నారు. రాత్రి పూట కరెంటు ఇవ్వడం వల్ల మోటార్లు ఆన్ చేసేందుకు చీకట్లో వెళ్లాల్సి వస్తోందని రైతులు ఆవేదన చెందుతున్నారు. విష పురుగులు, క్రూర జంతువుల బారిన పడుతున్నామని వాపోతున్నారు. పగటి పూట 9 గంటల కరెంటు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించిందని గుర్తు చేస్తున్నారు. ఈ మేరకు రైతు ఆవేదనతో చేసిన సెల్ఫీ వీడియో వైరల్ అవుతోంది.